Translate

Ayurveda - ఆయుర్వేదం

ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రం

ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు.. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం....  

'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః'.. అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్ర చికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు...

పౌరాణిక గాథలు :

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి.. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తి నొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది..

చారిత్రక ఆభివృద్ధి :

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి "చరక సంహిత" అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యుల చేత ప్రార్థించబడిన వాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తక రూపంలో తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది..

ఇతర వైద్య విధానాలతో పోలిక  :

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్ర విద్యా విషయాలు, రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు. సంగీతము, క్షవరము ఆయుర్వెదం లో ఒక భాగము.

ప్రస్తుత ఆచరణ విధానాలు :

ప్రస్తుతము ఆయుర్వేదములో పంచకర్మ బాగా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ విధానముచే కండరాలు, నరములకు సంబంధించిన అనేక వ్యాధులను చికిత్స చేయవచ్చు.

ఆయుర్వేద గ్రంథాలు :

వస్తు గుణదీపిక :

వస్తు గుణదీపిక ఆయుర్వేద ఔషధులు, వాటిని ఉపయోగించవలిసిన విధానముల గురించి వివరించే తెలుగు నిఘంటు గ్రంథం. దీనిని యెర్ర వెంకటస్వామి గారు రచించారు. దీనిని 1883 వ సంవత్సరం జూన్ 23 వ తేదిన విడుదల చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని వెంకటస్వామి గారి కుమారుడు అయిన యెర్ర సుబ్బారాయుడు గారు వృద్ధి పరిచి మరల విడుదల చేసారు.

వస్తు గుణపాఠం :

వస్తు గుణపాఠము సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము. దీనిని జయకృష్ణదాసు రచించారు. దీని మూడవ కూర్పు చెన్నపురి లోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది..

వివిధ వృక్షజాతులు, వస్తువుల ఔషధ గుణాలు, లక్షణాలను వెల్లడించే వస్తుగుణ పాఠాలు ఆయుర్వేద, యునాని మొదలైన వైద్య విధానాల నిపుణులకు ఎంతో ఉపకరించేవి. అంతేకాక బంగారం మొదలైన వస్తువులను ధరించడం వల్ల కలిగే ఆరోగ్య పరమైన ఉపయోగాలు వంటివి ఇందులో వివరిస్తారు..

Telugu Samethalu - అరవై సామెతలతో అందమైన కథ


 కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది ..అంటూ గొణుగుతూ.. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావు గారికి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి..” ఏంటోయ్ నీలో నువ్వే గొణుక్కుంటున్నావు.. ఏంటో.. అర్ధమయేటట్లు చెప్పొచ్చు కదా! ” అన్నారు ఆయన..


” ఏం చెప్పమంటారు.. చిలక్కి చెప్పినట్లు చెప్పాను మీకు.. విన్నారా.. మీ అక్కగారి నోట్లో నువ్వు గింజ దాగదు అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకోదని మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం.. మన బంగారం మంచిదవాలి కానీ ఇక దీనికి పెళ్లి అయినట్టే..” అంది సుమతి.

” ఔనా.. మా అక్క అలా చెప్పదే ఎవరికీ.. అనుమానం.. పెను భూతం అనవసరంగా అపార్థం చేసుకోకు.. మీ పుట్టింటి వాళ్ళేమయినా చెపుతున్నారేమో కనుక్కో.. జాతకం రాయించింది మీ తమ్ముడేగా.. ” అన్నాడు కాంతారావు.

” ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రతీదానికీ మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు. ఆడలేక మద్దెల ఓడిందన్నట్టు లాగా… అయినా మా తమ్ముడేం మీ అక్కయ్య లాగా ఎవరికీ చాటింపులు వేసే రకం కాదు..” అంది సుమతి.

” ముంజేతి కంకణానికి అద్దమేల .. అయినా.. ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా… ఇంతకీ నీ బాధ… మా అక్క అందరికీ చెపుతోందనా… మనమ్మాయి పెళ్ళి కావడం లేదనా.. చెవిలో జోరీగ లాగా నస పెట్టకుండా ఏదో చెప్పు ముందు..” అన్నాడు కాంతారావు.

” ఇంకేం వుందీ చెప్పడానికీ.. మీకు ఎప్పుడూ కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా.. అమ్మాయికో మంచి సంబంధం వాకబు చేద్దాం అని గానీ.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేద్దామనిగానీ.. ఆలోచనే లేదు.. ” అంది సుమతి నిష్ఠూరంగా..

” ఓసి, పిచ్చిదానా.. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ ఘడియ రాలేదింకా మన పిల్లకి.. ” అన్నాడు తాపీగా..

” అబ్బబ్బా మీకు చెప్పీ చెప్పీ నా తల ప్రాణం తోకకివస్తోంది చెవినిల్లు కట్టుకుని పోరినా వినిపించుకోరు. మీ పెదనాన్న కొడుకు.. చూడండి.. ఎంచక్కా రెండేళ్ళలో ఇద్దరి ఆడపిల్లలు పెళ్ళి చేసి గుండెల మీద కుంపటి దించేసుకున్నారు.. కాస్త ఆయన ఎరికలో ఏవైనా మంచి సంబంధాలున్నాయేమో అడగండి. ” అంది సుమతి.

” వాడినా?.. వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారి పోయేరకం వాడినుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నూనె పిండినంత .. అయినా వాడు అయినవాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టే రకం.

” అయ్యో.. అలా అనుకుంటే ఎలా అండీ.. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు ఆయన ముందు మనమెంతటివారం.. అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మీరోసారి ఫోను చెయ్యండి.. ఆ తర్వాత అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుందాం.” అంది సుమతి.

” వాడి గురించి అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు చెప్పినా నీకు అర్ధం కావడం లేదు. సరేలే.. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను. ఆ ఫోన్ ఇటు తీసుకురా.. హలో.. అన్నయ్యా.. నేనురా.. కాంతారావు ని.. ఎలా వున్నావు? అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా? కులాసాగా వున్నారా ?.. ఆ.. ఏం లేదు.. ఈ ఏడు మేము మా శ్రీవల్లికి సంబంధాలు చూడడం మొదలెట్టాము.. నీ ఎరికలో ఏవైనా మంచి సంబంధాలుంటే చెప్పమని మీ మరదలు అడగమంటే.. అందుకని ఫోను చేస్తున్నాను.. నీకు… మేనరికమా… లేదన్నయ్యా! నీకు తెలీనిదేముందీ.. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అయినా.. వాడిని గారాబంతో చెడగొట్టింది అక్క… మొక్కై వంగనిది మానై వంగునా వాడికి ఇంకా ఉద్యోగం.. సద్యోగం లేదు.. స్ధిరపడలేదు… ఓ పక్క.. అక్కయ్య అంటూనేవుందిలే.. సంబంధం కలుపుకోరా.. అంటూ… మా ఇద్దరికీ సుతారామూ ఇష్టం లేదు.. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు వద్దు అని చెప్పేసాలే అక్కకి.. ఏదైనా సాంప్రదాయ కుటుంబం, మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాడెవరైనా వుంటే చెప్పు.. 
నా స్ధితిగతులు నీకెరికేగా….. ఔను.. జాతకంలో కొంచెం కుజ దోషం వుందట.. ఏవో పరిహార పూజలు చేయించింది మీ మరదలు.. అక్క చెప్పిందా…” అన్నాడు కాంతారావు.. ఆ ఫోను లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేసారు కాంతారావు గారు..

” ఏంటండీ.. ఏమన్నారు మీ అన్నయ్య? ” అంది సుమతి.

” నీ మాట విని వాడికి ఫోన్ చేసాను… నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. మంచోడు మంచోడు అంటే మంచం కింద దూరాడంట, కడుపు నిండిన బేరాలూ కడుపు నిండిన మాటలూ వాడివి. ఏంటో ఆడపిల్ల పెళ్ళి చేయడమంటే ఆషామాషి అనుకుంటున్నావా.. నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి… అందరికీ అలా రావు… ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకుని గంతకి తగిన బొంతని వెతుక్కోమని ఉచిత సలహా పడేసాడు. ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలనిపించుకున్నాను ” అన్నాడు కాంతారావు కోపంగా..

” అయ్యో.. అంతమాటన్నారా.. అయినా.. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి పోన్లెండి ఆయన బుధ్ది బయటపడింది… తలని తన్నేవాడొకడుంటే తాడిని తన్నేవాడొకడుంటాడు ఏదో ఒకరోజు ఆయనకే తెలుస్తుంది.. ” ఉంగరాల చేత్తో మొట్టేవాడు చెపితేనే మాట వింటారు కొందరు .. మీరేం బాధ పడకండి.. మనసుంటే మార్గముంటుంది. ఆ దేముడే మనకే దారి చూపిస్తాడు. చెప్పడం మర్చిపోయా… నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది… తనకి తెలిసిన మంచి సంబంధాలు వున్నాయట.. ఈ రోజు మనింటికి వచ్చి.. చెపుతానంది.. చూద్దాం తనేం చెపుతుందో… విత్తం కొద్దీ వైభోగం పైగా మన దురదృష్టం గోరు చుట్టు మీద రోకలి పోటు లాగా పిల్లకి కుజ దోషం ఒకటీ… అది కప్పెట్టి పెళ్ళి చేయలేం కదా.. ” అంది సుమతి.

మర్నాడు.. కాంతారావు ఆఫీసు నుంచి.. రాగానే.. ఆనందంతో ఎదురెళ్ళింది సుమతి.

” ఏంటోయ్.. గాజుల కళకళ గుమ్మంలోనే ఎదురయిందీ … కొంపతీసి ఉదయం నేను నక్కని తొక్కివెళ్ళినట్టున్నాను .. అన్నాడు చమత్కారంగా..

” పోండి.. మీకెప్పుడూ వేళాకోళమే… ముందిలా కూర్చుని కాఫీ తాగుతూ… నేను చెప్పే విషయం సావధానంగా వినండి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండి అంది. ‘ముద్దొచ్చినపుడే చంకనెక్కాలి’ అన్నది సుమతి.
బుద్ధిగా చేతులుకట్టుకుని..” ఆ.. ఇప్పుడు చెప్పు ” అన్నాడు కాంతారావు.

” నిన్న.. నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా.. మధ్యాహ్నం తను వాళ్ళాయనని తీసుకుని మన ఇంటికి వచ్చింది. ఆయన బేంక్ మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారట. పెద్దది ఆడపిల్ల కి పెళ్ళి చేసి.. కాపురానికి పంపారట. తర్వాత అబ్బాయి.. వేణుగోపాల్.. ఎమ్ బి ఏ.. చేసి.. ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నడట. నెలకి లక్ష పైగా జీతం వస్తోందట. గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూసారు కదా.. పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా వుంది అనిపించిందట. వాళ్ళ వేణుకి చేసుకుంటామని అడిగారు. అప్పటికీ చెప్పాను.. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుంది అన్న చందాన పిల్ల జాతకంలో కుజ దోషం గురించి కూడా చెప్పాను. వాళ్ళ కి అలాంటి పట్టింపులు ఏవీ లేవనీ… అసలు జాతకాల గురించి ఆలోచించమనీ.. పైగా పెట్టుపోతలు కూడా ఏవీ ఆశించమనీ.. చెప్పారు. నాకైతే… వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది. ఉయ్యాల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా తిరిగామేమో మనం. ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్ళారు.. చూడండి.. దొరబాబు లా వున్నాడు.. మన శ్రీవల్లి పక్కన చూడ ముచ్చటగా వుంటాడనిపించింది. ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేము.. ఆలోచించండి..” అంది సుమతి.. సంబరంగా.

” నువ్వు చెప్పిందీ నిజమే సుమతీ… పిల్లాడు బావున్నాడు.. కుటుంబమా.. మంచి సాంప్రదాయ కుటుంబమని చెపుతున్నావు.. పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం… నిజంగా మన అదృష్టం. సరే మరి.. రేపు వెళ్లి మంచీ చెడూ మాట్లాడి వద్దాం. ” అన్నాడు కాంతారావు.

రేపటిదాకా ఎందుకూ.. శుభస్య శీఘ్రం … తలుచుకున్నపుడే తాత ప్రయాణం అన్నట్లుగా ఇప్పుడే బయలుదేరదాం. మనం వస్తున్న్నట్టు పార్వతి కి ఫోన్ చేస్తాను. మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా అయిపోతుంది .. లేవండి.. లేవండి..” అంది సుమతి.

లేడికి లేచిందే పరుగు .. మా లేడీ గారు యమ హుషారుగా వున్నారు.. ఉండు పనిలో పని… మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి.. ఈ విషయం చెప్పాలి. గంతకి తగిన బొంత అన్నాడుగా… ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనిపించాలి. ఇనుము విరిగినా అతకవచ్చుకానీ మనసు విరిగితే అతకలేము అంతలా నా మనసుని బాధ పెట్టాడు వాడు. ” అన్నాడు కాంతారావు.

