Translate

Kanipakam Vinayaka Temple - కాణిపాకం వినాయకుడి ఆలయం

మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం కాణిపాకం వినాయకుడి చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసేఉంటుంది, చాలా సార్లు వెళ్లి ఉంటారు కూడా.. మరి  ఈ ఆలయం యొక్క చరిత్ర,  వాటివిశేషాలు మీకు తెలుసా…?  చాలా వరకూ ఎవరికీ తెలియవు. ఈ దేవాలయం లో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా… అయితే రండి మరి విశేషాలేమిటో చూద్దాం..

తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం.

హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు.

కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా వుంటుంది. కానీ కాణిపాకం గుడి వున్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయభూమి.

బావి కొద్దిరోజులకు వారు వ్యవసాయభూమిలో నీరెండిపోవటం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరోస్తాయని తవ్వటం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం వూరటం మొదలైంది. కొద్దికొద్దిగా బావి నిండుతుంది.

కొబ్బరికాయల నీరు ముగ్గురన్నదమ్ములూ ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్థులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది.

విగ్రహం దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళపేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావిలోనే వుంది.

బావి నీరు మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమపవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు.

చుట్టుపక్కల గ్రామాలు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది.

తిరుమల తిరుపతి ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ వుండండి. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

దర్శనీయ దేవాలయాలు కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి.

కుళొత్తుంగ మహారాజు ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది.

అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా వుంది. ఈ ఊరు మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయములతో నిండి వుంది.

ఇతర విశేషాలు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.

వరసిద్ది వినాయక ఆలయం ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి.

ఆలయ ప్రాంగణం వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

కాణిపాకం వినాయకుడుకి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోనిచిత్తూరు జిల్లాలో ఇరాలా మండలంలో బాహుడా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది.  కాణి అంటే తడి భూమి పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అని అర్థం.

మొట్టమొదట ఈ ఆలయాన్ని స్థాపించింది ఎవరు? అసలు ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు కథ ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే ముగ్గురు సోదరులు ఉండేవారు.  వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకుండా కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు.

దగ్గరలో ఉన్న ఒక బావిలో, వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరు నిత్యం వాడుకునే వారు. కానీ ఆ బావి క్రమంగా ఎండిపోవడంతో, వారిలో ఒకరు దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్లనిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది.

ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులోనుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సుడిగాలి జలాల నుండి  ఉద్భవించడం వల్ల దేవుడిని బయటకు తీయడం కష్టసాధ్యం అయ్యింది. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. క్రమంగా దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలవడం మొదలు పెట్టారు.ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది.. కాణిపాకం వినాయక స్వామి ఆలయ చరిత్ర..

ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు.ఆలయ అర్చకులు ఎల్లవేళలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఇక వినాయక చవితి ఉత్సవాలని తిలకించడానికి మన రెండుకళ్ళూ సరిపోవు సుమా…ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం గమనించవచ్చు.

ఇంతటితో ఈ దేవుడి కథ సమాప్తం అని అనుకుంటున్నారా… కాదు ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి…అందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి.. మరి తెలియని విశేషాలు ఏమిటో తెలుసుకోండి…

ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికీ కూడా వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అందులో ఒకటేమిటంటే… 50 సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారు.  క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వల్ల ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పట్టడం లేదు. ఇదే సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే. ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందని అని ఒక నమ్మకం. అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి  గుడిలోకి  ప్రవేశించడానికి ముందే తన తప్పులు అంగీకరిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకని  వైభవం విస్తృతంగా వ్యాప్తి చెంది దర్శనీయ ప్రదేశమైంది.

వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది. వాయువ్వ దిశలో “బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ప్రసిద్ధిచెందింది. అక్కడ షణ్ముఖ,దుర్గ దేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణి తో కూడిన సర్పము దర్శనమిస్తుంది. దేవతల సర్పంగా కొలవబడే ఈ పాము ఎవ్వరికీ ఎటువంటి హానీ చెయ్యదు అని అక్కడి భక్తులు చెప్పుతూ ఉంటారు. ఇక తూర్పు-ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ మహా విష్ణువు, జనమేజయుడి కలలో కనిపించడంతో ఈ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు. ఈ ఆలయంలో నవగ్రహాలు మండపం, అద్దాలమేడ కూడా ఉంటుంది. ప్రసిద్ధి కరమైన ఆంజనేయస్వామి గుడి కూడా కాణిపాకo లో దర్శనమిస్తుంది. దాదాపుగా, కాణిపాకం చుట్టూ అది సుమా ఊరులో మూడవ వంతు వరకు వివిధ ఆలయాలలో నిండి ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?

