ప్రతి నెలలో, శుక్ల పక్షి యొక్క సష్తి రోజు సుబ్రమణ్య స్వామి లేదా స్కంద స్వామి కి అంకితం చేయబడింది. దీనినే స్కంద సష్తి అని కూడా పిలుస్తారు, మరియు లార్డ్ కార్తికేయ భక్తులు అతని ఆశీర్వాదం మరియు దయ సంపాదించడానికి ఈ రోజున ఉపవాసాలు మరియు పూజలను చేస్తారు. లార్డ్ స్కంద శివుడు మరియు పార్వతీదేవి ల కుమారుడు. ఆయన వినాయకుడి సోదరుడు. ఇద్దరిలో ఎవరు పెద్దవారు అనేదాని గురించి దక్షిణ మరియు ఉత్తర భారతదేశాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.
దక్షిణ ప్రాంతంలో, వినాయకుడు పెద్దవాడుగా పరిగణించబడుతుంది; ఉత్తర భారతదేశంలో, లార్డ్ స్కందా అన్నయ్య అని నమ్ముతారు. వారిలో ఎవరు పెద్దవారైనప్పటికీ, లార్డ్ కార్తికేయకు భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఎందుకంటే లార్డ్ స్కంద సులభంగా కరుణించే వాడని నమ్ముతారు మరియు తన భక్తులకు మంచి అదృష్టాన్ని మరియు సంపదని ఇస్తాడని నమ్ముతారు.
జూన్ 28, న స్కంద శశాంత్ పండుగగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, శ్రీ సుబ్రమణ్య అష్టాకం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది మరియు ఇది గత జన్మలలో మరియు ఈ జన్మలో చేసిన పాపాల బంధాల నుండి మిమల్ని విముక్తి చేస్తుంది.
అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – నిత్యము అన్నదానము చేయువాడా, అఖిల రోగములను హరించుటలో నిమగ్నుడవైనవాడా, తద్వారా భక్తులకోరికలను తీర్చువాడా, శ్రుతులు (వేదములు), ఆగమములయందు చెప్పబడిన ప్రణవానికి నిజమైన స్వరూపము కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – అసురుల రాజును ఖండించిన శక్తిశూలం, పాశము మొదలయిన శస్త్రములతో అలంకరింపబడిన చేతులుకలిగి, శ్రీకుండలములు ధరించిన నాయకుడా, శిఖీంద్ర (నెమలి) చే మోయబడు ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండువాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని, శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – వజ్రము మొదలగు రత్నములతో, మాణిక్యములతో చేయబడిన కిరీటము, హారములు, కేయూరములు, కుండలములు మరియు కవచముతో అందముగా అలంకరింపబడి, వీర తారకుడిని జయించి, దేవతా బృందముచే వందనము చేయబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతో, పంచామృతములతో, ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులు పట్టాభిషేకము చేసిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – శ్రీకార్తికేయా, కరుణామృతము పూర్తిగా కలిగిన దృష్టితో, కామాది రోగములతో కలుషితమైన నా దుష్ట చిత్తమును, నా కళావిహీనమైన కాంతిని నీ కాంతితో చల్లి, ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.
అర్థం – సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యవంతమైనది. దీనిని యే ద్విజులు పఠించెదరో వారు ముక్తిని సుబ్రహ్మణ్య ప్రసాదము వలన పొందగలరు. ఈ సుబ్రహ్మణ్యాష్టకమును ఎవరైతే ప్రొద్దున్నే లేవగానే పఠించెదరో, వారి కోటిజన్మలలో చేసిన పాపము తక్షణం నశించును.
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ |
(ఈ అర్థం శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
తోరం ఎలా తయారుచేసుకోవాలి :- తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, తొమ్మిదో పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
ఆచమనం : (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
వరలక్ష్మీ వ్రత కథ: (అక్షింతలు చేతిలో వేసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)
రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ అసరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.
మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించుచుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి "నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల 🌝పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక" అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను. చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ అందరు శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ 🌝పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగవాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.
(అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి).
గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ | నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ || అర్థం – గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [**పాదపద్మమ్**] వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ || అర్థం – మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క స్వరూపము కలిగి, వాగీశ (బ్రహ్మ), విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ | పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ || అర్థం – భూతములకు రాజుగా, సర్పములను శరీర ఆభరణములుగాచేసికొని, పులిచర్మముమును వస్త్రముగా కట్టుకుని, జటాజూటమును, మూడుకన్నులను కలిగి, పాశమును (త్రాడు), అంకుశమును (గాలము), భయములేనిది, వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
శీతాంశుశోభితకిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ | నాగాధిపారచితభాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ || అర్థం – చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకొని, నుదుటి కంటి మంటలో అయిదు బాణములను విలీనము చేసుకొని, సర్పములయొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకొని, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ | దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ || అర్థం – పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహమువంటి వాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయమ్ | నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ || అర్థం – దివ్యతేజస్సు కలిగి, గుణములు ఉండి గుణములు లేక, మరొకటిగా లేక, ఆనందమునకు మూలమై, ఎవ్వరిచేత ఓడింపబడక, ఎవ్వరి ప్రమేయము అవసరములేక, నాగాభరణములు కలిగి, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ | ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ || అర్థం – ఆశలను విడిచి, పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితియందు ఉంచి, మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ | మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ || అర్థం – రాగము వంటి దోషములు లేక, స్వజనులతో అనురాగముతో ఉండి, వైరాగ్యమనెడి శాంతికి నిలయమై, గిరిజతో కూడి, ధైర్యమనెడి మాధుర్యమును చూపుతూ, విషమువలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.
వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః | విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ || అర్థం – వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి, కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగును.
(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మచే స్ఫురింపబడి వ్రాయబడినది)
మహప్రాణ దీపం శివం' అంటూ కీర్తించినా... 'శివశివ శంకర భక్తవశంకర' అంటూ స్తుతించినా శివ భక్తుల హృదయాలు ఆనంద పారవశ్యంలో మునిగిపోతాయి. ఈశ్వర తత్వంలోని ఔన్నత్యం అలాంటిది. నమ్మి కొలవాలే కానీ దేవతలూ రాక్షసులూ అన్న భేదం లేకుండా అందరికీ వరాలిచ్చేసే శివయ్యకు తన భక్తులంటే మరింత ప్రేమ. దానికి నిదర్శనమే చిత్తూరులోని మొగిలీశ్వరాలయం.
తనను సేవించిన భక్తుడి పేరుమీదుగానే ఈ క్షేత్రంలోని శివయ్య పూజలందుకోవడం శేషం.మహాశివుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు, గంగాధరుడు, పార్వతీవల్లభుడు, త్రినేత్రుడు... ఇలా ఆ సర్వేశ్వరుడికి పేర్లు అనేకం. మహిమలు అనంతం. మంజునాథుడు అనేక ప్రాంతాల్లో, విభిన్న నామాలతో పూజలందుకుంటున్నాడు. వాటిలో చిత్తూరులోని మొగిలీశ్వర ఆలయం ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తారు.
ఇదీ కథ: పూర్వం ఈ ప్రాంతంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండేవట. వీటి సమీపంలో ఉన్న మొగిలివారిపల్లెలో బోయ దంపతులు నివసించేవారు. అతడి భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు రావడంతో అడవిలోనే మగ శిశువును ప్రసవించింది. మొగలిపొదల దగ్గర పుట్టాడు కాబట్టి ఆ బిడ్డను మొగిలప్ప అని పిలవడం ప్రారంభించారు. మొగిలప్ప పెద్దవాడయ్యాక ఓ రైతు దగ్గర పశువులకాపరిగా చేరాడు. పశువులను అడవికి తోలుకెళ్లి మేపుతూ మధ్యలో వంట చెరకు నరికేవాడు. అలా ఒక రోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతుంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురైన మొగిలప్ప గ్రామస్థుల సాయంతో అక్కడ వెతకగా శివలింగం కనిపించింది. అప్పటి నుంచీ ఆ శివలింగానికి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు మొగిలప్ప. దీంతో అతడి పేరు మీదుగా ఈ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.