” పోన్లెండి.. ఊరందరిదీ ఓ దారి ఉలిపిరి కట్టెదో దారి వదిలేయండి.. ఆయనని.. గురివింద గింజ తనకింద నలుపెరగదట మనకెందుకింక ఆయన సంగతి.. ముందు బయలుదేరదాం పదండి” అంటూ భర్త ని తొందరపెట్టింది సుమతి. వెళ్లే దారిలో…” ఏవండీ.. చెప్పడం మర్చిపోయా.. ఇందాక పార్వతీ.. వాళ్ళాయన వచ్చినపుడు మీ అక్కయ్య గారు వచ్చారు.. విషయం అంతా తెలుసుకున్నారు.. వాళ్ళు వెళ్ళాక.. తన కొడుక్కి.. శ్రీవల్లి ని ఇవ్వడంలేదని ఉక్రోషంతో.. నానా మాటలు అన్నారు.. ఏ రాయైతేనేం పళ్ళూడకొట్టుకోవడానికి . ఆ జాతకాల పట్టింపులు నాకు లేవన్నాను.. అయినా నా మాటకి విలువీయకుండా పరాయి సంబంధాలకి పోతున్నారూ.. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక పోతుంది అంటూ.. శాపనార్థాలు పెట్టిందావిడ. శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు ఏది ? అన్నట్టుగా.. ఈవిడ అపశకునపుమాటలేంటీ.. అని బాధేసింది నాకు ” అంది సుమతి.

” పోనీలే.. మా అక్క సంగతి తెలుసుకదా… నువ్వు ఎందుకు.. గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకుంటావు పట్టించుకోకు… గుడ్డి గుర్రానికి పళ్ళుతోమడం తప్ప దానికి వేరే పనీపాటా లేదు. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు అది అలా వాగుతూనే వుంటుంది. వదిలేయి తన మాటలు.. ఎప్పుడూ వుండేవేగా.. ” అంటూ భార్య ని ఓదార్చాడు.

పెళ్లి చూపులు అయిపోవడం.. పెళ్లి మాటలు మాట్లాడుకోవడం.. ఆకాశమత పెళ్ళి పందిరిలో భూదేవంత అరుగు మీద కాంతారావు, సుమతి దంపతులు.. పెళ్లి కొడుకు కి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి.. . అమ్మాయిని అత్తగారింటికి సాగనంపారు.

పై పంచతో చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ. ” అందరికాళ్ళు మొక్కినా అత్తవారింటికి పోక తప్పదు కదా ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో.. ఈ కుజ దోషం కారణంగానో.. చాలా మంది ఆడపిల్లలకి.. సరైన సమయంలో వివాహం కాకపోవడమో.. అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతోంది. విఙ్ఙానం ఇంతలా వెల్లివిరిసి.. ప్రపంచం ఆధునికంగా ముందుకు కు సాగిపోతోంటే… ఇంకా ఈ మూఢ నమ్మకాలేంటి ? ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఓ అడ్డుగోడ.. చదువుకున్నవారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా వుంది.. అందరికీ.. మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్.. ఓ ఆదర్శం కావాలి… అనుకున్నాడు కాంతారావు.

ఇంతలో ఫోన్ మోగింది…. ఈ పెళ్ళి కి పిలవలేదుగా.. అందుకే ఈ సంగతి తెలీక … కాంతారావు పెదనాన్న కొడుకు…. ” ఒరేయ్ కాంతారావూ… మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం వుంటే చెప్పమన్నావుగా… ఇక్కడ.. ఈ. సేవ లో పనిచేస్తూంటాడు.. నెలకి పదివేలు జీతం .. అతనికీ కుజ దోషం వుందట.. సరిపోతుంది ఇద్దరికీ.. వాళ్ళ నెంబర్ ఇస్తాను.. ఓ సారి మాట్లాడి.. సంబంధం కుదుర్చుకో… నాపేరు చెపితే.. కట్నంలో.. కాస్త తగ్గిస్తారు.. ” అన్నాడు..

” ఆ.. అన్నయ్యా… దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్కలు మొరిగాయట .. అర్ధమయిందనుకుంటాను.. ” అంటూ ఫోన్ పెట్టేసాడు.

Householder - గృహస్థులు - విధి విధానాలు


గృహస్థులు - విధి విధానాలు

01. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు, హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

02. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు, ఆయనే ప్రత్యక్షంగా  కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

03. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.

04. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు.

05. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

06. కాళికా, ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.

07. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే  మంచిది, పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు.

08. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు.

09. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు, వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో  కానీ పెట్టడం మంచిది.

10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.

11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి తొండం కుడి వైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో లో నిల్చున్న వినాయకుడు ఉండాలి.

12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన  నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.

14. పూజ గదిలో  ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం, ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.

15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి. నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి, శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు  తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.

17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ  నమస్కారాలు చేయకూడదు.

18. నవగ్రహాలు తాకి మొక్క కూడదు.

19. షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు, రాత్రి పూట తల చిక్కు తీయకూడదు, పెరుగు చేతితో చిలక కూడదు.

20. నీరు, పాలు, పెరుగు, నైయి కి అంటు ఉండదు. అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.

21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి. అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది, పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు. పంచి పెడితే ఇంకా మంచిది.

22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు.

23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు, ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు.

24.పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు.

25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి.

26. జపానికి వాడే జప మాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడ కూడదు.

27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు.

28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు.

29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనం కి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లెవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఓక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు.

30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.

31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకనికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా పెట్టాలి.

32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం  అవుతుంది.

Nithya Parayana Slokas - నిత్య పారాయణ శ్లోకాలు


 ప్రభాత శ్లోకం:

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

ప్రభాత భూమి శ్లోకం:
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే |
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సూర్యోదయ శ్లోకం:
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

స్నాన శ్లోకం:
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ |
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

భస్మ ధారణ శ్లోకం:
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ |
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||

భోజనపూర్వ శ్లోకం: (అంటే భోజనానికి ముందు)
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: ||
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: |
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||

భోజనానంతర శ్లోకం: (పూర్తయినా తరువాయి)
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||

సంధ్యా దీప దర్శన శ్లోకం:
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే ||

నిద్రా శ్లోకం:
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి ||

కార్య ప్రారంభ శ్లోకం:
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

హనుమ స్తోత్రం:
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ |
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి ||
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా |
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ ||

శ్రీరామ స్తోత్రం:
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రం:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ |
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే ||

శివ స్తోత్రం:
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ |
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ ||

గురు శ్లోకం:
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: |
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ||

సరస్వతీ శ్లోకం:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ||
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

లక్ష్మీ శ్లోకం:
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ |
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

శ్రీ వేంకటేశ్వర శ్లోకం:
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ |
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||

దేవీ శ్లోకమ్:
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||

దక్షిణామూర్తి శ్లోకం:
గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: ||

అపరాధ క్షమాపణ స్తోత్రం:
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా |
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

విశేష మంత్రాలు:
పంచాక్షరి  "ఓం నమశ్శివాయ"
అష్టాక్షరి  "ఓం నమో నారాయణాయ"
ద్వాదశాక్షరి  "ఓం నమో భగవతే వాసుదేవాయ"

సనాతన ధర్మస్య రక్షిత రక్షతః

సర్వేజనాః సుఖినోభవంతు! శుభమస్తు!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.

Satyam Jnanam Anantam Brahma - సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ

ఉపనిషత్తులు పరబ్రహ్మాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని వర్ణించాయి. ఆలోచనకు, వాక్కుకు అతీతమైన బ్రహ్మతత్వాన్ని మానవ మేధతో  తెలుసుకోవడం చాలా కష్టం. వేద ద్రష్టలు ఒకవైపు తమ అశక్తతను వ్యక్తపరుస్తూనే బ్రహ్మతత్వ వర్ణనకు ప్రయత్నించారు. వేదాలు సైతం అవర్ణనీయమైన ఆ అనంత సాన్నిధ్యాన్ని విపులీకరిస్తూనే, తత్త్వ వర్ణన కడుదుర్లభమని ఘోషించాయి.

జ్ఞానులు ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటారు. తత్త్వం బోధపడిందనో, తత్త్వాన్ని వర్ణిస్తామనో గొప్పలు చెప్పుకోరు. తాము అనుభూతి చెందుతున్న అద్భుతాన్ని మానవ జాతికి అందించాలన్న తపనే కాని, లేనిపోని సంక్లిష్ట భావజాలాన్ని రుద్దాలని వేద ద్రష్టలు ఎప్పుడూ అనుకోలేదు.

ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ భగవంతుడు ఆవరించి ఉన్నాడు.

“నక్షత్రాల వెనక మెరిసే మహా తేజస్సు”, “హృదయాల్లో స్పందించే దివ్య దీప్తి” –  ఆ తత్వం దూరంగా ఉంది! దగ్గరగానూ ఉంది!

లేనిపోని కల్పనలు చేయక, తర్కాన్ని ఉపయోగించమన్నారు ద్రష్టలు. బుద్ధి, హేతువుకు అందకపోయినా వాటిని వాడాలి. విశ్వంలోని సమస్తాన్ని కళ్లతోనే చూడాలి, బుద్దితో ఆలోచించాలి!

విశ్వంలోని వివిధ అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి మూలం ఎవరు? ఏ కారణం లేకుండా సృష్టి ఎలా వస్తుంది? ఈ విధంగా పరిశోధన జరిపితే మూలకారణం ఒకటి ఉందని తెలుస్తుంది!

మీకు గజేంద్రమోక్షం కథ తెలిసే ఉంటుంది. విచారగ్రస్తుడై, విధి శాపగ్రస్తుడైన గజేంద్రుడు విలపిస్తూ, బయటపడటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. మూల కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు. అది తెలుసుకోగల శక్తి ఏనుగుకు లేదు. వచ్చిన బాధకు, విశ్వానికి మూల కారణం తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి?

అందులోని గజేంద్రుడిని జీవాత్మతో పోల్చితే తత్త్వం విశదపడుతుంది. విధివంచిత అయి, భూమిపై సర్వదుఃఖాలు అనుభవిస్తున్న జీవాత్మ బయటపడటానికి మూలకారణం తెలుసుకుని తీరాలి.

విశ్వానికి మూలకారణం బ్రహ్మతత్వమే.

ఆధ్యాత్మిక గ్రంథాల్లోని తత్వసారం తెలుసుకోవడానికి మనం సంకుచిత మనస్తత్వాన్ని, పరిమితత్వాన్ని వీడాలి. అవి ఉన్నంతకాలం ఆధ్యాత్మిక అనుభవాలు రావు. ఋషుల్నే విమర్శిస్తే, వారు చెప్పే ప్రబోధాలు ఎలా అర్థం అవుతాయి? మనిషి తన మనస్సును విస్తరించుకుంటే, ఋషులు చెప్పే మాటలు కొద్దిగానైనా అర్థమై, కొంచెమైనా ఆచరించగలుగుతాడు.అందుకే విశాల దృక్పధం ఎప్పుడూ అవసరం.

మంత్రాక్షరాలు గొప్పవే. కాని అక్షర పరబ్రహ్మ తత్వాన్ని చూపించలేవు. అందుకే అశక్తతను వ్యక్తంచేస్తూనే వేదద్రష్టలు తమ ప్రయత్నం తాము చేశారు.

మనం కూడా జ్ఞానులమై, నిత్య సత్యశోధన చేస్తేనే తత్త్వం అనుభవంలోకి వస్తుంది. వేదసహితమైన పవిత్ర గ్రంథాల్లోని జ్ఞానాన్ని దీపస్తంభాలుగా చేసుకుంటే చీకటిలో సైతం లక్ష్యాన్ని చేరుకోగలం. సంసార సాగరాన్ని దాటగలం. పరబ్రహ్మంలో ఐక్యమై మోక్షాన్ని సాధించగలం.

ఆనందో బ్రహ్మ!