కాణిపారకం వినాయకుడిని చేరుకుననే భక్తులు వివిధ మార్గాలు ఎంచుకుంటారు!

రోడ్డు:

తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి  15 నిమిషాలు పడుతుంది. చిత్తూరు నుంచి వచ్చే భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

రైలు ద్వారా:

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచైనా చిత్తూరుకు లేదా, రేణిగుంట లేదా, గూడూరు లకు రైళ్ళు కలవు. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు.

విమానం ద్వారా:

రేణిగుంట విమానాశ్రయం ద్వారా కూడా కాణిపారకం వినాయకుడి  ఆలయం చేరుకోవచ్చు

Jwala Muhki Temple - జ్వాలాముఖి ఆలయం

కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం 'జ్వాలముఖి'. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా -ధర్మశాల హైవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఇది 51శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది.

ఇక్కడ ఈ జ్వాలేకాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారి అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా ముఖి ఆలయం.

జ్వాలాముఖి గురించిఅనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దక్షయజ్ఝం తర్వాత సతీదేవి తనను తాను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం.

జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట, అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు సైతం భంగపాటుకు గురికాక తప్పలేదు.

శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడలనుంచి, చిన్న నీటి కుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు. శ్రీయంత్రం ఉన్న ప్రదేశంలో ఎర్రని శాలువతోను బంగారు ఆభరణాలతోనూ కప్పి ఉంచుతారు. శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్క మతస్థులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తుంటుంది. అలాగే నూతన వధూవరులు అమ్మవారి దర్శనార్థం రావడం కూడా ఉంది.

ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు గోరఖ్ నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంటారు, మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్ నాథ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనుప గేట్లు కట్టిన నీటి కుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద పెద్ద పళ్లేలలో పళ్ళు, పూలు, పసుపు కుంకుమ ఎర్రవస్త్రంతో పాటు తీపి వంటకాలను సమర్పిస్తుంటారు. అమ్మవారి భక్తులలో అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది.

స్థలపురాణం పూర్వం కటోచ్ వంశానికి చెందిన ‘మహారాజా భూమా చంద్’ దుర్గాదేవికి పరమభక్తుడు. ఒక రోజు భూమా చంద్ కు స్వప్నంలో అమ్మవారు కనిపించి తాను జ్వాల’గా ఆ అడవులలో పూజా నైవేద్యాలు లేక పడి ఉన్నట్లు తనను వెలికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించవలసిందిగా సెలవివ్వగా మహారాజు ఆ అడవులలో వెతికి అమ్మవారిని కనుగొన్నారు. ఆమెకు దేవాలయం కట్టించి నిత్యపూజలు నిర్వహించసాగాడు.ఇప్పటి అక్కడ ‘జ్వాల’తప్ప మరే విగ్రహమూ కనిపించకపోవడం విశేషం.

సిక్కుల మతగురువు ‘గురునానక్’ సిక్కుల మతగురువు ‘గురునానక్' ఈ ప్రదేశానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణం నచ్చడంతో తపస్సు చేసుకుంటుండగా. గురునానక్ పై శతృత్వము పెంచుకున్న అక్బర్ , నానక్ దేవతగా పూజలు చేస్తున్న జ్వాలలను ఆర్పాలని ఆ ప్రదేశం మొత్తాన్ని కొన్ని నెలల పాటు నీళ్లతో నింపి ఉంచుతాడు. కొన్ని నెలల తర్వాత కూడా మంటలు ప్రజ్వలిస్తూ ఉండటాన్ని చూసిన అక్బరు, నానక్ ను మహాపురుషుడిగా అంగీకరించి, అమ్మవారికి బంగారు ‘ఛత్రి'ని సమర్పించి అమ్మవారికి క్షమార్పణ అడిగి ఢిల్లీ తిరిగి వెళ్లిపోతాడు.