త్రిశూల తీర్థం: భక్తులు మొగిలి క్షేత్రంలోని త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఓసారి కరవు వచ్చి నదులూ, సరస్సులూ ఎండిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా... శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమిమీద గుచ్చి, పాతాళ గంగను పైకి రప్పించాడట. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థంగా వ్యవహరిస్తారు.
ప్రత్యేకతలు: మొగిలీశ్వరాలయానికి పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో విభూతి కొండ ఉంది. ఈ క్షేత్రంలో స్వయంభూ లింగంతోపాటు సహజంగా ఏర్పడిన విభూతి కొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ కొండకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని సూచన మేరకు లోక కల్యాణం కోసం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెబుతారు.
ఆలయంలోని మరో ప్రత్యేకత పైకప్పుమీద దర్శనమిచ్చే బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీకాళహస్తిలలో మాత్రమే కనిపిస్తుంది. బంగారు బల్లితోపాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతోపాటు అన్ని దోషాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం.
సందర్శించే సమయం 6.00 a.m. to 10.30 p.m. and 5.30 p.m. to 8.00 p.m.
ఇలా చేరుకోవచ్చు:
చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. తిరుపతి నుంచి కుప్పం, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కాణిపాకానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
ఓం ఆదిత్యాయ నమః..అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం!
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 2.5 కి.మీ.దూరంలో ఉన్న అరసవల్లి-శ్రీ ఉషాపద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవస్థానం దేశంలోని అతి ప్రసిద్ధ సూర్యదేవాలయాల్లో ఒకటి!
రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి ఆలయ విశేషాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి, మహాశివుడికి సంబంధించి శ్రీ కాళహస్తి, శ్రీ శైలం, వినాయకుడికి సంబంధించి కాణిపాకం ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వీటితో పాటు సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్యభగవానుడి ఆలయంగా, దేశంలోని అరుదైన సూర్యభగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది.
క్షేత్రచరిత్ర/ స్థల పురాణం: శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగమ లో జీవులనుద్దరించేందుకు తన నాగేటి చాలు తో నాగావళి నదిని ఆవిర్బవింప చేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్టించారు అని గాథ. దీనిని తిలకించడానికి దేవతలు స్వర్గమా నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అట. ఇంద్రుడు ఒక్కడు వేళా కు రాలేకపోయాడు. రాత్రి సమయాన చేరుకొని కోటిశ్వర దర్శనార్థం రాగ నందీశ్వరుడు ఆటకయించాడు. ఇంద్రుడు కోపావేశం తో వజ్రాయుధం ఎత్తగా నందీశ్వరుడు తన కొమ్ములతో దానిని విసిరిపరేసదట. ఆ దెబ్బకు ఇంద్రుడు స్పృహ తప్పి అరసవెల్లి ప్రాంతం లో పడిపోగా స్వప్నం లో ఇంద్రుడికి సూర్య భగవానుని విగ్రహం ప్రతిష్టించి ఆరాధించమని సందేశం రాగ ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతుడై తిరిగి తనలోకనికి చేరుకున్నాడని స్థల పురాణం. ఈ క్షేత్ర స్వామి గ్రహదిపతి కావడం వాళ్ళ దర్శన మాత్రమునే సర్వగ్రహహరిస్తా శాంతి లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి.
ఈ దేవాలయాన్ని 7 వ శతాబ్దం లో కళింగరాజులు నిర్మించినట్లు శాసనాల ఆధారం. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం రథసప్తమినాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.
ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ఆలయ విశిష్టత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.
ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.
వైభవంగా రధసప్తమి వేడుకలు: అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి రధసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. వేద పండితులు స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ మంగళధ్వనులతో మహాక్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. అరసవల్లి సూర్యభగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు.
ఆదిత్యుని దర్శన సమయాలు: ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది. అనంతరం ఉదయం 5.30 గంటలకు నిత్యార్చన నిర్వహించి.. ఆ తర్వాత 6 గంటల నుంచి 12.30 గంటల వరకూ భక్తులందరికీ దర్శనానికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య మహా నైవేద్యం.. దర్శనం ఉండదు. తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 2 గంటల నుంచి 3.30 గంటల మధ్య స్వామివారికి పవళింపు సేవ. దర్శనానికి విరామం. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు.