ఈ చరాచర సృష్టి అంతటికీ పరమ కారణం పరమాత్మ. అతనినే మనం 'భగవంతుడు', 'పరబ్రహ్మం', 'సర్వేశ్వరుడు' అని అనేక విధాలుగా పిలుస్తున్నాం. 'ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః/ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా॥'. సమగ్రమైన 'ఐశ్వర్యం (అధికారం), శక్తి, యశస్సు (కీర్తి), సంపద, జ్ఞానం, వైరాగ్యం.. అనే ఆరింటిని 'భగం' అంటారు. 'భగం' కలవాడు కనుక 'భగవంతుడు' అని పేరు. 'ఉత్పత్తించ వినాశంచ భూతానా మాగతిం గతిం/ వేత్తి విద్యామ విద్యాంచ సవాచ్యో భగవానితి॥'. భూతాల ఉత్పత్తి, వినాశం, రాకడ, పోకడ, విద్య, అవిద్య.. అన్నీ తెలిసినవాడే 'భగవానుడు'. సృష్టి (పుట్టించడం), స్థితి (పోషించడం, శాసించడం), లయం (నాశం చేయడం), తిరోధానం (తనలోకి తీసుకోవడం), అనుగ్రహం (మరల ఉనికిని కలిగించడం) ఈ పనులను భగవంతుడే తన మాయా శక్తితో చేస్తాడు. అందువల్లే, పరమాత్మ 'పంచకృత్య పరాయణుడు'. పరబ్రహ్మానికి 'ఓం, తత్‌, సత్‌' అని మూడు పేర్లు ఉన్నాయి. 'ఓం తత్స దితి. నిర్దేశో బ్రహ్మణః త్రివిధః' అని 'భగవద్గీత' వాక్యం. 'అవతి భూతాని ఇతి ఓం'. సర్వభూతాలను రక్షించేది కనుక 'ఓం'. ఈ 'ఓంకారం' అత్యంత పవిత్రమైంది. అన్ని మంత్రాలకూ మూలం. అన్ని కర్మలకూ ముందుగా 'ఓం' చెప్తాం. దీనినే 'ప్రణవం' (మిక్కిలి స్తోత్రించదగింది) అనీ అంటాం.

సర్వకారణ కారణత్వాన్ని 'తత్‌' అనే పదం చెబుతుంది. 'యత్తద్య తస్తతో హేతౌ'. 'యత్‌' (ఏది), 'తత్‌' (అది), 'యతః' (ఎక్కడి నుంచి), 'తతః' (అక్కడి నుంచి) ఈ నాలుగు పదాలు కారణాన్ని చెప్తాయి. పరమాత్మ నుంచే 'సర్వం' (అంతా) ఏర్పడిందని 'తత్‌' శబ్దం సూచిస్తున్నది. ఎల్లప్పుడూ ఉండే తత్తాన్ని (శాశ్వతత్తాన్ని) 'సత్‌' శబ్దం చెబుతున్నది. 'అస్తి ఇతి సత్‌'. ఉన్నది (ఉండేది) అనికూడా 'సత్‌' శబ్దానికి అర్థం. 'ఈ సృష్టికి పూర్వం నేనొక్కడినే ఉన్నాను. సత్తుకాని, అసత్తుకాని, వాటికి కారణాలు గాని ఏవీ లేవు. ఇవన్నీ నశించిపోయినా 'మిగిలి ఉండేవాడను నేనే' అని 'భాగవత' ప్రమాణం. పరమాత్మ ఒక్కడే ఎల్లప్పుడూ ఉండేవాడు.

ఇది అతని శాశ్వతత్త్వాన్ని తెలియజేస్తున్నది. 'సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ' అని ఉపనిషత్తు వాక్యం. సత్పురుషులకు వర్తించేది సత్యం. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలలో పరమాత్మ 'తన సత్యసంధత'ను నిరూపించాడు. జ్ఙాయతే ఇతి జ్ఞానమ్‌. తెలిసేది కనుక జ్ఞానం. పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది వేదాల ద్వారానే తెలుస్తుంది. పరమాత్మ మాత్రమే సర్వజ్ఞుడు. 'అన్తం న విద్యతే ఇతి అనన్తం'. దేనికి అంతం (చివర) లేదో, తెలియదో అది అనంతం. పరమాత్మకు మొదలుకాని, చివరకాని లేవు. అందువల్లే పరమాత్మ అనాది, అనంతం. పరమాత్మ స్థితి ఆనందం. 'ఆనందో బ్రహ్మ' అని పెద్దల మాట. ఆనందమంటే 'సంతోషం'. కానీ, వాస్తవానికి 'ఏ వికారాలూ లేని స్థితి' ఆనందం.

ప్రతి వస్తువుకు ఉత్పత్తి (పుట్టడం), సత్త (ఉండటం, బలం కలిగి ఉండటం), వృద్ధి (పెరుగుదల), పరిణామం (మార్పు చెందడం), అపక్షయం (క్షీణించడం), నాశం (నశించిపోవడం) అనే ఆరు గుణాలుంటాయి. అలాగే, సంతోషం, దుఃఖం మొదలైనవి కూడా వికారాలే. ఇవేవీ లేనివాడు కనుక, పరమాత్మ 'ఆనంద స్వరూపుడు'. పరమాత్మే సర్వవ్యాపకుడు, సర్వశాసకుడు. కర్త, కర్మ, క్రియ అంతా పరమాత్మనే. కాలాతీతుడు, గుణాతీతుడు అయిన పరమాత్మ అన్ని వస్తువులలో చైతన్యరూపమై ఉండి, అన్ని పనులూ నిర్వహిస్తాడు. అన్నీ తానే అయి కూడా దేనితో సంబంధం లేని వాని వలె ఉదాసీనంగానూ ఉంటాడు. కర్తృత్వ భావాన్ని పొందడు. ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉండటం పరమాత్మ ప్రత్యేక లక్షణం. ఈ జగత్తంతా పరమాత్మ అధీనంలో ఉన్నది. కనుక, అందరికీ, అన్నిటికీ సర్వాశ్రయుడు, అనన్య శరణ్యుడు పరమాత్మనే.

బ్రహ్మ పరబ్రహ్మ - Brahma Parabrahma

బ్రహ్మమందు మీరు, మీలోన బ్రహ్మంబు, మీరె బ్రహ్మ మ్మీరెయయ్యు |
బ్రహ్మమయులు మీరు, బ్రహ్మమగుదురు, కాని మోహవశత, కానరైరి ||

బ్రహ్మ:
గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.

పరబ్రహ్మ:
బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.

అచల పరిపూర్ణ పరబ్రహ్మ:
శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు  లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.

పరిపూర్ణము:
పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే  మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.

ఇహరూపము:
ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.

పరరూపము:
ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము.

పరాత్పరము:
పరరూపమునకు కూడా పరము, అతీతము అయినది. సాక్షిగా కూడా లేనిది. సర్వాధారము కానిది. అధిష్ఠానమై యున్నది. నిరాలంబము, నిరాకాశము, నిరాధారము, అచలము, పరిపూర్ణము, మాయాత్పరము. ఉన్నదున్నట్లుండి ఆ ఉండుట అనెడి ఎరుక లేనిది. చిత్పరమైనది. త్రిగుణ రహిత పరబ్రహ్మము. అన్ని కాలాలలో, అన్ని చోట్లా నిండి నిబిడీకృతమై యున్నది. దానియందు ముల్లు గ్రుచ్చసందు లేనిది. అద్వయమైనది. దానినుండి ఏదీ ఆవిర్భవించదు, ఏదీ లయము కాదు. దృశ్యము, దర్శనము అనెడి ఎరుక లేనిది. అట్టి ఎరుక భ్రాంతియే గనుక, పరాత్పరమనగా భ్రాంతి రహితము. దృశ్యము లేని కేవల దృక్‌స్థితి ఏదో అదే పరాత్పరము.  పరాత్పరము అనగా అచల పరిపూర్ణమే.

నిరీహము:
ఇహము కానిది అనగా పరము. ఏదైనా లోకమును అనుభవముతో నుంచుకొనినట్టి అహంకారమున్నప్పుడు దానికాలోకము ఇహలోకము. ఏడు ఊర్ధ్వలోకములలో భూః అనే లోకములో నున్న అహంకు భువర్లోకము పరము. భువర్లోకములోనున్న దానికి సువర్లోకము పరము. ఏడు ఇహ లోకములు అలోకము కాగా పెనుచీకటి కావలనున్నది పరము. ఈ పరమే నిరీహము. ఇహలోకములన్నీ మిథ్య. అహంకారము హారతి కాగా ఇహముండదు. అద్వైతములో పరమే ఉన్నది. అహముంటే ఇహముండును. అహం పోతే ఇహముండదు. పరమే శాశ్వతము.

యోగుల పరరూపము:
అజ్ఞులకు ఏది ఇహ రూపమో, అదే యోగులైన వారికి వారి అంతరంగమందు గంభీరమైన చైతన్య సాగరముగాను, నిర్వికల్పముగాను, అచలముగానున్నదేదో అదే పరరూపము.

అపరరూపము:
పంచ బ్రహ్మలకు మూలమైన శివశక్త్యాత్మకతత్వమును అపర రూపమందురు. సర్వకాల సర్వావస్థలయందున్న సకల జీవులు, దేవతలు, త్రిమూర్తులు, తన్మాత్ర సృష్టి, పంచబ్రహ్మలతో సహా అన్నీ అపరరూపములే. ఇవన్నిటికీ మూలమైన శివశక్త్యాత్మకమునకు పరమైన పరశివరూపమే పరరూపము.

బ్రహ్మకు పర్యాయ నామములు:
బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, అంతర్యామి, సర్వాధిష్ఠాతృ, తత్పద లక్ష్యార్థము, విశుద్ధ చిత్‌, ముఖ్యేశ్వర త్రయాధిష్ఠాతృ, నిరాలంబము, తత్త్వము, అమృతత్త్వము మొదలైనవి. కొన్ని సృష్టితో సాపేక్షము. అన్ని నామములు ఒకే బ్రహ్మను సూచించుచున్నవి.

సాక్షాత్‌ బ్రహ్మ:
అద్వయమై, సాధకునికి అపరోక్షమైయున్న బ్రహ్మ. తనకు తానే ఆద్యంతములు లేని స్వతఃప్రకాశము. అద్వైత సిద్ధిని సూచించే సాక్షాత్కారము.

భూమ:
మానవునిలో ఉండే స్థానము. ఎక్కడైతే సంకల్ప వికల్పములు, ఆలోచనలు, ఊహలు, అనుభవములు, జ్ఞాపకములు ఏమీలేవో, ఆకాశము వలె శూన్యమో, అక్కడ బ్రహ్మ మాత్రము అనన్యముగా స్థిరమై యుండి శిష్యునికి ఆ బ్రహ్మ పట్టుబడునో ఆ స్థానము పేరు భూమ.

శిష్యునిలో బ్రహ్మ సాక్షాత్కారమునకు పర్యాయపదములు:
రాజయోగము, సహజ నిర్వికల్ప సమాధి, అమనస్కము, సర్వలయము, తత్త్వము, అమరత్త్వము, అద్వైత సిద్ధి, తురీయాతీతము, స్వస్వరూప సాక్షాత్కారము, నిర్వాణము, నిర్వికల్పము, సహజము, నిరంజనము, ప్రసన్నత, పరమశాంతి, నిర్వాసనా మౌనముద్ర మొదలగునవి. ఈ పేర్లలో సాపేక్ష, నిరపేక్ష భేదమే గాని అనుభూతి ఒక్కటే. అదే అపరోక్షానుభూతి.

సత్యము: అవ్యక్తము, పరబ్రహ్మ స్వరూపము.
ఋతము: వ్యక్త బ్రహ్మ, పరమాత్మ రూపము.

ఆవరణ బ్రహ్మ-నిరావరణ బ్రహ్మ:
మాయ ద్వారమునకు ఈవలి బ్రహ్మ ప్రకాశము, దానిని ఆశ్రయించిన మాయ కారణముగా కారణ బ్రహ్మమగు చున్నది. అప్పటికీ ఆ బ్రహ్మ నిర్గుణమే. మాయ యొక్క ఆశ్రయము వలన సగుణ బ్రహ్మమని పిలువబడుచున్నది. నిజమునకు సృష్టి స్థితి లయములకు కారణము మాయ, అనగా నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించిన మాయ, బ్రహ్మము కాదు. అయినను బ్రహ్మమును కారణమనుచున్నారు గనుక ఆ బ్రహ్మము మాయాశబలిత బ్రహ్మము.

మాయ ద్వారమునకు ఆవలి బ్రహ్మ ప్రకాశము స్వప్రకాశము. ఈ బ్రహ్మ త్రిగుణ రహితము, కారణ బ్రహ్మము కాదు. మాయ యొక్క ఆశ్రయము లేదు. మాయ, మాయా కల్పితములు లేని, అద్వయబ్రహ్మమును నిరావరణ బ్రహ్మమందురు.

మాయ లేనిది. లేని మాయ కారణముగా తోచినవీ లేనివే. కనుక మాయ ద్వారమునకు ఈవల, ఆవల అనునది అసమంజసము. ఉన్నది నిరావరణ పరబ్రహ్మము మాత్రమే. అన్యము లేదు.
కాని అవిద్యా, మాయా దోషములున్న సాధకునికి ముందుగా అవిద్య నశించగానే మాయావరణమందున్న మాయా శబలిత బ్రహ్మ జ్ఞానము కలుగును. ఇది సత్‌చిత్‌ ఆనందమను తటస్థ లక్షణము. సాధకుడు అహం బ్రహ్మయనుచు అహం, బ్రహ్మానుభవము అని ద్వైతములోనున్నాడు. ద్వైతము నశించినప్పుడు, అహంస్ఫురణ ఆగిపోవును. బ్రహ్మానుభవమును అనుభవించే అహం లేకపోగా సత్‌చిత్‌ఆనందము ఘనమగును. ఇది స్వరూప లక్షణము. ద్వైతము నశించినందున అద్వైతము సిద్ధించును. దీని స్వరూప లక్షణమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మమే మాయావరణ లేని బ్రహ్మము. నిరావరణ బ్రహ్మము. సాధకునికిది అపరోక్షానుభూతి.