దౌలధర్ పర్వతాల దిగువున దౌలధర్ పర్వతాల దిగువున ..ధర్మశాల..సిమ్లా రోడ్డ్ మార్గం పక్కనే ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు.అమ్మవారికి ' దుర్గా శప్తశతి ' పారాయణతో అయిదు దశలుగా పూజలు , హారతి , హోమాలు నిర్వహిస్తారు . ప్రతీ రోజు 11-30 నుంచి 12-30 వరకు మద్యాహ్నపు హారతి కోసం మూసివేస్తారు . మిగతా సమయం అంటే రాత్రి 8-30 వరకు మందిరం తెరిచే వుంటుంది .

నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నుడుమ నిత్యాగ్నిహోత్రంలా నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నుడుమ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి రూపుని దర్శించుకుని పునీతులవుతుంటారు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ, ఆమె పేరుతో దేశంలోని అనేక చోట్ల ఆలయాలు కనిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ లోని శక్తిసాగర్ ఆలయం, ముక్తినాద్ ఆలయం, జ్వాలామయి ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తుంటారు.

815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో ఘోరక్ నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొందినట్లు వారి శిష్యులు చెప్తారు. 815లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురంతో సహా పాలరాతి మందిరంను నిర్మించాడు. పెద్ద పెద్ద మంటపాలలో ఓ పక్క సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. మరో ప్రక్క మంటపంలో నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడ గంట ఉంచారు. ఈ మందిరంలో ముఖ్యంగా ఏడు జ్వాలలను దర్శించుకోవాలి అదే అమ్మవారి రూపం.

సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు దేవీ భాగవతం ప్రకారం సతీదేవి దక్షవాటికలో ఆత్మత్యాగం చేసుకున్న తరువాత సతీదేవి వియోగం భరించలేక రుద్రతాండవం చేస్తున్న శివుని కర్యోన్ముఖిని చేసేందుకు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా అవి అష్టాదశ పీఠాలుగాను , 51 వ పీఠాలుగాను , 108 పీఠాలుగాను వుద్భవించేయి . ఆ 51 పీఠాలలో సతీ దేవి యొక్క ' నాలుక ' పడ్డ ప్రదేశం యీ జ్వాలాముఖి క్షేత్రం .

ఎలా వెళ్ళాలి? 
రోడ్డు మార్గం: దేవాలయం ఉన్న ప్రదేశానికి రోడ్ మార్గం కనెక్ట్ అయ్యి ఉన్నది. రాష్ట్రంలో పంజాబ్, హర్యానా నుండి అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాంగ్రాకు ఫ్రీక్వెంట్ గా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గం: గౌజ్ రైల్ హెడ్ సమీపంలోని పథాన్ కోట రైల్వే స్టేషన్. ఇది 123 కిమీ దూరంలో ఉంది. విమాన మార్గం: కాంగ్రా కు సమీపంలో దర్మశాల ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉంది. అక్కడి నుండి సుమారు 47కిలోమీటర్ల దూరంలో ఆలయం చేరుకోవచ్చు.అక్కడి నుండి క్యాబ్ లేదా బస్ లో ప్రయాణం చేయవచ్చు. అలాగే చంఢీగడ్ ఎయిర్ పోర్ట్ సుమారు 200కిలో మీటర్ల దూరంలో ఉంది.

Jogulamba Temple జోగులాంబ దేవాలయం - అలంపురం

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. కొన్ని వందల ఏళ్ల పాటు పుణ్య క్షేత్రంగా విరాజిల్లిన ప్రదేశం ఇప్పుడు శిధిలావస్థకు చేరుకుంది. దక్షిణ కైలాసం గా భక్తుల నీరాజనాలు అందుకున్న ఆ చారిత్రక పట్టణం ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితం కావచ్చు కానీ అప్పట్లో శిల్ప సంపదకు నిలువెత్తు దర్పణంలా సాక్షాత్కరించింది.

