Skip to main content

Arasavalli Surya Narayana Swamy Temple - అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయం

ఓం ఆదిత్యాయ నమః..అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2.5 కి.మీ.దూరంలో ఉన్న అరసవల్లి-శ్రీ ఉషాపద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవస్థానం దేశంలోని అతి ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటి

రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి ఆలయ విశేషాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి, మహాశివుడికి సంబంధించి శ్రీ కాళహస్తి, శ్రీ శైలం, వినాయకుడికి సంబంధించి కాణిపాకం ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వీటితో పాటు సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్యభగవానుడి ఆలయంగా, దేశంలోని అరుదైన సూర్యభగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది.

క్షేత్రచరిత్ర/ స్థల పురాణం:
శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని ఆవిర్బవింప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు అని గాథ. దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట. ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు. రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు. ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట. ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం. ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మాత్రమునే సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.

ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్దం లో కళింగరాజులు నిర్మించినట్లు శాసనాల ఆధారం. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.

ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ఆలయ విశిష్టత:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.

ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.

వైభవంగా రధసప్తమి వేడుకలు:
అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి రధసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. వేద పండితులు స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ మంగళధ్వనులతో మహాక్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. అరసవల్లి సూర్యభగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు.

ఆదిత్యుని దర్శన సమయాలు: ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది. అనంతరం ఉదయం 5.30 గంటలకు నిత్యార్చన నిర్వహించి.. ఆ తర్వాత 6 గంటల నుంచి 12.30 గంటల వరకూ భక్తులందరికీ దర్శనానికి అనుమతిస్తారు.

మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య మహా నైవేద్యం.. దర్శనం ఉండదు. తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య స్వామివారికి పవళింపు సేవ. దర్శనానికి విరామం. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు.

ఇక్కడ భక్తులందరికీ స్వామివారి దర్శనం ఉచితం. కాస్త త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేవారికి మాత్రం ఒక్కొక్కరికి రూ. 25 చొప్పున రుసుం వసూలు చేసి.. త్వరితంగా దర్శన అవకాశం కల్పిస్తారు.

ప్రత్యేకపూజలు: అష్టోత్తర శత నామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ, కల్యాణ సేవ, సూర్య నమస్వాక సేవ, శాశ్వత అన్నదానం.

ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు. ఆయా సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు నిర్దేశిత రుసుంకు అదనంగా రూ. 5 పోస్టేజి కలిపి ఆ మొత్తాన్ని ఎం.ఓ. లేదా డీడీ రూపంలో పంపించాలి. ఆ మేరకు ఆయా సేవలు చేయించి దేవస్థానం తిరిగి ప్రసాదం పంపిస్తారు. ఎం.ఓ కూపన్‌లో సరైన చిరునామా, గోత్రం వివరాలు రాయాలి.

ఆదిత్యుడికి జరిపే వివిధ పూజలు.. విశేష సేవల వివరాలు
అష్టోత్తర శతనామార్చన: రూ.20
క్షీరాన్న భోగం: రూ.50
క్షీరాభిషేక సేవ: రూ. 216
తిరువీధి సేవ: రూ. 500
కల్యాణ సేవ: రూ. 500
సూర్యనమస్కారాలు: రూ.50
అన్నదానం(పదిమందికి): రూ.150

శ్రీకూర్మం:
శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. అరసవల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించి వెళుతుంటారు. ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

అరసవిల్లికు ఎలా వెళ్లాలి?

రోడ్డు మార్గం:
శ్రీకాకుళంకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు రవాణా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సదుపాయం లేని వారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని అక్కడికి నుంచి శ్రీకాకుళంకు బస్సులో చేరుకోవచ్చు. విశాఖ నుంచి శ్రీకాకుళంకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అనేక ఆటోలు, ప్రైవేటు వాహనాలు, బస్సులు వెళ్తుంటాయి.
వాయు మార్గం:

శ్రీకాకుళంకు సమీపంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖ నుంచి ఇక్కడికి 116 కిలోమీటర్లు. సందర్శకులు బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.

రైలు మార్గం:
శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళంకు బస్సులు, ఆటోలు ప్రతి రోజూ నడుస్తుంటాయి.


Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.