Skip to main content

Sri Veda Narayana Swamy Temple - శ్రీ వేదనారాయణస్వామి ఆలయం

తిరుపతి సమీపంలో ఉన్న నాగలాపురంలో ఉంది వేదనారాయణ స్వామి దేవాలయం. నాగలాపురం అసలు పేరు ''హరిగండపురం''. ఈ వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఇలా ఉంది. కృష్ణదేవరాయలు కళింగ యుద్ధం తర్వాత కుంభకోణంలో జరుగుతోన్న మహాముఖ ఉత్సవానికి వెళ్తూ మార్గమద్యంలో తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుని నాగలాపురంలో విడిది చేసినప్పుడు శ్రీహరి వేదనారాయణ స్వామి రూపంలో కనిపించి తనకు సప్త ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. ఆలయ నిర్మాణానికి అయ్యే సొమ్మును ఇచ్చి స్వామి పూజాదికాల కోసం ''హరిగండపురం'' (ప్రస్తుత నాగలాపురం) గ్రామాన్ని హరిదాసుడైన వడమాల అనే వ్యక్తికి దానం ఇచ్చాడు. హరిదాసుకు ఆలయ నిర్మాణం అప్పజెప్పాడు. నాటి హరిగండాపురమే నేటి నాగలాపురం. కృష్ణదేవరాయల తల్లి నాగులాంబ పేరు మీదుగా కట్టించిన ఈ గ్రామం నాగలాపురంగా ప్రసిద్ధిచెందింది.

ఆలయ విశిష్టత :
ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ప్రతియేడు మార్చి నెల 23, 24, 25/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. గరుడసేవా, రథోత్సవాలను కన్నుల పండగగా జరుపుతారు. వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్‌నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు...ఇలా ప్రతి పర్వదినాన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు మూడు పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

వేదనారాయణస్వామి ఆలయం :

ఆలయ సంప్రదాయంలో రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలకు ఆలయాలు నిర్మించి పూజిస్తున్నాం. కానీ, వరాహ, కచ్ఛప, మత్స్య అవతారాలకు ఆలయాలు అరుదు. తిరుమలలో వరాహస్వామి ఆలయం ఉన్నట్లే శ్రీకూర్మంలో కచ్చపేశ్వర ఆలయం, మత్స్యావతారానికి నాగలాపురంలో ఆలయాలు వెలిశాయి.

చెన్నై - తిరుపతి రహదారిలో పుత్తూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది నాగలాపురం. హరిగండపురం అని ఈ నగరానికి పూర్వపు పేరు.

ఇక్కడ మత్స్యావతారం ధరించి సోమకాసురుని నుంచి వేదాలను తెచ్చిన విష్ణుమూర్తి వెలశాడు. ఇదెంతో ప్రసిద్ధి చెందింది.

ఆలయ నిర్మాణ వైభవం - శాసన సాక్ష్యం
ఈ ఆలయ కుడ్యాలపై తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృత భాషల్లో వేసిన శాసనాలు కనిపిస్తాయి. అనేక శాసనాలు ఆలయ నిర్వహణ, నిత్య నైమిత్తిక పూజలకోసం, ఉత్సవాల నిర్వహణ కోసం కృష్ణదేవరాయలు దానం చేసిన వివరాలు తెల్పుతున్నాయి.

స్థలపురాణము :

స్థలపురాణము మనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.

సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి మరోవైపు... వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.

సూర్యపూజోత్సవం శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్యపూజోత్సవం. ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

చారిత్రకాంశాలు శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణస్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు.

చోళరాజుల అనంతరం చోళరాజుల అనంతరం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆలయ ఉత్తర గోపురం మీది శాసనం తెలియజేస్తోంది. రాయలనాటి శిలానైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడలను తీర్చిదిద్దారు. పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.

నాగలాపుర ఆలయంలోని స్వామి మత్స్యావతారంలోని విష్ణువు. విష్ణుమూర్తి ఉభయ పార్శ్వాలలో శ్రీదేవి, భూదేవి ఉన్నారు. ఇది ఈ స్వామి విశిష్టత. ద్వారపాలకులుగా జయ, విజయులు ఉండాల్సిన చోట వినాయకుడు, వైష్ణవి (దుర్గ) నిలిచి ఉన్నారు. ఇంకో విశేషం ఏమిటంటే స్వామికి ఎదురుగా నిలబడాల్సిన గరుత్మంతుడు స్వామికి అభిముఖంగా కానరాడు. అసలు స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం మరో విశేషం. ప్రతి ఏటా మార్చి నెలలో సూర్యుని కిరణాలు అస్తమయం అయ్యేటప్పుడు మొదటిరోజు స్వామివారి మత్స్య పుచ్చం మీద, రెండోరోజు స్వామి నాభి పైన, మూడోరోజు స్వామి కిరీటంపై ప్రసరిస్తాయి. ఈ ఖగోళ సౌందర్య విశేషాన్ని మార్చి నెలలో తెప్పోత్సవాల సందర్భంలో తిలకించవచ్చు.

