కోదండ రామాలయం, తిరుపతి కోదండ రామాలయం తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తుంది. దేవస్థానం రాకముందు మహంతుల పాలనలో ఉండేది. ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోదండరామస్వామి ఆలయం మూడు అంతస్థుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమవైపు ముఖద్వారం, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహారిగోడ గోపురం దాటి ఆలయమ్లోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, ర్పదాన ఆలయం, గర్భగృహం అంతరాళం ఉంటాయి. ఎత్తైన అధిష్టానంపై అపురూప నిర్మాణం, ముఖమంటపం, మహా మంటపం, మంటప రాతి గోడలపై విజయనగర రాజచిహ్నాలు, బాలకృష్ణ, ఆంజనేయ, బలరామ, లక్ష్మీ, వాలి సుగ్రీవ శిల్పాలు, గర్భాలయంలో స్వామికి ఎదురుగా గరుడ మంటపం ఉంటాయి. గరుడ మంటపంలో గరుత్మంతుడు నమస్కరిస్తున్నట్టు ఉంటుంది. గర్భగృహ ఆలయం ముందు ఇరుపక్కలా జయవిజయులు ఉంటారు. గర్భ ఆలయంలో సుందరమైన కోదండరాముడి విగ్రహంతో పాటు కుడివైపు సీతాదేవి విగ్రహం, ఎడమవైపు లక్ష్మణస్వామి విగ్రహం ఉంటాయి. కోదండాలను కలిగి ...
A Guide For Famous Temples in India