నీరంధ్రము:
దట్టముగానుండి ముల్లు గ్రుచ్చ సందులేని అద్వయమైన నిరావరణ బ్రహ్మమును నీరంధ్రము అందురు.

నిబిడము:
అంతా అదే, రెండవది లేదు. అది ఎంత దట్టముగా నున్నదనగా ముల్లు గ్రుచ్చ సందులేక ఉన్నది. నిబిడమనగా దట్టము. ఇట్టిది నిరావరణ బ్రహ్మమే.

పరబ్రహ్మ - కేశవ - విష్ణువు:
పరమ స్వరాట్‌ అయిన పరబ్రహ్మ నుండి, దానికదే అభివ్యక్తమైన కేశమాత్రపు చైతన్యము అనగా వెంట్రుకవాసి చైతన్యమును కేశవ అందురు. ఆ లేశమాత్ర చైతన్యము లెస్సగా వ్యాపించిన చైతన్యమైనప్పుడది విష్ణువనబడును. నిజమునకు పరబ్రహ్మము నుండి చైతన్యము వెలువడలేదు. మాయ కారణముగా మాయావరణలోనే ఈ కేశవ, విష్ణు చైతన్యములు. నిరావరణమందు స్వప్రకాశమే గాని బాహ్య ప్రకాశము లేదు. అందువలన చైతన్యము యొక్క వ్యక్తావ్యక్తములకు సంబంధము లేని స్వరూపమే పరబ్రహ్మ.

బ్రహ్మ లక్షణము: చిదానంద లక్షణము.
చైతన్యము: ఉనికిగా నున్నది.
ప్రకాశము: చైతన్యమును తెలియుటగా నున్నది. అనగా ఉనికి యొక్క అనుభూతిగా నున్నది.
జ్ఞానము: చైతన్య ప్రకాశము వలన స్థిరమై నిలిచియున్న స్మృతి. కేవల స్మృతి రూపమే ఆనందము.
చిత్: చైతన్యము, జ్ఞానము, ప్రకాశము ఒక్కటైయున్నది.
సత్‌: శాశ్వత ఉనికి అనే తత్త్వము.
అసత్‌: శాశ్వత ఉనికి రూపమునందు జేరి యుండుట వలన అనిత్యమైన ఘటమునకు తాత్కాలిక ఉనికి కలుగుట. అప్పుడు ఘటము అసత్‌ అనబడును.
చిత్‌: తెలియబడుతూ ఉండుట అనెడి నిత్య వర్తమానరూప శాశ్వత తత్త్వము.
అచిత్‌: తెలియబడుట అనెడి శాశ్వత తత్త్వము అనిత్య ఘటమునందు జేరి యుండుట వలన ఘటము సృష్టించబడిన పిదప తెలియబడుచు, ఘట నాశనము తరువాత తెలియబడక, తాత్కాలికముగా ఘటము తెలియబడుచున్నది. ఇట్టి ఆది అంతములమధ్య తెలియబడుటను అచిత్‌ అందురు.
సత్‌చిత్‌: శాశ్వత ఉనికి తత్త్వమును శాశ్వతముగా తెలియబడుచుండుట అనెడి తత్త్వము. సత్‌యే చిత్‌. చిత్‌యే సత్‌. ఉనికియే తెలియబడు తత్త్వము. తెలియబడుట తన ఉనికే. ఈ రెండు కలసి ఒక్కటై యుండు తత్త్వము.

అసత్‌ అచిత్‌ పదార్థముల వలన కలిగిన బంధము, దుఃఖము నశించగా కేవల సత్‌చిత్‌ స్వరూపము సాపేక్షముగా ఆనందము. శాశ్వత సత్‌చిత్‌ తత్త్వము ఏనాడూ అసత్‌ అచిత్‌ కానిది గనుక, ఆ సాపేక్ష ఆనందము లేనిదై, నిరాపేక్షికమందు అనంతము. అందువలన సాపేక్ష జ్ఞానము సత్‌చిత్‌ ఆనందము. నిరపేక్ష విజ్ఞానము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.

అసత్‌ అచిత్‌: ఇది అనృత జడము. ఘటపటాదులందు చేరియున్న సత్‌చిత్‌లు సర్వాధారమై యుండగా సర్వమును సృష్టి స్థితి లయ రూప వికారములుగా కనబడునట్లు చేయునది. ఇందులో సుఖము అనిత్యమగుటచే దుఃఖమనబడును. అందువలన ఇది అనృత జడ దుఃఖరూపము.

అహంత: నేను అనెడి స్ఫురణ. చైతన్య ప్రకాశము అంతఃకరణమనెడి ఉపాధిపై పడి ప్రతిఫలించిన ప్రకాశమే చిత్‌+ఆభాస. అందువలన చిదాభాసుడనగా అహం స్ఫురణ.

స్ఫురణ: ఉపాధులయందు ప్రకాశించుచున్న పరమాత్మ చైతన్యము యొక్క లక్షణమే ఈ స్ఫురణ. శుద్ధ అంతఃకరణమందు ఆభాసగానున్న స్ఫురణ సో-హం జ్ఞానము. మలిన అంతఃకరణయందు ప్రతిఫలించిన పరమాత్మ ప్రకాశము అసత్య నేను అనే అజ్ఞానము.

పూర్ణాహంత : అంతయూ నేనే అనెడి స్ఫురణ.
మహత్తత్త్వము : వివేక విజ్ఞానముల చిహ్నము. ఇది ఈశ్వరుని యొక్క విజ్ఞానమయ కోశము.
పూర్ణాహంకృతి : సర్వప్రాణులయందున్న నేను ఒక్కటే అనెడి దృష్టి.

మహదహంకారము:
సర్వ భూతములు వ్యక్తమగుటకు కారణమైనది. ఇట్టి కారణభూతమైన అహంరూప నాశనమే మోక్షము. దీనినే మూలాహంకారమని కూడా అందురు. మూలాహంకారము నశించినంతనే మోక్షము సిద్ధించును.
ఉత్తమ పురుషుడు : అందరిలోనున్న నేను అనే ఒక్కటైన అన్యముతోచని అనుభూతి.

విశ్వరూప సందర్శనము:
నా ఆత్మ స్వరూపమే ఈ బ్రహ్మాండ పిండాండ ములుగా నా దృష్టికి విషయమగుచున్నది. అని గ్రహించి యుండుటయే విశ్వరూప సందర్శన యోగము.

అక్షర పరబ్రహ్మ యోగము:
స్థితులు గతులు మారినా, దేహాదులు వస్తూ పోతూ ఉన్నా, అవస్థలు మారిపోవుచున్ననూ 'నేను' మాత్రము మారని వాడను. శాశ్వతుడను - అని దృఢ నిర్ణయమై అనగా ఆరూఢమగుటయే అక్షర పరబ్రహ్మ యోగము.

పురుషోత్తముడు:
జీవేశ్వరుల ఉపాధిక, నిరుపాధిక అనుభవ భేదములు తొలగిపోగా, సర్వదా సర్వత్రా సర్వసాక్షిగా ఉండే పరమాత్మయే పురుషోత్తముడు. క్షర అక్షర పురుషులకంటె అతీతమైన సర్వోన్నతుడే పురుషోత్తముడు.

పురుషోత్తమ ప్రాప్తి:
ఈశ్వరునియందున్న నిరుపాధికమైన అక్షర పరబ్రహ్మను  జీవుడు తన జీవోపాధిలో యోగించినప్పుడది పురుషోత్తమ ప్రాప్తి అనబడును.

గుణి గుణములు:
1. అవ్యక్తము గుణి - దాని గుణము మహత్తత్త్వము.
2. మహత్తత్త్వము గుణి - దాని గుణము మహదహంకారము
3. మహదహంకారము గుణి-దాని గుణము తన్మాత్రలు
4. తన్మాత్రలు గుణి - వాటి గుణములు ప్రపంచము.

సనాతనము:
అన్ని కాలములలో ఉంటూ ఉండేది. ఆది అంతము లేనిది. నిర్వికారమైనది. ఈ లక్షణములు బ్రహ్మ లక్షణములు. కనుక బ్రహ్మమే సనాతనము.

తత్త్వము:
బ్రహ్మ - ఆత్మల ఏకత్వము. ఘటాకాశ మహాకాశముల ఏకత్వము వంటిది. ఉపాధిగత ఆత్మ - నిరుపాధిక బ్రహ్మ ఒక్కటే. త్వం అనే సాధకుడు - తత్‌ అనే బ్రహ్మము అభేదము (అసి). ఇట్టి అభేదమును తత్త్వమందురు.

జీవుడు - పరమాత్మ:
జీవుడు నిజానికి పవిత్రుడు, సనాతనుడు. కర్మ వశాన అశాశ్వతమైన ఉపాధులను ఆశ్రయించినా, ఉపాధుల నాశనము చేత జీవుడు నశించుటలేదు. ఈ ఉపాధులే తాననెడి అజ్ఞానము నశించగానే కర్మలు అకర్మలై, జీవాత్మయే పరమాత్మ అనెడి జ్ఞానముదయించగా సత్‌చిత్‌ఆనంద రూపుడగుచున్నాడు.
దర్శనము : జ్ఞానైక స్వరూపమును దర్శనము అందురు.

సమ్యక్‌ దర్శనము:
తనలో సకల భూతములను, సకల భూతములలో తనను దర్శించుటను సమ్యక్‌ దర్శనము అందురు. ఇదే సమాత్మ జ్ఞానమనియు, బ్రహ్మ జ్ఞానమనియు అనబడును. సమము, సంప్రాప్తము అని కూడా అందురు. అనగా బ్రహ్మ సాక్షాత్కారమే.

లింగము:
దేనియందు అన్నీ లయమగునో దేని లక్ష్యములో అన్నీ పురోగమించునో అదే లింగము. అదే శివము.
లిం అనగా అవ్యక్తము. గం అనగా అవ్యక్తమును వ్యక్త రూపముగా చూపే చిహ్నము, లేక గుర్తు, లేక సంకేతము. వ్యక్త రూపలింగము  అర్చనాదులకు, సాధనలకు అందుబాటైనది. కాని ధ్యానములో చిహ్నమును విడచి అవ్యక్తమనెడి శివమునే భావించవలెను.

లింగాంగములు:
1. సత్‌ లింగము, చిత్‌ అంగము, ఆత్మ సంయోగమే ఆనందము.
2. తత్‌ పదము లింగము, త్వంపదము అంగము, అసి పదమనెడి అభేదమే తత్త్వమసి వాక్యార్థము.
3. నాదము లింగము, బిందువు అంగము, సంయోగమే కళ.
4. హ అనే పురుషుడు లింగము స అనే ప్రకృతి అంగము, సంయోగపరచి హంసగా చేసేది బిందువు.

పరంజ్యోతికి పర్యాయ నామములు:
అర్యముడు, వరుణుడు, వాయువు, అగ్ని, చంద్రుడు, విష్ణువు, బ్రహ్మ, శివుడు.

అనుభూతి:
జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనెడి త్రిపుటిని ప్రకాశింపచేసే ప్రకాశరూపముగా నుండుటను అనుభూతి అందురు.
సంవేదనము : ప్రకాశ రూపునికి త్రిపుటి తెలియబడుచుండుటను సంవేదనమందురు.

ప్రపత్తి : ప్రకాశరూపుడు త్రిపుటియందు వ్యాపకుడై యుండుటను ప్రపత్తి అందురు.

ప్రత్యక్షము:
చిన్మాత్రుడు తన అక్షరార్థమును విడువక త్రిపుటియందు వ్యాపించినప్పుడు సాక్షియగును. అదే ప్రత్యక్షము.
జీవుడు : సాక్షి చిన్మాత్రుడు ప్రాణమును ధరించినప్పుడు జీవుడనబడును.

సంవిత్‌:
సాక్షి చిన్మాత్రుడు వృత్తి అనే ఉపాధియందు వ్యాపించినప్పుడు సంవిత్‌ అనబడును. అంతఃకరణ వృత్తిని ఏది ఉపాధిగా చేసుకొని ఉన్నదో అట్టి తెలివి రూపమే సంవిత్‌. ఆ తెలుసుకునే తెలివినే ప్రజ్ఞానమని, స్మృతి రూపమని అందురు.

ప్రమాత, పురుషుడు:
సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తిలో భాగమైన అహం వృత్తిని ఏది ఉపాధిగా చేసుకొనుచున్నదో అది ప్రమాత అనబడును. ప్రమాతయే పురుషుడు. సాక్షి చిన్మాత్రుడు అహం వృత్తినందు ప్రవేశించినప్పుడు ప్రమాత అని గాని, పురుషుడని గాని అనబడును.

