Translate

Sri Kashi Bugga Temple - కాశీ బుగ్గ శివాలయం

శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24x7 నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు.

శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు. ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నారు.

రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని భక్తులు అంటున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లేవారికి శివ లింగంపై పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో గతేడాది ‘సమయం’లో కథనం ప్రచురితమైంది. మూసీ నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కని, నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుందని వార్త రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టింది. సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసింది.

Location: https://goo.gl/maps/hr9XntwoRaoiY22t7

Kamandal Ganapathi Temple - శ్రీ కమండల గణపతి దేవస్థానము

కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమని కొరుకుతూ వినాయకుడిని భక్తితో పూజిస్తాం. అయితే ఇలా గణేశుడికి పూజలు చేసేది...మునులు, ఋషులు మానవులే కాదు.. దేవతలు సైతం పూజలను చేస్తారు. అలా జగన్మాతతో గణేశుడు పూజలందుకున్న కమండల గణపతిగా పూజలందుకున్నాడు.

కర్ణాటక రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పెట్టింది పేరు. కర్ణాటక రాష్ట్రంలో చూడాల్సిన అనేక ప్రదేశాల్లో చిక్క మంగళూరు ఒకటి. చిక్కమగళూరు ప్రకృతి అందాలు..కాఫీ తోటల ఘుమఘుమలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలో ఆలయాలెన్నో భక్తుల్లిన విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఇక్కడ నీటిని సేవిస్తే చాలు..అనేక రుగ్మతలు యాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగ ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యలెంటిని దూరం చేసుకోవడం కొరకు ఇక్కడకు అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం..

ఈ ఆలయంలోని వినాయకుడు మనకు యోగ ముద్రలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.వర్షాకాల సమయంలో పుష్కరిణిలో ఉండే నీరు స్వామివారి పాదాలకు తాకుతుంది.ఈ సమయంలో స్వామివారిని దర్శించి ఆ నీటిని మహా తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు.ఈ నీటిని తీసుకోవటం వల్ల సకల రోగాలు నయమవుతాయని భక్తులు భావిస్తారు.ఈ విధంగా పుష్కరిణిలోని నీరు వినాయకుడి పాదాలను తాకడం వల్ల ఇక్కడ వెలసిన స్వామివారిని కమండల గణపతి అని కూడా పిలుస్తారు.అయితే ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజలు మధ్యాహ్నం వరకే నిర్వహిస్తారు కనుక స్వామివారిని దర్శించుకోవాలంటే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని స్వామివారికి పూజలు చేస్తుంటారు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది
చిక్క మంగళూరు జిల్లాలోని కొప్ప పట్టణానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రదేశంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.

స్థలపురాణం
ఆలయ స్థల పురాణం ప్రకారం శని వక్రదృష్టి కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొన్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలనీ భావించి శివుడి కంటే ముందుగా గణపతిని ప్రార్ధించినదట, అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు సృష్టించాడని స్థల పురాణం తెలుపుతున్నది.ఇలా వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి కనిపించిన సృష్టించిన తీర్థాన్ని బ్రహ్మ తీర్థమనీ, కమండలం ధరించి దర్శనమిచ్చిన గణపతిని కమండల గణపతి అనే పేరు వచ్చినదని స్థల పురాణం. ఇక్కడే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.

ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది ఇక్కడ గణపతి విగ్రహం విశిష్టంగా ఉంటుంది. యోగముద్రలో కుర్చొన్న రీతిలో ఇక్కడ గణపతి విగ్రహం ఉండటం విశేషం. వర్షాకాలంలో ఇక్కడి పుష్కరిణిలోని నీరు గణపతి పాదం వరకూ చేరుతాయని చెబుతారు.

పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల ఆ సమయంలో గణపతిని దర్శించుకొంటే చేసిన సకల పాపాలు పోతాయని చెబుతారు. ఈ పుష్కరిణి కమలం ఆకారంలో ఉంటుంది. ఇక పుష్కరిణిలోని నీరు గణపతిని తాకడం వల్ల ఈ గణపతిని కమండల గణపతి అని అంటారు.

గణపతికి ప్రత్యేక పూజలు ఉదయం 7.30 గంటల నుంచి 8.30 వరకూ ఇక్కడి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎటువంటి పూజలు జరుపరు. అందువల్ల ఈ దేవాలయానికి వెళ్లాలనుకొంటే తెల్లవారుజామున ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.

కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలు భక్తులకు మేలుచేసేందుకు తీర్థాన్ని సృష్టించిందని స్థల పురాణం. కొండల్లో నుంచి భూగర్భంలో చేరుకుని కుండికలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలున్నాయంటారు. ఇక్కడి నుండే బ్రహ్మ నది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది. పుణ్యక్షేత్రాలైన కళస హోరనాడు ప్రాంతాల్ని సందర్శించేందుకు వచ్చే భక్తులు కమండల గణపతి ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్తుంటారు.


Sri Bugga Ramalingeswara Temple - శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం

అందమైన శిల్ప కళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి.

ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు. క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి - గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు. నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది. ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.

ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారం తో ఉంటె, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.
తెలంగాణ లో ఇదే " బుగ్గ రామలింగేశ్వర స్వామి " పేరుతొ వికారాబాద్ దగ్గరలో వేరొక ఆలయం ఉన్నది.

శివలింగానికి యోని పిటం లేదు. ఆలయ ప్రాంగణం లో వెనుక గోపురానికి ఎదురుగా ఉన్న మండపం లో శివలింగం ఉన్నది. కొంతమంది భక్తులు శివునికి నీళ్ళ తో అభిషేకం చేస్తున్నారు.

ఇక్కడ కు రావటానికి ముందు చింతల వెంకట రమణుడి ఆలయం. ఇది కూడా బుగ్గ రామలింగెశ్వర ఆలయం తో పాటు నిర్మిత మైనది. ఇక్కడి శ్రీనివాసుడికి చింతల వెంకట రమణుడు అనే పేరు ఎలా వచ్చింది అని అక్కడి వారిని అడిగితే " చింతలు తీర్చే దైవమని, పూర్వం చింత చెట్ల వనాలు ఉండేవని," అనే భిన్న కారణాలు వారు చెప్పారు.

ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది. వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది.

తాడిపత్రి కి చేరటానికి మార్గాలు
చెన్నై-రేణిగుంట -గుత్తి రైలు మార్గం లో తాడిపత్రి రైల్వే స్టేషన్ ఉన్నది దేశం లో చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప ల నుండి రాష్ట్ర ప్రభుత్వ bus ల ద్వారా లేదా taxi ల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. తాడి పత్రీ చిన్నస్థాయి పట్నం ఇక్కడ పరిమితి సౌకర్యాలతో వసతి గల గెస్ట్ హౌస్ ఉన్నాయి. దగ్గరలో ఉన్న రేణిగుంట విమానా శ్రయం 240 కిలోమీటర్లలో ఉన్నది.

తాడిపత్రికి దగ్గరలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలు :-
#గుత్తి కోట.. 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..
యాగంటి:-ఇది కూడా ప్రముఖ శైవక్షేత్రం 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
బేలుం గుహలు:- దేశం లోనే పెద్ద గుహలలో 2వ స్థానం లోఉన్నాయి. యాగంటికి వెళ్ళే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి .
ఆలూరు కోన :-శ్రీ రంగనాథ స్వామి ఆలయం పెన్నా నదికి ఆవలి వైపున 8కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

Jambukeswaram Temple జంబుకేశ్వరం

జంబుకేశ్వరం జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. తమళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఉన్నది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని కూడా అంటారు. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు(నేరేడు చెట్లు) ఉండటం చేత జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంటారు

జంబుకేశ్వరుడి ఆలయం దాదాపు 18 వందల సంవత్సరాల నాటిది. ఆలయం లోపల ఐదు ఆవరణలు ఉన్నాయి. ఐదోదాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. ఇది రెండు అడుగుల వెడల్పుతో 25 అడుగుల ఎత్తులో సుమారు మైలు దూరం వరకూ వ్యాపించి ఉంది. నాలుగో ఆవరణలో 796 స్తంభాలు, విశాలమైన హాలు ఉన్నాయి. గర్భగుడి పశ్చిమ ముఖం అంతర్భాగమైన రాతి కిటికీలోంచి స్వామివారిని దర్శించుకోవాలి.

ఇక్కడి స్థల పురాణం ప్రకారం రెండు  కథలు ప్రాచుర్యములో ఉన్నాయి.

ఇతిహాసం
మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తుంగా ఒకసారి శంభుడికి శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన కోరిక అయినా ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొనాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములొ వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపం ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతనార్థం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలొ ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్మకం.

మరో ఇతిహాసం ప్రకారం
ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.

జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉన్నది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలొ పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నది లొ స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాకారలతో ఎత్తైన గోపురాలతో ఉన్నది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణం, ఐదు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉన్నది. ఆలయప్రాకారములొ జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపలయాలు, అనేక మండపాలు ఉన్నాయి

ఆలయ విశేషాలు
ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది.ఈ ఆలయం  ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఎక్కడ చూసినా అరుదైన శిల్ప కళ దర్శన మిస్తుంది .ఎన్నో మండపాలతో విరాజిల్లే ఆలయమిది అందులో ఊంజల్ మండపం ,నూరు స్తంభాల మండపం ,వెయ్యి స్తంభాల మండపం ,వసంత మండపం ,నవరాత్రి మండపం ,సోమస్కంద మండపం ముఖ్యమైనవి ఈ దేవాలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా వున్నది.  ఈ ఆలయ ఆవరణలో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా  అనేక  ఉపఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.

గర్భ గుడి
జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి శివలింగం నీటితో నిర్మితమైంది కాని నీటిలో లేదు. శివలింగం పానపట్టం నుండి నీరు నిరంతరం ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి "నవద్వార గవాక్షం" అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా అంటారు.