నాగలాపుర ఆలయం చుట్టుపక్కల ఉన్న ఆలయాల కంటే ఈ ఆలయ వైశాల్యం ఎక్కువ. నాలుగు వైపులా ప్రాకార గోపురాలు ఉన్నాయి. ప్రాకారమే రాజకోటలా ఉంటుంది. నాలుగువైపులా నాలుగు గోపురాలు ఉన్నప్పటికీ పశ్చిమం వైపు ఉన్న ద్వారం నుండి మాత్రమే లోనికి ప్రవేసించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోకి ఈ ఆలయం వచ్చిన తర్వాత పశ్చిమ ద్వార గోపురాన్ని ఎత్తుగా కాకుండా వెడల్పుగా పునర్నిర్మించి 1976లో ధ్వజస్తంభాన్ని కూడా మార్పు చేసి శిథిల ప్రాంగణ మాళిగను జీర్ణోద్ధరణ కావించడం జరిగింది. మిగిలిన గోపురాలు జీర్ణోద్ధరణ చేయడం జరుగుతోంది.

రెండవ ప్రాకారం పడమటి గోపురం ద్వారానే లోనికి ప్రవేశించాలి. లోపలికి వెళ్ళగానే నాలుగువైపులా మండపాలను దర్సించవచ్చు. ఈ ఆలయ నిర్మాణం, వైశాల్యం, ఇంకా ''గ్రౌండ్ ప్లాను'' విజయనగర వాస్తు రీతిని అనుసరించి ఉన్నాయి. ఇక్కడ కుడివైపు వేదవల్లి అమ్మవారి ప్రత్యేకమైన గుడి ఉన్నది. ఇది వేదనారాయణ స్వామి ఆలయానికి ఎదురుగా నైరుతి దిక్కున ఉంది. వేదవల్లి అమ్మవారు తూర్పుముఖంచేసి ఉంది. ఇక్కడే గరుత్మంతుని పెద్ద విగ్రహం నిలుచున్న భంగిమలో ఉన్నది చుట్టూ ఉండే ప్రాకార మండపాల్లో నాలుగు మూలల్లోని వివిధోపయోగ గదులున్నాయి. ఈ రెండో ఆవరణలోకి వచ్చిన వెంటనే ఎడమవైపున వీరాంజనేయ, లక్ష్మీ నరసింహ, కోదండరాముడు, సీతాలక్ష్మణ సమేత ఆలయాలు మూడింటిని చూడవచ్చు. ఆలయానికి ఆగ్నేయదిశలో వంటశాల ఉంది. దానికి ఎదురుగా నైరుతి దిక్కులో ఆలయ పరిపాలన అధికారి కార్యాలయం ఉంది.

మూడవ ప్రాకారం లోపల ప్రధాన ఆలయం ఉంది. ఆలయం ముందు వేదవల్లి అమ్మవారి గుడికి కుడివైపున సుమారు 30, 40 అడుగుల విస్తీర్ణంగల ప్రాంగణం మధ్యలో వేదనారాయణ స్వామి ప్రధాన ఆలయం ఉంది. ఆలయద్వారంలో గణపతి, దుర్గామూర్తులు వెడల్పైన వరండాలో తిన్నెపై పహరా కాస్తున్నారు.

లోపల ముఖమండపం తగినంత పెద్దదిగా.. అంటే.. వేదవల్లి తాయారు గుడి కంటే పెద్దదిగా ఉంది. ముఖ మండపం తర్వాత ఒక అంతరాళం. ఇక్కడ ఎడమవైపు స్వామివారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు చిన్నగదిలో ఉన్నాయి. కుడివైపు గదిలో పన్నెండుమంది ఆళ్వారులు, రామానుజులు, విష్వక్సేనులవారి విగ్రహాలు ఉన్నాయి. ఆళ్వారుల విగ్రహాలు అన్నీ చక్కని నల్లని రాతితో మలచబడి ఉన్నాయి. ఇవి ఆలయంలో తవ్వకాలు జరిపినప్పుడు దొరికాయి.

స్వామివారి గర్భగుడి వెలుపల గోడలో వీణాదారి దక్షిణామూర్తి, నిల్చున్న గణపతి, దుర్గా, లక్ష్మీ వరాహస్వామి, బ్రహ్మ, హయగ్రీవుల విగ్రహాలు అపూర్వంగా ఉంటాయి.

స్వపనమండపం దాటిన తర్వాత గర్భగుడిలో వేదనారాయణ స్వామి విగ్రహాన్ని దర్సించవచ్చు. కిరీట, కర్ణకుండల, కంఠహారాలతో అలంకరణ చేసిన స్వామి ఉభయదేవేరులతో దర్శనం ఇస్తాడు. స్వామికి నడుము కింది భాగం మత్స్య రూపమే. స్వామికి నిత్య పూజలు సుప్రభాతంతో మొదలై ఏకాంతసేవ వరకూ జరుగుతాయి. మధ్యాహ్నం నాలుగు గంటలు విశ్రాంతి. తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవం, సూర్య పూజ మొదలైన ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి శనివారం అభిషేకం జరుగుతుంది. మార్చినెలలో జరిగే సూర్యపూజకు, బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కృపకు పాత్రులౌతారు.

 
    
    


ఎలా వెళ్ళాలి?
తిరుపతికి 68 కి.మీ., మద్రాసుకు 73 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువైన వేదనారాయణుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డుమార్గం ద్వారా వచ్చే వారికి దేశంలోని అన్ని ప్రధాన బస్‌స్టాండ్‌ల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. తిరుమల బస్‌స్టాండ్‌ నుంచి ఊత్తుకోట మీదుగా చెన్నై వెళ్లే మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

రైలు, వాయు మార్గాల్లో వచ్చేవారు తిరుపతి లేదా చెన్నై చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.