త్రిపుటి:
ఒక్క సాక్షి చిన్మాత్రుడే క్రమముగా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయమనెడి త్రిపుటిగా భేదములను పొందెను.

జగద్రూపము:
సాక్షి చిన్మాత్రుడే సంకల్పము, వికల్పము, సంశయము, అభిమానము మొదలగు భ్రమల చేత అనేక విధములైన అవస్థాంతరములను పొంది, జగద్రూపుడై ప్రకాశించుచున్నాడు.

అన్వర్థ బ్రాహ్మణుడు:
అక్షరమే చిన్మాత్ర స్వరూపమై, సకల చరాచర విశ్వమునకు ఆధారమై, ఆస్పదమై యున్నది. దేశ కాలాదుల సృష్టికి కారణమై యున్నది. అక్షరమందే అవ్యాకృతాకాశము ఓతప్రోతమై యున్నది. అందు అవ్యాకృతము ఇమిడి ఉన్నది. అవ్యాకృతాకాశమునకు కారణమైనట్టి అక్షరమును తెలుసుకున్నవాడే అన్వర్థ బ్రాహ్మణుడు.

అవ్యాకృతాకాశము:
సూక్ష్మాతి సూక్ష్మమైన అవ్యాకృత తత్త్వమును ఆకాశమందురు. సూక్ష్మమనగా త్రిగుణాత్మక ప్రధానము అనెడి తత్త్వము. ఈ తత్త్వమునకు కారణమైనది అవ్యాకృతాకాశము. దీనికి అవ్యాకృతమని, బీజమని, అవ్యక్తమని, సుషుప్తి అని పేరులు. వ్యక్తము కానిది గనుక, ఇది అనుమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణము వలన మాత్రమే తెలియబడును. స్వానుభవమునకు రానిది.

అద్వైతము:
భోక్తృ అనగా జీవుడు, భోగము అనగా విషయము. ప్రేరిత అనగా ఈశ్వరుడు. ఈ మూడూ ఒక్కటే అయినదే పరబ్రహ్మము. ఈ త్రిపుటి యొక్క ఏకీకృతమే అద్వైతము.

అద్వైత భావము:
అద్వైత భావమందు జ్ఞాన అజ్ఞానములు రెండూ ఉండవు. కర్మ సమాప్తి అని గాని, పునఃకర్మ అని గాని ఉండవు. బంధ మోక్షముల ప్రతీతి ఉండదు. ప్రపంచ ప్రతీతి ఉండదు. మనస్సుకు అస్తిత్వము ఉండదు. మృతునివలె ఉండును. సర్వము బ్రహ్మమయము అన్న స్థిరభావముండును. అహంకారముండదు. ద్వైత అద్వైత భావనలుండవు. బ్రహ్మమునందు స్థితుడై అభావమై ఉండును. తాననునదే ఉండదు. సర్వమూ వాటి మూలములో శూన్యమే గనుక, సర్వభావన శూన్యభావన రెండూ ఉండవు. భావనలుంటే ద్వైతమే కదా! అభావమందే ఏదో ఉన్నది. అది అనిర్వచనీయము.

అభావము:
1. ప్రాగా భావము : సృష్టికి పూర్వము ఏమీ లేదు.
2. ప్రధ్వంసాభావము : ప్రలయానంతరము ఏమీ లేదు.
3. అన్యోన్యాభావము : ఆధార ఆధేయములు గాని, కార్యకారణములు గానీ ఏమీ లేవు.
4. అత్యంతా భావము : ఎప్పుడూ, ఎక్కడా, ఏమీ లేదు. మధ్యలో తోచిన జీవ ఈశ్వర జగత్తులు మిథ్య, అందువలన ఏమీ లేదు. దీనినే అత్యంతా భావము అందురు. అందువలన ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు. మిథ్యా రూపములకు మూలము లేదు. అవి కలలో తోచిన వేలాగో అలాగే, మేల్కొంటే ఏమీ లేవు. ఉత్త బట్టబయలు ఏమీ లేదు.

తటస్థ, స్వరూప లక్షణములు:
ఏ లక్షణము ఒకానొకప్పుడుండి, తన లక్షణమును అన్య పదార్థములతో కలసియున్నా వాటికంటే భిన్నమైనదిగా ఉన్నదో, అసంగమైనదిగా ఉన్నదో ఆ లక్షణము తటస్థ లక్షణము. సాపేక్ష లక్షణముగా గుర్తించబడినప్పటికీ ముందుగా నున్న నిరపేక్ష లక్షణము కోల్పోనిది. ఆ కోల్పోని లక్షణమే నిరపేక్షము. అన్ని కాలములలో, అన్య పదార్థములతో కలిసియున్నా కలియక ఉన్నా, నిర్వికార శాశ్వత లక్షణముగా సహజమై యున్న లక్షణము స్వరూప లక్షణము.

తటస్థ లక్షణ బ్రహ్మము సత్‌చిత్‌ ఆనందము. అది నామ రూపములందు జేరి యున్నప్పుడు అస్థి భాతి ప్రియములనెడి తత్త్వముగా గోచరించుచు, ఆ నామ రూప వస్తువు ఉన్నది, ఆ నామ రూప వస్తువు తెలియబడుచున్నది. ఆ నామరూప వస్తువే ప్రియమగుచున్నది అని వ్యవహారము కలుగుచున్నది. అవ్యవహారముగా, అసంగముగా ఉన్న అస్థివ్య భాతి ప్రియములే సత్‌ చిత్‌ ఆనంద లక్షణమైన తటస్థ లక్షణము. అస్థిభాతి ప్రియములు నామ రూపములందు అనుస్యూతముగా లేనిచో దృశ్యము, దృశ్య తాదాత్మ్యత ఉండదు. అందువలన అనృత జడ దుఃఖ కారణమైన నామరూపములనుండి సత్‌ చిత్‌ ఆనందములనెడి తత్త్వమును వేరుపరచిన ఆ విలక్షణమైన బ్రహ్మము అనృత జడ దుఃఖములకు వ్యతిరేకార్థమైన సత్‌ చిత్‌ ఆనందములు సాధకుని అనుభవమునకు వచ్చును. అనుభవము ఉన్న దానిలో అహం, బ్రహ్మ అని రెండు (ద్వైతము) ఉండదుట వలన ఇది తటస్థ లక్షణముగా చెప్పబడినది. అహం అనెడి ప్రకృతి కూడా లేకపోగా, అద్వైతము సిద్ధించును. అక్కడ నామరూపములందు వ్యాపకము కాని సత్‌చిత్‌ ఆనందములు తన వ్యాపక లక్షణమును కోల్పోయినయెడల ఆ మూడు లక్షణములు ఘన రూపముగా నున్నవి. జగత్తు మిథ్య గనుక, నిజానికి నిరపేక్షమైన ఘన రూపమే సత్యము, అన్ని కాలములలో శాశ్వతమై యున్నది. అందువలన సత్‌ ఘనము, చిత్‌ ఘనము, ఆనంద ఘనము అని పిలచుటయే సత్యము. అద్వైతము సిద్ధించినది. కనుక ఈ ఘనమనే మాట సాపేక్షమును సూచించుట చేత, ఘనము తిరిగి వ్యాపకమయ్యే ఆస్కారము కనబడుచున్నది. పునరావృతి లేని బ్రహ్మమును స్వరూప లక్షణముతో పిలచినప్పుడు, సత్‌ ఘనమే సత్యము, చిత్‌ ఘనమే జ్ఞానము, ఆనంద ఘనమే అనంతము. అందువలన స్వరూప లక్షణము అనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది సాధకుని యెడల తనలో తాను రమించుట, సత్య జ్ఞానానందములు తానే యగుట, సత్య స్వరూప, జ్ఞాన స్వరూప, ఆనంద స్వరూప, సత్‌చిదానంద స్వరూప, విజ్ఞాన స్వరూప, స్వస్వరూప అనెడి పేర్లు ఉపయోగించబడును. తటస్థ లక్షణ జ్ఞానమును పరోక్షమనియు, స్వరూప లక్షణయుతుని అపరోక్షానుభూతిగాను చెప్పబడును.

ఆధారము - అధిష్ఠానము:

ఆత్మకు రెండు స్వరూపములు కలవు.
1. సద్రూప సామాన్య రూపము.
2. అసంగత, కూటస్థత, నిత్యముక్తతరూప విశేష రూపము.

సకల మిథ్యా రూపములందు వ్యాపకమైన సత్‌ చిత్‌ ఆనంద సామాన్య రూపమును ఆధారమందురు. మిథ్య గనుక, లేనివిగా నిర్ణయించి నప్పుడు కేవల సత్‌చిత్‌ ఆనంద సామాన్య రూపమే నిరపేక్షమగును. సాధకులు మొదటి సామాన్య రూపమును పరోక్షముగా గ్రహించినప్పుడది అనుభవ రూపము, ద్వైతము. ద్వైత జ్ఞానమందు అసంగత, కూటస్థత, నిత్యముక్తత అయిన బ్రహ్మమే ఉన్నది. అన్యము లేదు, అన్నప్పుడు ఆ విశేష రూపము అద్వయము. అది దేనికిని ఆధారము కాదు. అప్పుడది అధిష్ఠానముగా నున్నది. ఇతర కల్పితములున్నను, లేకున్నను, ఉన్నదున్నట్లున్నది. ఇట్టిది స్వానుభవమైనప్పుడు అనుభూతియే ఉన్నది. రెండవది లేదు. ఇదియే అపరోక్షానుభూతి.

చేతనాంశము - ఆభాసాంశము:
చేతనాంశము ఉన్నదున్నట్లున్నది. దానియందు సత్తాస్ఫూర్తి తప్ప మరేదీ లేదు. ఆభాసాంశము జగత్తుకు సంబంధించి, ఉత్పత్తి, స్థితి, వికారములు, లయములుగా కల్పితములను గోచరింపచేయుచుండును.
జీవులయందున్న ఆభాసాంశము శరీరత్రయముగాను, పుణ్య పాపములు చేయుచు, ఫలితములను అనుభవించుచూ అవస్థాత్రయములో తిరుగుచుండును.

ఈశ్వరునియందున్న ఆభాసాంశము జీవునికి కర్మ ఫలితములను ప్రదానము చేయుచుండును. మాయా కార్యములైన సృష్టి, స్థితి లయములకు ఆభాసాంశ ఈశ్వరుడు కర్త యనుకొనును.

జీవులయందున్న చేతనాంశము కూటస్థాత్మగా, నిష్క్రియగా, నిర్వికల్పముగానుండును. ఈశ్వరునియందున్న చేతనాంశము కూటస్థ బ్రహ్మగా, కర్తృత్వ రహితముగా, నిర్వికల్పముగానుండును. జీవ ఈశ్వర ఆభాసాంశలలో భేదమున్నను, చేతనాంశములలో ఏ భేదములేదు. స్వానుభవమైన సాక్షి చైతన్యముననుసరించి కూటస్థాత్మ, కూటస్థ బ్రహ్మ ఒక్కటే. అనగా జీవేశ్వరులు ఒక్కటే.

బ్రహ్మమునందు కూడా ఆభాసాంశ, చేతనాంశ ఉన్నవి. ఆభాసాంశ రూపబ్రహ్మ ఈ మిథ్యా జగత్తుకు సర్వాధారము. చేతనాంశ రూపబ్రహ్మ సృష్టిలో అధిష్ఠాన బ్రహ్మమే, అచలము, పరిపూర్ణము, నిరాధారము, నిర్వికారము, శాశ్వతము.

చేతనాంశ రూప జీవ, ఈశ్వర, బ్రహ్మలు, మూడూ అభేదమై అచల పరిపూర్ణమై యున్నది.

కం||  బ్రహ్మందు లేక కలిగిన బ్రహ్మకు, నేననెడి మాయ ప్రబలె జగంబై |
బ్రహ్మనుగని, తానేగుటె బ్రహ్మననే మాయకు పని, బ్రహ్మందుజుమీ ||

తా|| చేతనాంశ బ్రహ్మమందు, మాయకారణముగా ఆభాసాంశ బ్రహ్మముతోచి, మాయకు పరమైన చేతన బ్రహ్మ సాక్షాత్కరించగా, ఆభాస బ్రహ్మ మాయమగుటయే మాయపని.

చైతన్య ప్రకాశము:
(1) భ్రూమధ్య స్థానమునందు అహం బిందువు
(2) అహం అనంతముగా వ్యక్తమగుటకు అవకాశమిచ్చే స్థానమైన భూమ
(3) సః అనే పరమాత్మ స్థితికి, లేక దైవీ స్థితికి స్థానమైన సహస్రారము - ఈ మూడు స్థాన బిందువులను త్రిభుజాకారముగా కలుపగా, దానిమధ్య ఉద్భవించిన అంతర్గత చైతన్య ప్రకాశమే ప్రజ్ఞ. సంవిత్‌. ఆ చైతన్యమే మనలోనే మన వెంట వచ్చుచున్నది. ఈ చైతన్య ప్రకాశములోనే అవతారులు అనుగ్రహించిన చైతన్యము కలసిపోయి, భక్తులకు ఆధ్యాత్మిక పురోగమనమునకు వారి అంతరాత్మ స్ఫూర్తిగా పనిచేయుచున్నది. మానవ చైతన్యమును అవతారుని చైతన్యము వద్దకు ఏకోన్ముఖము చేసి కేంద్రీకరించిన సాధకులు అవతారుని అనుగ్రహమునకు పాత్రులగు చున్నారు. సర్వార్పణ అయిన భక్తులు భగవదైక్యము చెందుచున్నారు.

