Skip to main content

Posts

Showing posts from April, 2020

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం | Panchabhuta Shiva Lingam

సకల ప్రాణికోటికి ఆధారం పంచ భూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచ భూతాలకు ప్రతి రూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచ భూత శివలింగాలను పూజిస్తారు.

తిరుమలకు ఉన్న ఏడు నడకదారులు - Alternate Path to Walk to Tirumala

కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం మనం చాలా సౌకర్యవంతంగా వెల్ల గలుగుతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో భక్తులు ఎలా వచ్చేవాళ్లు?  తిరుమల చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండేవి?సాధారణంగా మనకు తెలిసినంత వరకు  అలిపిరి మెట్ల మార్గం ఒకటి శ్రీవారి మెట్టు మార్గం. ఈ రెండు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంతం నుంచి నడక మార్గం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.

తిరుమల తిరుపతి దేవస్థానం - Tirumala Tirupati Devasthanam

తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

కేరళ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం Sri Padmanabhaswamy Temple

శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభక్షేత్రం. మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఒకటి. కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్న ఈ దివ్యాలయం దేశంలో అత్యంత ఎక్కువ సంపదలున్న ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదిగా ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్ భాగవతం తెలుపుతోంది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ద్వాపరయుగంలో ఈ ఆలయాన్ని ఫాల్గుణం అని పిలిచేవారు. ఆ కాలంలో బలరాముడు ఈ దేవాలయాన్ని దర్శించి, ఇక్కడున్న పద్మ తీర్ధంలో స్నానం చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయ వైశిష్ట్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అనంత పద్మనాభుడి ఆలయం అత్య...

మన ఇండియాలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాలు

మన ఇండియాలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాలు, వాటి పేర్లు, ప్రదేశాలు శివుడు భారతదేశంలో ఎక్కువగా పూజించే దేవుళ్లలో ఒకరు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు విధ్వంసం చేసే దేవుడు. సాధారణంగా శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తారు.  ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆది దేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోళాశంకరుడు ఇలా వివిధ రకాల పేర్లుతో ఆ పరమశివున్ని పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకి జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. 12 జ్యోతిర్లింగాలు లేదా శివలింగాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుని నిజమైన భక్తులు జ్యోతిర్లింగాల వద్ద శివునికి ప్రణామాలు చెల్లించడానికి ప్రయత్నిస్తారు. మొత్తం జ్యోతిర్లింగాలను ఒకే ప్రయాణంలో సందర్శించటం సాధ్యం కాదు. అందువలన, భక్తులు ఒక సమయంలో ఒకటి లేదా రెండు జ్యోతిర్లింగాలను సందర్శించాలి. అలాగే వారి జ...

సంపంగి పువ్వుము - శ్రీమహావిష్ణువు పూజకు - ఓం నమః శివాయ పూజకు

I. సంపంగి.. పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది. సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ, మత్ర్పియం నాస్తి పాండవ మేరుతుల్య సువర్ణాని, దత్త్వా భవతియత్ఫలం ఏకేన స్వర్ణ పుష్పేన, హరిం సంపూజ్య తత్ఫలం సువర్ణ కురుమైర్దివ్యై, యైర్నధితో హరి: రత్న హీనై: సువర్ణాద్యై:, సభవేజ్జన్మ జన్మని సంపంగి పూలతో పూజచేయనివాడు మరుజన్మలో సువర్ణ రత్నాలా హీనుడవుతాడట. ఆయుష్షుకోసం దుర్వారపూలతో, సంతానంకోసం దత్తొరపూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలిపూవులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు, శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిరమాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కో...

త్రయీ ఆధ్యాత్మిక ప్రయాణం (Threaiee The Etemal Journey)

ప్రపంచంలోని వ్యక్తులు భగవంతుని నమ్మడంలో రెండు విధానాలను పాటిస్తారు . మొదటి వారు భగవంతుడు వున్నాడని నమ్మే ఆస్తికులు . రెండవవారు భగవంతుడు లేడని నమ్మే నాస్తికులు . ఆస్తికులు భగవంతుని మీద నమ్మకంతో ఆయన నామాన్ని ఉచ్ఛరిస్తే , నాస్తికులు భగవంతుని పై అపనమ్మకంతో ఉచ్ఛరిస్తారు . అది నమ్మకమైనా కావచ్చు , అపనమ్మకమైనా కావచ్చు . కాని ప్రతీ వ్యక్తి తన జీవితకాలంలో కనీసం ఒక్క సందర్భంలోనైనా ఆయన నామాన్ని మాత్రం ఉచ్ఛరించాల్సిందే ‍! అలాంటి అలౌకికమైన భగవంతుని వెతుకుతూ సాగే ఒక అమ్మాయి ఒంటరి ప్రయాణమే ఈ “ త్రయీ ” --- ఆధ్యాత్మిక ప్రయాణం ... Episode: 01 అజోz పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోz పి సన్ | ప్రకృతిం స్వామాధిష్టాయ సంభవామ్యాత్మమాయయా || జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకూ ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే మాయాశక్తి వలన జన్మిస్తున్నాను. -భగవత్గీత భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఆధ్యాత్మికత అనగానే ప్రపంచమంతా తిరిగి చూసేది భరతభూమినే. అనాదికాలం నుండి ఆధ్యాత్మికతను ఎంతో మంది జ్ఞాన పిపాసులకు పంచుతూనే వుంది. ఈ మహా భూ...