స్థల పురాణంలో హేమలాపురం, ఎల్లమ్మపురంగా ఉండేది. అలంపూర్‌ దేవాలయంలో తోటను ఆనుకొని ఉన్న గుంతలో తవ్వకాలు జరిపినప్పుడు శతవాహనంలో నాణ్యాలు, పూసలు, దక్షిణవర్త శంఖం, అందమైన గాజులు, నలుపు, ఎరుపు రంగు పూత వేయ బడిన చిన్న మట్టి పాత్రలు, నలుచెదరం 21 అంగుళాల పొడవు వెడల్పు ఉన్న ఇటుకలు బయటపడడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు.

బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలంపూర్ తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ ప్రదేశం ఒడ్డున కలదు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు దక్షిణ దిక్కున ఈ చారిత్రక పట్టణం ఉన్నది. జాతీయ రహదారికి చేరువలో ఉన్న అలంపూర్ కు బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

శ్రీశైల క్షేత్ర పశ్చిమ ద్వారమే ఈ అలంపుర క్షేత్రం... బాదామి చాళుక్యులు అలంపూర్‌లో నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. ‘‘పరమే శ్వర’’ అనే బిరుదుతో పాలించిన రెండవ పులేశి కాలంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. అలాగే బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాధిత్యుడు కనిపించడం జరుగుతుంది. ఆర్క బ్రహ్మా లయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది. అలంపూర్‌ ప్రాంతాన్ని క్రీశ 566 నుంచి 757 సంవత్సరం వరకు బాదామి చాళుక్యులు పరిపాలించారు. నవబ్రహ్మ ఆలయాల నిర్మాణాల్లో ఎర్ర ఇసుక రాళ్లను వాడడం జరిగింది.

ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి తెప్పించారు. శ్రీ కృష్ణదేవరాయలు క్రీశ. 1521 సంవత్సరంలో రాయచూర్‌ను సాధించి బాలబ్రహ్మేశ్వర స్వామికి, శ్రీ నరసింహస్వామికి దాన ధర్మాలు చేశారు. దక్షిణపదంలోని ప్రాచీన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం పురాణ ప్రసిద్దమైంది. ఆ మహా క్షేత్రానికి నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. అవి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవతం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాణ ఉమమహేశ్వరం. పశ్చిమద్వారంగా ఉన్న ఈ క్షేత్రం భాస్కర క్షేత్రమని, పరుశరామ క్షేత్రమని దక్షిణ కాశీ అని పిలువడం జరుగుతుంది.

కాశీ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం కూడా ఉంది. అలంపూర్‌లో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ, పాపనాశిని, మణికర్ణికలు 64 ఘట్టాలు ఉన్నాయి. దగ్గరలో కృష్ణ, తుంగభద్ర నదులు కూడా కలవు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో విశేషంగా బ్రహ్మమూర్తులు ఉన్నారు. ఇక్కడి లింగం ‘‘జ్యోతిర్‌జ్వాలమయం''. దీన్ని పూజించిన వారు అంతు లేని పుణ్యం పొందుతారు.

శక్తిపీఠం... జోగులాంబ ఆలయం... నవ బ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మే శ్వరుడు ప్రధాన దైవం. ఈ దేవాలయం క్రీశ 702 సంవత్సరంలో నిర్మించడం జరిగిందని స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. రెండవ ద్వారమే ఆలయ ప్రధాన ద్వారంగా ఉంది. దీనికి రెండువైపులా బ్రహ్మ అర్ధనారీశ్వర మూర్తులున్నారు. స్వామికి అఖండ దీపరాధానం, నిత్యపూజ, నైవేద్యాలు, శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు, శివరాత్రి సమయంలో రథోత్సవం జరుగుతుంది. 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠంగా పిలువబడుతున్న జోగుళాంబ అమ్మవారి ఆలయం, అలంపూర్‌, శ్రీశైలం, ద్రాక్షారామం, పిఠాపురంలు నాలుగు మనరాష్ట్రంలోనే ఉండడం గమనార్హం. అమ్మవారి దేవాలయం క్రీ.శ 7వ శతాబ్దంలో నిర్మించారు. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు, శ్రీ చక్రి ప్రతిష్ట చేసింది మొదలు నేటికీ భక్తుల పూజలు అందుకోవడం జరుగుతోంది. క్రీశ 14వ శతాబ్దంలో ముస్లింలు దండయాత్ర చేసి అమ్మవారి దేవాలయం ధ్వంసం చేశారు. స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో చిన్న గుడిలో పెట్టి పూజించేవారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయల కుమారుడు దేవరాయలు తండ్రి ఆజ్ఞాను సారం సైన్యంతో వచ్చి బహమనీ సైన్యాలను తరిమికొట్టి అలంపూర్‌ క్షేత్రాలను రక్షించాడు. ఈ సంఘటన 1390 లో జరిగిందని చరిత్ర చెబుతోంది. 600 సంవత్సరాల తరువాత జగదాంబ ఇష్టానుసారం పాత ఆలయం ఉన్నచోట అదే వాస్తు ప్రకారం కొత్త దేవాలయాన్ని నిర్మించిన దేవదాయ, ధర్మాదాయ శాఖ పాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవబ్రహ్మ ఆలయాల్లో కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవ బ్రహ్మ ఆలయాలు ఈ ప్రాంతంలో నిర్మించారు.

ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపురం అని స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రహ్మి శాసనంలో అలంపూర్‌ ప్రస్తావన ఉంది. నడుకస్రి అనే వాడు తన ఆయుష్షు పెరగడం కోసం భగవంతుడైన అలంపుర స్వామికి (బాలబ్రహ్మేశ్వర) కొంత భూమిని దారాదత్తం చేశాడు. గ్రామ దేవత అయిన ఎల్లమ్మ పేరుతో ఎల్లమ్మపురంగా ఉండి రానురాను అలంపురం, అలంపూర్‌గా మారడం జరిగింది.

సంతాన ప్రదాయిని... ఎల్లమ్మ ఈ ప్రాంతంలో జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆయన భార్య రేణుకదేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఇసుకతో కుండను తయారు చేసుకుని వాటితో నీరు తీసుకొని వచ్చేది. ఒకరోజు మహ రాజు వెయ్యి మంది భార్యలతో అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడు తుండగా చూసిన రేణుక తన మనసులో రాజు వైభవాన్ని, అతని భార్యల గురించి అనుకోవడం వలన మనోవికారం కలుగుతుంది. అందువల్ల ఆ రోజు ఇసుక కుండ తయారు కాదు. దాంతో రేణుక ఆలస్యం చేసి నీరు తీసుకురానందువల్ల జమదగ్ని కోపగించి ఆమెను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు. తల్లిని చంపడానికి పెద్ద కుమారులు ఎవరూ ముందుకు రారు. కానీ పరుశురాముడు మాత్రం తల్లి తలను నరికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడు. అప్పుడు జమదగ్ని సంతృప్తి చెంది ఏం వరం కావాల ని అడుగగా పరుశురాముడు తల్లిని బ్రతికించమని ప్రార్థిస్తాడు. రేణుక తల చాండల వాటికలో పడడం వల్ల బ్రతికించడం కష్టమని, ఈ తల ఎల్లమ్మ పేరుతో గ్రామదేవతల పూజలు అందుకుంటుందని జమదగ్ని చెప్పడం జరిగింది. మానవపాడు మండలం ఉండవెల్లి గ్రామంలో గుడి కట్టించి గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పూజించు కోవడం జరుగుతోంది. ఆమె శరీరం బ్రహ్మేశ్వర ఆలయంలో సంతానం లేని స్ర్తీలచే పూజలందుకుని సంతానం ఇచ్చే దేవతగా ఉంటుందని జమదగ్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ భూదేవి పేరుతో స్ర్తీలతో పూజలందుకుంటుంది.

నవబ్రహ్మ ఆలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చాలానే ఆలయాలను కట్టించారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ మరియు విశ్వ బ్రహ్మ అనే తొమ్మిది బ్రహ్మ ఆలయాలు నవ బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినాయి.

బాలబ్రహ్మశ్వర దేవాలయం ఆలయాలన్నింటిలో పెద్దది. తారక బ్రహ్మ దేవాలయం శిధిలమై ఉంటుంది మరియు గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు స్వర్గ బ్రహ్మ దేవాలయం సుందరమైనది మరియు చాళుక్యుల మచ్చుతునక.

సూర్యదేవాలయం క్రీ.శ. 9 వ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణు మూర్తి కి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఉన్నది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపూర్‌లో భక్తుల కోలాహలం తో కిటకిటలాడుతుంది.

అలంపూర్ ఎలా చేరుకోవాలి? విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.