చిత్కళలు:
1. వియన్మండలము (2) తమో మండలము (3) మేఘ మండలము (4) విద్యున్మండలము (5) సూర్య మండలము (6) జ్యోతిర్మండలము (7) తారా మండలము (8) చంద్ర మండలము (9) వహ్ని మండలము (10) హిరణ్మయ మండలము.

బ్రహ్మ అణోరణియాన్‌:
ఒక్క పృథివి అణువులో 11 జలాణువులు కలవు. ఒక్క జల అణువులో 11 తేజో అణువులు కలవు. ఒక్క తేజో అణువులో 11 వాయు అణువులు కలవు. ఒక్క వాయు అణువులో 11 ఆకాశాణువులు కలవు. ఒక్క ఆకాశాణువులో 11 బ్రహ్మాణువులు కలవు. ఒక్క బ్రహ్మాణువు లోపల దశ విధ ప్రాణములు వాటికాధారమైన ముఖ్య ప్రాణమున్నది. ఆ మహా ప్రాణమే పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యమే అణోరణియాన్‌. ఆ పరమాత్మ అన్నింటిలో అణోరణియాన్‌గా వ్యాపించి వాటికి మీరి, అన్నింటినీ తనయందుంచుకొనగా, మహతోమహియాన్‌గా కూడా నున్నాడు.

జ్ఞానము:
ద్వైతము, అద్వైతము, పరము, అపరము మొదలగు భేదముల చేత ప్రకాశించుచున్న బహు విధములు, వాటి ఫలితములు కలిపి జ్ఞానమనబడును. జ్ఞానమే విద్యా రూపము, జ్ఞానమే మాయ.

అపర జ్ఞానము:
ఇంద్రియాతీతమైన కేవల చిదాత్మ యొక్క స్వరూపమును బుద్ధిచేత నిశ్చయముగా గ్రహించుటయు, ఇంద్రియ గోచర విషయములతో అంటియున్న మిథ్యాహము నశించుటయు, ఈ హద్దు వరకు అపర జ్ఞానము.

పర జ్ఞానము:
నిర్వికల్ప సమాధియందు, ఏ స్వరూపము గుర్తించబడినదో, తక్కిన సమయములందును, అదే స్వరూపము తెంపు లేకుండా కొనసాగి యుండునో, అపర జ్ఞానమనెడి హద్దు మీరి యున్నదో అట్టి జ్ఞానము పరజ్ఞానమబడును.

అద్వైత జ్ఞానము:
దృశ్యమైనట్టి ఏవియును లేక, కేవలము స్వయముగా ప్రకాశించు పరమ చైతన్యమును అద్వైత జ్ఞానమందురు. దీనివలన ద్విపుటి త్రిపుటులు నశించును. ఇదియే అపరోక్షానుభూతి.

అపరోక్షానుభూతి:
స్వరూప లక్షణముగా చెప్పబడిన జ్ఞేయవస్తువు, జ్ఞాతయందు యోగించిన స్వరూప లక్షణము ఒక్కటేననెడి ఆ స్వరూప లక్షణ సామాన్యాధికరణము చేత, జ్ఞేయవస్తువు పరిత్యాగమగును. జ్ఞాత స్వరూపమగును. వెనువెంటనే జ్ఞాత ఉనికిని కోల్పోవును. స్వరూప లక్షణము జ్ఞాతయందు జేరి సహజము కాగా జ్ఞాత లయమగునని అర్థము. ద్వైతములో జ్ఞాతకున్న సత్‌చిత్‌ ఆనందానుభవము, జ్ఞాత లేకుండా పోయినప్పుడు ఆ జ్ఞానము విజ్ఞానమగును. అద్వైత సిద్ధిలో అది సత్యం జ్ఞానం అనంత బ్రహ్మమనెడి స్వస్వరూప సాక్షాత్కారము, లేక అపరోక్షానుభూతి.

స్థిత ప్రజ్ఞుడు:
ఎప్పుడైతే ఒకడు మనస్సులోనికి ప్రవేశించియున్నవి, ప్రవేశించుచున్నవి అయిన ప్రాపంచిక అర్థములను అన్నింటినీ సర్వ కామనలను మొదలంటా త్యజించి యుండునో, ఎప్పుడైతే లౌకికమైన సంగతులను, సంఘటనలను అధిగమించి యుండునో, అదే సమయములో సర్వేసర్వత్రా ఆత్మను సందర్శించుచూ యుండునో, నిత్య తృప్తిలో విశ్రాంతుడై ఆనందమును అనుక్షణము స్వభావ సిద్ధము చేసుకొని యుండునో, అతడే స్థిత ప్రజ్ఞుడు అనబడును. నిశ్చల బుద్ధియైన మౌని అతడే.

పరేంగితా ప్రజ్ఞ:
ఎవరు బాహ్య విషయములందు ప్రవర్తించుచున్నప్పటికీ ఆయా వస్తురూపములగుచున్నప్పటికీ తనదైన, తానే అయిన ఆత్మ రూపమును కోల్పోవుట లేదో, అట్టివారు ప్రజ్ఞా స్వరూపమునందే, మనో వ్యాపారమును లీలా వినోదముగా జరుపుచున్నారో, వారే పరేంగితా ప్రజ్ఞావంతులు.

పర+ఇంగిత= పరేంగిత అనగా పరము గాను, లౌకికముగాను ఏక కాలములో యోగించి యుండుట. అక్కడ ప్రజ్ఞా విలాసమే గాని, మనో వ్యాపార తాదాత్మ్యత ఉండదు.

శరీర ప్రారబ్ధము కొఱకు, గుర్వాజ్ఞానుసారము, దైవీ ప్రణాళికలో పాలుపంచుకొనుట వంటివి లౌకిక కార్యకలాపాలకు కారణము కావచ్చును. అయినను వారి బ్రహ్మ నిష్ఠకు అంతరాయముండదు. ఇట్టివారు జీవన్ముక్తులు గాని, సద్గురువులు గాని, అవతార పురుషులు గాని కావచ్చును. క్రమ సాధనలో ఇది పరేంగితా ప్రజ్ఞా యోగము. అవతార పురుషులలో ఇది సహజము.

దశాంగుళ న్యాయము:

భూమికంటే జలము 10 రెట్లు సూక్ష్మము. జలము కంటే అగ్ని 10 రెట్లు సూక్ష్మము. అగ్నికంటె వాయువు 10 రెట్లు సూక్ష్మము. వాయువుకంటె ఆకాశము 10 రెట్లు సూక్ష్మము. ఆకాశము కంటె మహదహంకారము 10 రెట్లు సూక్ష్మము. మహదహంకారముకంటే మహత్తు 10 రెట్లు సూక్ష్మము. మహత్తుకంటె మూల ప్రకృతి 10 రెట్లు సూక్ష్మము. మూల ప్రకృతికంటె బ్రహ్మము 10 రెట్లు సూక్ష్మము. చివరకు సూక్ష్మాతిసూక్ష్మమైన బ్రహ్మము కంటె సూక్ష్మమైనదింకేదీ లేదు.

ఈ విధముగా ఒకదానికంటే మరొకటి పదేసి రెట్లు అధిక సూక్ష్మమని తెలుపుచూ అవాంగ్మానస గోచరమైన బ్రహ్మమును, ఊహకు, లక్ష్యమునకు అందించు పద్ధతిని దశాంగుళ న్యాయమందురు.
ఈ దశాంగుళ న్యాయములో విరాజిల్లే సమస్త లోకములు, విశ్వ రూపుడైన విరాట్పురుషునికి ఒక్క పాదమే. తక్కిన మూడు పాదములు తనకు తానుగా సిద్ధమైన పురుషోత్తముడు. ఈయనకు దశాంగుళ న్యాయము వర్తించదు.

ప్రత్యభిజ్ఞానము:

సాధకుడి చిత్త శుద్ధియైనట్టి చిదాత్మతో లయమై నిర్వికల్ప సమాధిని పొందిన తరువాత, సమాధినుండి లేచినవాడు, తాను సమాధి యందు ఏ చిదాత్మ రూపముగా నున్నాడో, తరువాత కూడా, ఆ శుద్ధ చిదాత్మ రూపముగానే కొనసాగియున్నాడని గుర్తించుటను ప్రత్యభిజ్ఞానము అందురు.

తాను నిజానికి బ్రహ్మమే అయియుండి, భ్రాంతి కాలములో మరచినాడు గాని, తాను భ్రాంతి కాలములో కూడా బ్రహ్మమే. ఇప్పుడు సమాధియందు సహజమై యుండగా కలిగిన జ్ఞానము క్రొత్తది కాదు. కేవలము మరపు తొలగినది. అయినవాడే తిరిగి అగుచున్నాడు అని అర్థములో ప్రత్యభిజ్ఞ అనుచున్నారు. తాను తానే అయియున్నది త్రికాలాబాధ్యము. సూర్యచంద్రుల ప్రకాశము రాహుగ్రస్తమునకు ముందును, గ్రహణ కాలములోను, గ్రహణ విడుపు తరువాతను ఎట్లు నిరంతరాయముగా నున్నదో, గ్రహణ కాలములోనూ సూర్యచంద్రులు ప్రకాశించుచుండగా, అజ్ఞాన దృష్టికి లేనట్లు జ్ఞాన దృష్టికి మరల వచ్చినట్లు అనిపించుట వలె సాధకుడు తనకు తెలిసినా తెలియకపోయినా, తాను ఆద్యంతములు లేని బ్రహ్మము. తాను బ్రహ్మము కాదను అజ్ఞానము వీడగా అదే మళ్ళీ తాను బ్రహ్మమే అయినట్లయినది. గాని, తాను కాకుండా పోయినది లేదు. ఇది అపరోక్షానుభూతి నిర్ణయము.

సరూప మనోనాశనము:
మనస్సు ప్రాతిభాసికమైన శుద్ధ సత్వ గుణముగా నుండును. శరీర ప్రారబ్ధముండును. పునర్జన్మ ఉండదు. వైరాగ్యాభ్యాసముల చేత సర్వము నిరోధించబడగా, ఆత్మ మాత్రమే శేషించి యుండును. దీనిని సరూప మనోనాశనమందురు. దీని ఫలము జీవన్ముక్త స్థితి. కేవలాత్మ నిర్గుణమై యుండును. మైత్రి ముదిత కరుణ ఉపేక్ష వంటి సత్వగుణ స్వభావము కూడా పోవును.

అరూప మనోనాశనము:
మనస్సు ప్రాతిభాసిక మాత్రముగా కూడా ఉండదు. శుద్ధ సత్వము విశుద్ధ సత్వమగును. శరీర ప్రారబ్ధమును పట్టించు కొనడు. మైత్రాది గుణములు పోగా, వాటి ఆశ్రయమైన మనస్సు కూడా పూర్తిగా నశించును. నిష్కళరూపమగును. చిత్తము నశించగా, పునరావృతి ఉండదు. ఇది విదేహముక్తి అనబడును.

జ్ఞాన ఫలము:
హృదయ గ్రంధి వీడిపోవును. సంశయ రాహిత్యమగును. వాసనాక్షయమగును. సంచితములు దగ్ధమగును. సరూప మనోనాశ్‌ యగును. బ్రహ్మనిష్ఠ తైలధారవలె ఉండి, సంతృప్తి, నిరతిశయానందము కొనసాగుట జ్ఞాన ఫలము.

విదేహముక్తి:
దృశ్యము కానట్టి, మనః పీడన లేనట్టి శివశబ్ద వాచ్యమగు చిన్మాత్రముగా నుండుటయే విదేహముక్తి అనబడును.

జీవన్ముక్తి:
నిర్వికార ఆత్మ స్వరూపుడై, జగత్తులో సుషుప్తునివలె ఉండువాడు, కాని అవిద్యా రూపమగు సుషుప్తి లేనివాడు. సర్వావస్థలయందు మేల్కొనియే యుండువాడు. జాగ్రత్‌ వాసనాక్షయమైనవాడు. అందువలన కలలు కననివాడు, శరీర ప్రారబ్ధము అనుభవములో నున్నను పాము కుబుసము విడచునప్పుడున్న బాధవలె సహించుచు, ఆనందపడువాడు. కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా అతనివలన కొన్ని పనులు జరుగుచుండును గనుక ఆగామి లేనివాడు. జ్ఞాని గనుక, సంచితమున్ను లేనివాడు.ఇతడే జీవన్ముక్తుడు.