ఇక్కడ భక్తులందరికీ స్వామివారి దర్శనం ఉచితం. కాస్త త్వరగా దర్శనం చేసుకోవాలనుకునేవారికి మాత్రం ఒక్కొక్కరికి రూ. 25 చొప్పున రుసుం వసూలు చేసి.. త్వరితంగా దర్శన అవకాశం కల్పిస్తారు.
ప్రత్యేకపూజలు: అష్టోత్తర శత నామార్చన, క్షీరాన్న భోగం, క్షీరాభిషేక సేవ, తిరువీధి సేవ, కల్యాణ సేవ, సూర్య నమస్వాక సేవ, శాశ్వత అన్నదానం.
ఏటా సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణసేవ, ప్రతి ఆదివారం తిరువీధిసేవ నిర్వహిస్తారు. ఆయా సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు నిర్దేశిత రుసుంకు అదనంగా రూ. 5 పోస్టేజి కలిపి ఆ మొత్తాన్ని ఎం.ఓ. లేదా డీడీ రూపంలో పంపించాలి. ఆ మేరకు ఆయా సేవలు చేయించి దేవస్థానం తిరిగి ప్రసాదం పంపిస్తారు. ఎం.ఓ కూపన్లో సరైన చిరునామా, గోత్రం వివరాలు రాయాలి.
ఆదిత్యుడికి జరిపే వివిధ పూజలు.. విశేష సేవల వివరాలు అష్టోత్తర శతనామార్చన: రూ.20 క్షీరాన్న భోగం: రూ.50 క్షీరాభిషేక సేవ: రూ. 216 తిరువీధి సేవ: రూ. 500 కల్యాణ సేవ: రూ. 500 సూర్యనమస్కారాలు: రూ.50 అన్నదానం(పదిమందికి): రూ.150
శ్రీకూర్మం: శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. అరసవల్లి ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించి వెళుతుంటారు. ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అరసవిల్లికు ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గం: శ్రీకాకుళంకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు రవాణా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సదుపాయం లేని వారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని అక్కడికి నుంచి శ్రీకాకుళంకు బస్సులో చేరుకోవచ్చు. విశాఖ నుంచి శ్రీకాకుళంకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అనేక ఆటోలు, ప్రైవేటు వాహనాలు, బస్సులు వెళ్తుంటాయి. వాయు మార్గం:
శ్రీకాకుళంకు సమీపంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖ నుంచి ఇక్కడికి 116 కిలోమీటర్లు. సందర్శకులు బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.
రైలు మార్గం: శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళంకు బస్సులు, ఆటోలు ప్రతి రోజూ నడుస్తుంటాయి.
గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. బెంగళూరు నగర నిర్మాత కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే, పూజించే అగ్ని దేవుని విగ్రహం ఉన్నది. ఈ అగ్ని దేవుని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి. ఒకే రాతి తో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ, వాస్తు శైలి కలిగి ఉంది.బెంగళూరులో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది. కర్ణాటకలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలోని అనేక అపురూపమైన సంగతులు చాలా మందికి తెలియదు. ఇంతట ప్రసిద్ది చెందిన దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం..
గుహలోపల శివుడు గుహలోపల శివుడు వెలసి ఉంటాడు కనుక శివుని తలలో గంగను అలంకరించుకోవడం వల్ల ఈ ఆలయానికి గవి గంగాధరేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంది. ఇందులో నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది. గంగా ప్రవాహం ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి.
ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఆలయం 16వ శతాబ్ధంలో నిర్మితమైనది. భారత దేశంలోని రాతి కట్టడాల్లో గవి గంగాధరేశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పవచ్చు.
ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి. ఈ ఆలయాన్ని ఏక శిలా రాతితో కట్టడం జరిగింది. ఈ ఆలయం ఒకే నల్లరాతితో చెక్కిన అత్యధ్బుత శిల్ప కళాఖండం.
పూర్వకాలంలో పూర్వకాలంలో బరద్వాజ్ ముని గౌతమ మహర్షి ఇద్దరూ ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది. వారు ఇద్దరూ వేకువ జామునే వారణాసిలో పూజ ముగించుకుని మధ్యహన సమయంన గవిపురంలో పూజ చేసుకుని, సాయంత్రానికల్లా శివగంగలో మూడు సార్లు పూజను చేసేవారు.
ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆశీనురాలై పూజలందుకుంటోంది.
సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు: ప్రతి మకర సంక్రాంతి రోజున బెంగళూరులో గవి గంగాధరేశ్వర స్వామి సన్నిధానంలో సూర్య రశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర ద్రుశ్యాన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు. స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం 5గంటల నుండి 5.20నిముషాల మద్యలో సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు. ఈ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 :30 వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు.
ఈ శివాలయంలో శివున్ని దర్శించాలంటే ముందుగా నందీశ్వరున్ని దర్శించి తర్వాత ఆయన కొమ్ముల మద్య నుండి శివున్ని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నందీశ్వరుడు హిందూ దర్మానికి ప్రతీకగా ఉన్నాడు. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనంగా చెబుతారు.
లింగరూపంలో ఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే, ముందుగా నందీశ్వరున్ని పువ్వులతో పూజించి తర్వాత ఎడమ చేతి వేళ్ళను ఆయన కొమ్ములపై ఉంచి గోపురంపై తల వుంచి నందీశ్వర కొమ్ముల మద్య నుండి శివ దర్శనం ఏకాగ్రతతో చేసుకోవాలి. ఇలా దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు నిజం అవుతాయి.
గవి గంగాధరేశ్వర ఆలయంలో రెండు స్వరంగాలున్నాయి. ఒకటి కాశీ నుండి రావడానికి మరొకటి శివగంగకు వెళ్ళడానికి. పూర్వం భరద్వాజముని, గౌతమ మహర్షి కాశీ నుండి స్వరంగ మార్గం గుండా గవి పురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకుని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు స్వరంగం గుండా వెళ్లేవారని మన పురాణాలు చెబుతున్నాయి.
భారతదేశంలో భారతదేశంలో ప్రాచీన గ్రుహాంతర దేవాలయాలలో గవి గంగధేశ్వర దేవాలయం ఒకటి.
ఆలయ విశిష్టత:
ఈ ఆలయంలోని ఉద్భవ మూర్తి యందు ఒక విశిష్టత ఉన్నది. అదేంటంటే లింగ భాగం వేరుగా సోమ సూత్రం వేరుగా ఉంటుంది. లింగ భాగం అనగా పరమేశ్వరునికి ప్రతీక. అయితే సోమ సూత్రం పార్వతీ దేవి అని చెప్పవచ్చు.
ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు లింగరూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే, కైలాసంలోని పార్వతీపరమేశ్వరులను దర్శించినంత పుణ్యం కలుగుతుంది భక్తుల నమ్మకం. ఏకాంతంగా ఒకే దేవాలం ఉంటే దానిని దేవాలయం అనరు. ఈ ఆలయంలో గణపతి, సుబ్రమణ్యేశ్వర స్వామి, చండికేశ్వర, నందీశ్వర, పార్వతీదేవి, నవగ్ర ఉపాలయాలు వంటి పరివార దేవుళ్ళు ఉన్నారు.
గర్భ గుడి ప్రాకారం చుట్టూ ఇంద్రాణి, వారాహి, వైష్ణవి, చాముండి, కౌమారి, మహేశ్వరి, బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలున్నాయి.
కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలు, వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మాఘమాసంలో బ్రహ్మరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటితో పాటు విశిష్ట దుర్గాహోమాలు, చండికా హోమాలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ శాంతులూ మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నలభూ ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.
ప్రాతహ: కాలంలో కాశీలో పూజచేసి స్వరంగ మార్గాన గౌతమ ముని, భరద్వాజ మునులు మద్యహ్నాం గవి పురానికి వచ్చే వారు. మద్యహ్నాం పూజ ముగించుకుని, తిరిగి సాయంత్రం శివ గంగకి ఈ ఆలయం స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారు.
ఎలా వెళ్ళాలి?
గవి గంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వేస్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడి నుండి లోకల్ బియంటిసి బస్సుల్లో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు. విమాన మార్గంలో : ఎకిర్ పోర్ట్ కి సుమారు 35కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.