అఖిలాండేశ్వరి ఆలయం
జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్రతో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులచే సమర్పించబడ్డాయని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి విశ్వాసం.

ఆలయ చరిత్ర
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ దేవాలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కంటే పురాతనమైనది తెలుస్తోంది. క్రీ.శ. 11 వ శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసి నట్లు తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు. కొంత కాలం క్రితం వరకు ఈ ఆలయనిర్వహణ బాధ్యతలు కంచి కామకోటి మఠం వారు నిర్వహించారు.

ఇక్కడ స్వామివారికీ అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  స్వామివారికీ  అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు

జంబూకేశ్వర ఆలయం దర్శన వేళలు ( Jambukeswarar Temple Timings)
ఉదయం 5:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు. తిరిగి సాయంత్రం  సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు.

ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీ యంత్రం
సాక్షాత్తూ శంకరుని అవతారంగా ప్రస్తుతించే జగద్గురు ఆదిశంకరులవారు జంబుకేశ్వరుని సన్నిధిలో అత్యంత శక్తిమంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి, క్షేత్రానికి ఆకర్షణ శక్తిని పెంపొందించినట్లు, అఖిలాండేశ్వరిగా, జగన్మాతగా పేరు గాంచిన ఇక్కడి అమ్మవారికి శ్రీచక్రాంకితమైన రెండు కర్ణాభరణాలను సమర్పించుకున్నట్లు ఐతిహ్యం. అమ్మవారి మందిరంలో గర్భాలయానికి ఎదురుగా అమ్మవారి ముద్దులపట్టి, విఘ్నాలకు రాజయిన వినాయకుని మూర్తిని కూడా శంకరులే ప్రతిష్ఠించారని  స్థలపురాణం చెబుతోంది.

నిత్యకల్యాణ దంపతులు
ఇక్కడ స్వామి, అమ్మవార్లకు నిత్యం మూడుకాలాలలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు, నివేదనలు జరుగుతుంటాయి. శివునికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.  స్వామి, అమ్మవార్లకు నిత్యం కల్యాణోత్సవాలను జరుపుతారు. ఈ ఆలయం ఆవరణలోని పలు ముఖ్య ఆలయాలేగాక చుట్టుపక్కల వినాయక, సుబ్రహ్మణ్య, ఇతర శివదేవ పరివార ఆలయాలు, స్వామి భక్తులైన నందరార్, తిరునావుక్కరుసు, మానిక వాసగర్, సంబంధార్‌ తదితర నాయనారుల ఉపాలయాలు కూడా సందర్శనీయమైనవి. తిరుచ్చి సమీపంలోనే కలియుగ వైకుంఠమైన శ్రీరంగం ఉంది.

ఎలా వెళ్లాలంటే..?
చెన్నై నుంచి జంబుకేశ్వరానికి నేరుగా రైళ్లు, బస్సులు ఉన్నాయి.

Mahanandi Temple Guide - మహానంది

మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !!

అప్పుడప్పుడూ అద్భుతాలు కొన్ని మన కళ్లును మనమే నమ్మలేనట్టు చేస్తాయి. దేవుడి సన్నిధిలో ఏదైనా వింతగా అనిపిస్తే.. అది ఆయన మహత్యమే అని భక్తులు నమ్ముతారు. అలాంటి మహాద్భుతమే మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది. దీంతో భక్తులు పరవశించి పోతూ.. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మనం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి.

అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

నంద్యాల (14 కి.మీ.ల దూరంలో) సమీప క్షేత్రాలు : శ్రీశైలం (172 కి.మీ.), అహోబిలం (69 కి.మీ.) మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. అలా ఉండటానికి కారణం పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కిలో వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.

ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. పుష్కరిణి లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. నీటి స్వచ్ఛత ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు.
మహాశివరాత్రి ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) ఉన్నాయి. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రథోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం ఉంది. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. 

మహానంది ఆలయం సందర్శించు సమయం : ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.

నంద్యాల మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మజన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి.

కోర్కెలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం.

నవనందులు - 1 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు ఇంకా

నవ నందులు -2 కడమకాల్వ కు సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నందివిగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

వసతి మహానంది లో అనేక గెస్ట్ హౌస్ లు, హోటళ్ళు కలవు. గుడికి సమీపంలో శంభుప్రియ గెస్ట్ హౌస్, బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, హరితా హోటల్, హోటల్ బాలాజీ, న్యూ ఉడుపి హోటల్, శ్రీ కృష్ణ డీలక్స్ ఏసీ, నాన్ ఏసీ మరియు శివప్రియ లాడ్జ్ మొదలగునవి యాత్రికులకు వసతి సదుపాయాలను అందిస్తున్నాయి.

మహానంది ఎలా చేరుకోవాలి?

మహానంది కి సమీపాన కడప ఎయిర్ పోర్ట్, 
నంద్యాల రైల్వే స్టేషన్ కలదు. 
బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాల నుండి నంద్యాల కు బస్సులు కలవు.