బ్రహ్మవిదుడు:

ఆత్మకు సహజ లక్షణమైన ఆనందానుభవము కొనసాగుచుండును. తనలో తాను రమించుచుండును. జ్ఞానవికాసము జరుగుచుండగా, బ్రహ్మ విద్వరుడుగా, బ్రహ్మ విద్వరీయుడుగా, బ్రహ్మ విద్వరిష్ఠుడుగా పరివర్తన చెందును. కాని ముక్త స్థితిలో ఏ మార్పు ఉండదు. ఈ భేదములు శరీర ప్రారబ్ధముననుసరించి, లోక కళ్యాణ కార్యక్రమముల కొఱకు మాత్రమే. అయినను కర్తృత్వ భోకృత్వములు లేనివాడు గనుక అతడు ముక్తుడే.
దేహళీదత్త దీప న్యాయము : దేహళీ అనగా గడప. దేహళీ దత్త దీపమనగా గడపమీద ఉంచిన దీపమని అర్థము. ఆ దీపము లోపలా, బయటా తన ప్రకాశమును వ్యాపింపజేయును. లోపల అనగా మాయావరణ లేని చోటు. బయట అనగా మాయావరణ కల్పించిన చోటు. దీపమనగా అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశము. గడప అనగా మాయద్వారము. నిరావరణమందు స్వప్రకాశ సాక్షాత్కారము లోపలిది. మాయావరణయందు సర్వత్రా వ్యాపకమైన సర్వమును ప్రకాశింపజేయుట బయటిది. పరబ్రహ్మ స్వరూపము లోపలిది. పరమాత్మానుభవము బయటిది. మాయ ద్వారము వద్ద నిలిచి, లోపలా, బయటా రెండు చూడగలిగినటుల, జీవన్ముక్తుడు బ్రహ్మనిష్ఠగా ఉంటూనే, బాహ్య ప్రపంచమునందు అసంగునిగా, సాక్షీభూతునిగా వ్యవహరించును. దీనినే దేహళీదత్త దీప న్యాయమందురు.

పురాణేతిహాసములందు బాహ్యార్థమును ఒక చరిత్రగాను, అంతరార్థమును ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగాను చూపించుటలో ఈ దేహళీదత్త దీపన్యాయమున్నది. ఉదా : రామాయణము - ఆధ్యాత్మిక రామాయణము.
పశ్చిమ దృష్టి : తూర్పు దృష్టి సూర్యోదయమును చూచుట. పశ్చిమ దృష్టి సూర్యాస్తమయమును చూచుట. సాధకునికి తూర్పు దృష్టి వలన జ్ఞానోదయ మగును. దీనివలన అతడు బ్రహ్మానందానుభవమును పొందును. ఇది మాయ ద్వారమునకు ఈవలి మాయావరణమునందు కలిగిన పరోక్ష జ్ఞానము. పశ్చిమ దృష్టి వలన మాయావరణయందు కలిగిన జ్ఞానము అస్తమించి, నిరావరణ బ్రహ్మమగును. జ్ఞానము విజ్ఞానమగును. ప్రకాశము స్వస్వరూపమగును. ఆభాస అస్తమించి స్వయం భాస సాక్షాత్కరించును. అందువలన పశ్చిమ దృష్టిని సిద్ధింపజేసుకొనును.

జ్ఞాన భూమికలు:

1. శుభేచ్ఛ:
వివేక వైరాగ్యములు కలిగి, సంసార సాగరమును దాటవలెనని ఇచ్ఛ కలిగి మంచి పనులు చేయుట. ప్రేమాభిమానములు చూపుట, పరోపకార బుద్ధి, త్రికరణ శుద్ధి కలిగి సత్కర్మాచరణ, సదాచార ప్రవర్తన, సజ్జన సాంగత్యము, సేవ మొదలగు వాటిచే బుద్ధిని వృద్ధి పొందించుకొనుట.

2. విచారణ:
జ్ఞాన సాధనలను సంపాదించుట, శాస్త్ర పఠన, శ్రవణాదులు చేయుట, ఆత్మ విచారణ, శ్రౌత స్మార్త కర్మాచరణ, నిత్యానిత్య వస్తు వివేకము కలిగి, అభిమానము, మదము, దంభము, మోహము మొదలగు దుర్గుణములను పూర్తిగా త్యజించుట. పండితులను, గురువులను ఆశ్రయించుట, గురు శుశ్రూషలు జరుపుట ద్వారా సూక్ష్మ బుద్ధిని ప్రాప్తింప జేసుకొనుట. ఈ సూక్ష్మ బుద్ధిచేత గాని, సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గ్రహించలేరు.

3. అసంసర్గము:
అద్వైతాత్మను నిర్ణయించు మహా వాక్యార్థములందు నిశ్చయ బుద్ధి కలిగి, విరాగియై, తత్త్వమును మననము చేయుచూ చిత్తోప శాంతి కలుగగా లభించిన అసంగ సౌఖ్యమును పొందియుండుట. ఇందులో సామాన్య అసంసర్గము, విశేష అసంసర్గము అని రెండు విధములు.

1. సామాన్య అసంసర్గము:
నేను కర్తను కాదు, భోక్తను కాదు, బాధ్యుడిని కాదు, బాధకుడిని కాదు అని తలచి పదార్థములందు అసంగుడై యుండుట.
2. విశేష అసంసర్గము:
ఆత్మ వస్తువు కరతలామలకము వలె స్పష్టము కాగా, సంసార సాగరమునకు ఆవలి తీరముననున్న పరబ్రహ్మమునందు జేరి, మౌనియై, శాంతుడై యుండుట. ఆద్యంత రహితము పరమశాంతము అయిన తత్త్వమును ఆశ్రయించి యుండుట.
3. వాసనలయము:
ద్వైత భావము నశించుట, అద్వైత భావము స్థిర రూపమును దాల్చుట. ద్వైతవాసనలు క్షయమగుట. సంసారము స్వప్న తుల్యమగుట.
4. సత్తామాత్రము:
సర్వ వాసనా రాహిత్యము. చిన్మయమై, సత్తా మాత్రముగా నుండుట అనగా ఆ సత్తా క్రియోన్ముఖము కాకుండుట, చిత్తము విలయమై, జగద్రూప వికల్పములు ఉడిగిపోగా, సుషుప్తునివలె యుండి ఘనీభూతానందాకారమగుట.
5. తుర్యము:
క్రమముగా తుర్యుడై ఉదాసీనావస్థలో నుండును. అహం రహితుడై సంశయ రహితుడై, జీవన్ముక్తుడై,చిత్రములో ప్రకాశించే దీపమువలె ఉండును. సముద్రములో మునిగియున్న పూర్ణకుంభమువలె ఉండును. జాగ్రత్‌ స్వప్నములుండవు. అజ్ఞానము లేదు గనుక, సుషుప్తి ఉండదు. సంకల్ప వికల్పములు లేని నిర్వికల్ప బ్రహ్మమై యుండును.
6. తుర్యాతీతము:
ఇది అనిర్వచనీయము, నిత్య సిద్ధము, నిరుపాధికము, సమరూపము, అంతటా పరిపూర్ణము, సౌమ్యము, స్వచ్ఛము, ప్రసన్నత, పరమ శాంతము, కైవల్య రూపము, తుర్యాతీతము, విదేహ ముక్తి.

లక్షణ వృత్తి త్రయము:

1. జహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థమును పరిత్యజించి, అశక్యార్థము యొక్క సంబంధము గల అన్య పదార్థమునందు, ఆ పదము యొక్క ఏ లక్షణ వృత్తి ఉన్నదో, అది జహల్లక్షణ అనబడును. ఆత్మకు బదులుగా, ఆత్మకు సమీపమందున్న అసత్య నేను, తన అజ్ఞానము చేత వ్యవహరించుచూ, బంధ దుఃఖములను పొందుచున్నది. ఆత్మ-అనాత్మ అని రెండు ఉన్నట్లు చెప్పే బోధ జహల్లక్షణ. ఆత్మకంటె అన్యము లేదు గనుక, బ్రహ్మ నిర్ణయమునకు జహల్లక్షణ సరిపోదు.

2. అజహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థమును పరిత్యజించకయే, ఆ శక్యార్థము కల మరొక పదము యొక్క సంబంధము గల అన్య పదార్థము నందు ఏ లక్షణ వృత్తి ఉన్నదో, అది అజహల్లక్షణ. ఆత్మ వ్యవహరించుటకు బదులుగా ఆత్మ చైతన్యము వలన చైతన్యవంతమైన మనస్సు, బుద్ధి, ఇంద్రియములు వ్యవహరించుచున్నవి అని చెప్పే బోధ అజహల్లక్షణ అనబడును. అనాత్మ వ్యవహారము భ్రాంతి గనుక ఆత్మకు కారణత్వము గాని, ఆత్మ ఆధారమని గాని చెప్పలేము. ఆ భ్రాంతికి అనాది మాయయే కారణము గాని, ఆత్మ కాదు. ఆత్మ అద్వయముగనుక మాయ నిజానికి లేని మాయ. అందువలన బ్రహ్మ నిర్ణయమునకు అజహల్లక్షణ సరిపోదు.

3. జహదజహల్లక్షణ:
పదము యొక్క శక్యార్థము యొక్క ఏకదేశ పరిత్యాగము చేసిన, అదే పదము యొక్క ఏ లక్షణ వృత్తి మిగిలియున్నదో, అది జహదజహల్లక్షణ అనబడును. మహావాక్య విచారణయందు ఒకే వస్తువు యొక్క వాచ్యార్థమును విడచినప్పుడు ఏది మిగులునో, అది లక్ష్యార్థమైన బ్రహ్మము. వాచ్యార్థమైన మాయాకల్పితమైన బ్రహ్మమును, వాచ్యార్థమైన మాయాకల్పిత దేశ కాలవస్తువులను విడచి, లక్ష్యార్థమైన అంతర్యామిని అద్వయ బ్రహ్మ స్వరూపముగా నిర్ణయించుకొనుటను జహదజహల్లక్షణ అందురు. ఈ లక్షణ వృత్తి వేదాంత సిద్ధాంత బోధకు సరిగ్గా సరిపోవును. తత్త్వమసి వాక్యర్థమును భాగత్యాగ లక్షణ అయిన జహదజహల్లక్షణచేత చక్కగా నిర్ణయించి పరబ్రహ్మగా ఆరూఢమగుటకు ప్రయోజనమగును.

ఆనందాష్టకము:
విషయానందము, వాసనానందము, ముఖ్యానందము, నిజానందము, విద్యానందము, ఆత్మానందము, అద్వైతానందము, బ్రహ్మానందము.

సాధకుని ఆనందములు:
1. అవిద్యానందము : స్థూల దేహ సంబంధము వలన, దేహేంద్రియ సంపర్కము వలన కలిగే ఆనందము.
2. విద్యానందము : బాహ్య విద్యల వలన కలిగే ఆనందము.
3. యోగానందము : యోగ ధ్యానాదుల చేత, ప్రణవానుసంధానము చేత కలిగే ఆనందము.
4. జ్ఞానానందము : విజ్ఞానమయ కోశము బాగుగా వికసించుట వలన తన్మయత్వము పొందినప్పుడు గాని, ఆర్తి, ఉద్వేగము వంటివి కలిగినప్పుడు గాని, కొన్ని తత్త్వములు, పద్యములు, పాటలు పాడుట, నృత్యము చేయుట, కవిత్వము చెప్పుట వంటి వాటివలన గాని కలిగే ఆనందము.

ఇవన్నీ భ్రాంతులే. ఇవి బుద్ధి పరిథిలో కలిగే ఆనందములు. సత్‌చిత్‌ ఆనందము అహం పరిథిలోనిది. ఆనంద ఘనము, లేదా ఆనంద స్వరూపము మాత్రమే అద్వయమై యున్నది. అనుభవములోగాని, ఎరుకలో గాని, ఉన్న ఆనందము భ్రాంతి. ఎరుక పోతే ఆనంద ఘనమును చెప్పేవారే లేరు గనుక ఆనందమే లేదని అనవచ్చును. అది అనంతము, పరమపదము.

బ్రహ్మానందము:
బ్రహ్మానందమునకు కొలతలు చెప్పిన యెడల అది ఉన్నదున్నట్లున్న సత్యము కాదు. అయినను పరిశీలించెదము.

