శ్రీ వినాయక వ్రతం విధానం ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ వినాయకునికే. గణనాధుని అనుగ్రహాం పొందితే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్దిస్తుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, గరిక, పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు. వ్రత విధానం ఒక పీటపై బియ్యం పోసి, తమలపాకు చివర తూర్పు వైపు ఉండునట్లు పెట్టి, దానిపై పసుపుతో గణపతిని చేసి ఉంచవలెను. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పువ్వులు, పండ్లతో అలంకరించవలెను. ఆ తర్వాత, రాగి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లుపోసి, పైన టెంకాయ (కొబ్బరికాయ), జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ఆచమనం : ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని
పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళను ఆచరించే నోము . సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు. విధానం ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి ) నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ రవిక ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది. మరొక విధానం రెండు కొత్త చేటలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చాటలో పదహారు కుడుములు పసుపు కుంకుమ పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ఒక ముతైదువుకు వాయనమివ్వాలి నోము కథ పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని ఆ కన్య చెప్పగా విని కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది. వెంటనే యింటికి వెళ్ళి ఆ నోమును యధోక్తముగా చేస