1. మనుష్యానందము : ఉత్తమ ఆశయములు, దృఢమైన సంకల్ప శక్తి కలవాడు, బలిష్ఠుడు, వేదాధ్యయన సంపన్నుడు, సద్గుణశాలి, నడి యవ్వనములోనున్న ఏక ఛత్రాధిపతి, ఐశ్వర్యవంతుడు అయినట్టి మానవుని ఆనందము. మానవులలోకెల్లా అధికాధిక ఆనందమును అనుభవించు మానవుని ఆనందము. ఇది కారణముతో కూడిన ఆనందము. కారణము నశించిన ఉండనిది.
2. మనుష్య గంధర్వ ఆనందము : పై చెప్పిన మనుష్యానందమునకు నూరు రెట్లు అధికము.
3. దేవగంధర్వానందము : ఇది మనుష్య గంధర్వానందమునకు నూరు రెట్లు అధికము.
4. చిరలోక వాసులగు పితరుల ఆనందము : దేవ గంధర్వ ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
5. అజానజుల ఆనందము : పితరుల ఆనందము కంటే నూరు రెట్లు అధికము.
6. వైదిక కర్మల చేత దైవత్వము పొందిన కర్మ దేవతల ఆనందము :
అజానజుల ఆనందముకంటె నూరు రెట్లు అధికము.
7. దేవతల ఆనందము : కర్మ దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
8. ఇంద్రుని ఆనందము : దేవతల ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
9. బృహస్పతి ఆనందము : ఇంద్రుని ఆనందము కంటే నూరురెట్లు అధికము.
10. ప్రజాపతి ఆనందము : బృహస్పతి ఆనందముకంటె నూరు రెట్లు అధికము.
11. హిరణ్యగర్భుని ఆనందము : ప్రజాపతి ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
12. బ్రహ్మానందము : హిరణ్యగర్భుని ఆనందము కంటె నూరు రెట్లు అధికము.
13. కామరహితుడైన బ్రహ్మవేత్త ఆనందము : బ్రహ్మానందముతో సమానమైన ఆనందము.
14. విజ్ఞాన స్వరూపుడు : ఆనందమే తానైనవాడు. ఆనంద కారణములు లేనివాడు.
15. అచల పరిపూర్ణుడు : ఆనంద రహితుడు, భ్రాంతి రహితుడు, బట్టబయలు.

శింశుమారక చక్రము:
విశ్వములోని గ్రహముల కావల సప్తర్షి మండలము, దానిపైన శింశుమారక చక్రమున్నది. అక్కడ ధృవ, ఇంద్ర, వరుణ, యమ, కశ్యపాదులు ఆకల్పాంతము ఉందురు. ఈ ధృవ మండలము చుట్టూ సర్వగ్రహములు, తారకలు, గోళములు పరిభ్రమించుచుండును.

అంతరార్థములో శింశుమారక చక్రము ఒక స్థానము కాదు. ధృవమనగా ఘనరూప అఖండ ఎరుక అయితే, శింశుమారక చక్రము బట్టబయలు. బట్ట బయలునుండి ఏదీ వ్యక్తము కాదు. బట్టబయలులో ఏదీ లయము కాదు. ధృవమనే అఖండ ఎరుక ఘనము అనే స్థితినుండి, ద్రవీభూతము, వ్యాపకత్వము మొదలైన కదలికలతో వికారమై, తిరిగి సాధనలచేత, యోగాభ్యాసములచేత ధృవమగు ఘనస్థితికి చేరుటను ఎరుక లేక హంస యొక్క అవరోహణగాను, ఆరోహణగాను చెప్పబడినది. ఈ హంసయే ముందుగా లేకనే ఉన్నట్లు తోచి, తుదకు లేనిది లేకుండా పోవుటగా చెప్పబడినది. అయినను, శింశుమారక చక్రము గురించి పెద్దల నిర్ణయమే శిరోధార్యము.

శ్రు||  ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవ స్వరూపమ్‌
- ఆత్మబోధోపనిషత్‌

Yaksha Prashnalu యక్ష ప్రశ్నలు – జవాబులు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే!!! ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

About Puranalu - మన పురాణాలు - సూక్ష్మ వివరణ - పురాణాలు ఎన్ని? అవి ఏవి?


మన పురాణాలు - సూక్ష్మ వివరణ

మన పురాణాలు 18. మత్స్యపురాణం, కూర్మపురాణం, వామన పురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం, వాయు పురాణం, నారద పురాణం, స్కాంద పురాణం, విష్ణుపురాణం, భాగవత పురాణం, అగ్నిపురాణం, బ్రహ్మపురాణం, పద్మపురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగపురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యపురాణం

ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.

మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.

కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోపాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.

వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.

నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

స్కందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.

బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.

బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.

లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.

భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.

బ్రహ్మాపవైపర్తపురాణము : ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి.

పురాణాలు ఎన్ని? అవి ఏవి?

అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే! ఆయన రచించిన పురాణాలను తేలికగా గుర్తించడానికి పద్మ పురాణంలో గల ఈ క్రింది సూత్రం తోడ్పడుతుంది.

‘మ‘ద్వయం ‘భ‘ద్వయం చైవ ‘బ్ర‘త్రయం ‘వ‘ చతుష్టయం |
‘అ‘ ‘నా‘ ‘ప‘ ‘లిం‘ ‘గ‘ ‘కూ‘ ‘స్కా‘ని పురాణాని పృథక్ పృథక్ ||
‘మ’ మరియూ ‘భ’ అక్ష్రరంతో మొదలయ్యెవి రెండు, ‘బ్ర’ అనే అక్ష్రరంతో మూడు, ‘వ’తో నాలుగు మరియూ ‘అ’, ‘నా’, ‘ప’, ‘లిం’, ‘గ’, ‘కూ’, ‘స్కా’ అను శబ్దాలతో ఒకొక్కటి; మొత్తం 18.
శబ్ధము సంఖ్య పురాణాలు
‘మ’ 2 మత్స్య మరియూ మార్కండేయ పురాణాలు
‘భ’ 2 భాగవత, భవిష్య పురాణాలు
‘బ్ర’ 3 బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ పురాణాలు
‘వ’ 4 వరాహ, వామన, వాయు మరియూ విష్ణు పురాణాలు
‘అ’ 1 అగ్ని పురాణం
‘నా’ 1 నారద లేదా నారదీయ పురాణం
‘ప’ 1 పద్మ పురాణం
‘లిం’ 1 లింగ పురాణం
‘గ’ 1 గరుడ పురాణం
‘కూ’ 1 కూర్మ పురాణం
‘స్కా’ 1 స్కంద లేదా స్కాంద పురాణం

పురాణలలో నారద పురాణానికి ఓక ప్రత్యేకత ఉన్నది. అష్టాదశ పురాణాలలో చెప్పబడిన విషయానుక్రమణిక పూర్వ భాగంలో 92 నుంచి 109 అధ్యాయాలలో ఇవ్వబడింది. దీని ఆధారంగా, ప్రస్తుతం లభ్యం అవుతున్న పురాణాల మూల రూపము, ప్రక్షిప్త అంశాలను తేలికగా తెలుసుకోనవచ్చును. నారద పురాణమును బట్టి పైన ప్రస్తావించిన 18 పురాణములు, వాటి గుర్తింపు సరితూగుతున్నాయి. ఈ దృష్టాంతాన్ని ఇక్కడ ప్రస్తావించడానికి ఒక బలమైన కారణమున్నది. ఇతర ప్రాచీన ఐతిహాసిక విషయాలకులాగానే, పురాణాల పట్టిక మీద (మహా పురాణాలు ఏవి?) కొన్ని విభేదాలున్నాయి. ఉదాహరణకు భాగవతం అంటే కొందరు పండితులు “దేవీ భాగవతం” అని మరి కొందరు “విష్ణు భాగవతం” అని భావిస్తారు. అలాగే, వాయు పురాణం స్థానంలో కొందరు శివ పురాణాన్ని చేరుస్తారు. ఏది ఏమైనా, అన్నీ ధర్మాన్నే భోదిస్తాయి కాబట్టి, ఏదనుకున్నా తప్పు లేదని నా అభిప్రాయం.

మరో ముఖ్య గమనిక. పైన ప్రస్తావించిన సూత్రంలో “అనాపలింగకూస్కా” (‘అ‘, ‘నా‘, ‘ప‘…)ని విడగొట్టినప్పుడు, నా వద్దనున్న వివిధ గ్రంథాలు ఎకోన్ముఖంగా ‘అ‘, ‘నా‘, ‘ప‘, ‘లింగ‘, ‘కూ‘ మరియూ ‘స్కా‘ లుగా పేర్కొంటున్నాయి. ఆ విధంగా ‘లింగ‘ అని పరిగణించినట్లైతే, మొత్తం సంఖ్య 17కు చేరుతున్నది. పద్దెనిమిదవది “శ్రీమద్భాగవతం” అని పేర్కొన బడుతున్నది. కానీ, నాకు తోచినంత మటుకు అది ‘లింగ‘ గా కాక ‘లిం‘ మరియూ ‘గ‘లుగా భావించినట్లైతే నారద పురాణముతో సరిగ్గా సమన్వయమవుతున్నది. కనుక పైవిధముగా దాని విశ్లేషణను ప్రతిపాదించాను. ‘లింగ‘ అని పరిగణించినపుడు, గరుడ పురాణము ను ప్రస్తావించడం కుదరదు. ఇది మరో కారణం.

పురాణ లక్షణాలు

ప్రతిదానికి ఒక లక్షణం అనేది ఉంటుంది. అది ఎలా ఉండాలి, దానిలో కనీసం ఏవేవి ఉండాలి? ఇదే క్రమంలో పురాణమంటే ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంటుంది. తేలికగా, ’పురాణం పంచ లక్షణం’ అని మత్స్య పురాణంలో సమాధానము దొరుకుతుంది; అనగా పురాణానికి ఐదు లక్షణాలుండాలని.

సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ |
వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణమ్ ||

అనగా (1) సర్గము, (2) ప్రతి సర్గము, (3) వంశము, (4) మన్వంతరము మరియూ (5) వంశానువర్ణనములు ఉండవలెను అని.

1. సర్గము: ఈ చరాచర ప్రపంచము దానిలోని నానా పదార్థాల ఉత్పత్తి లేదా సృష్టినే సర్గ అంటారు.
2. ప్రతిసర్గము: సర్గమునకు వ్యతిరేకమైనది ప్రతిసర్గము; అనగా లయము లేదా ప్రళయము.
3. వంశం: బ్రహ్మద్వారా ఎందరు రాజులు సృష్టించబడ్డారో (ప్రజాపతులు) వారియొక్క భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో గల సంతాన పరంపరను వంశము అనవచ్చును.
4. మన్వంతరము: విభిన్న కాలాలలో జరిగిన సంఘటనలకు గుర్తుగా ఉండే కాల గణనం. ఉదాహరణకు మనము నిత్య పుజలో చేయు దేశ కాల సంకీర్తనములో “వైవస్వత మన్వంతరే” అంటాము. అనగా ఈ కల్పమునకు వివస్వంతుడు (వైవస్వతుడు) మనువు.
5. వంశానుచరితము: పైన తెలుపబడినట్లుగా చక్రవర్తులు, ఋషుల వంశాలలో ఉత్పన్నం చెంది, ఆయా వంశాలకు మూల పురుషులైన రాజుల విశిష్ట వర్ణనమే వంశాను చరితం.
పురాణముల గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మున్ముందు, మరికొన్ని విశేషాలను, ఈ టపాలో నామమాత్రంగా ప్రస్తావించిన “స్మృతుల” గురించి, పద్దెనిమిది పురాణాలలో ప్రతిదాని గురించి క్లుప్తంగా టపాలు వ్రాసే ప్రయత్నం చేయగలను.

అష్టాదశ పురాణాలు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం

Lakshmi Narasimha Karavalamba Stotram in Telugu - లక్ష్మీనరసింహ స్తోత్రం

లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంశ్రీ మత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || ౩ ||

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10 ||

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14 ||

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం ||

Siva Shadakshari Stotram - శివ షడక్షరీ స్తోత్రమ్

శివషడక్షర స్తోత్రమ్
ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧||

నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨||

మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩||

శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪||

వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫||

యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬||

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭||

ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

SIVA SHADAKsHARi STOTRAM - This is in sanskrit english


‖om om‖

onkarabindu samyuktam nityam dhyayanti yoginah |

kamadam mokshadam tasmadonkaraya namonamah ‖ 1 ‖


‖om nam‖

namanti munayah sarve namantyapsarasam gaṇah |

naraṇamadidevaya nakaraya namonamah ‖ 2 ‖


‖om mam‖

mahatatvam mahadeva priyam GYanapradam param |

mahapapaharam tasmanmakaraya namonamah ‖ 3 ‖


‖om sim‖

sivam santam sivakaram sivanugrahakaraṇam |

mahapapaharam tasmacChikaraya namonamah ‖ 4 ‖


‖om vam‖

vahanam vṛshabhoyasya vasukih kaṇṭhabhushaṇam |

vame saktidharam devam vakaraya namonamah ‖ 5 ‖


‖om yam‖

yakare samsthito devo yakaram paramam subham |

yam nityam paramanandam yakaraya namonamah ‖ 6 ‖


shadaksharamidam stotram yah paṭhecChiva sannidhau |

tasya mṛtyubhayam nasti hyapamṛtyubhayam kutah ‖


sivasiveti siveti siveti va

bhavabhaveti bhaveti bhaveti va |

harahareti hareti hareti va

bhujamanassivameva nirantaram ‖


iti srimatparamahamsa parivrajakacharya

srimacChankarabhagavatpadapujyakṛta sivashadaksharistotram sampurṇam |