Skip to main content

Sri Venkateswara Slokam - శ్రీ వేంకటేశ్వర శ్లోకములు



వేంకటేశ హరే

వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే

తిరుపతి పుర వాసా గోవింద హరె వేఙ్కటగిరి నిలయ గోవింద హరె
సప్తగిరివర హరే గోవింద హరె ఆనందనిలయ హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే

కంజదళనేత్రా గోవింద హరె కస్తూరితిలక ధర గోవింద హరె
కందర్పజనక హరే గోవింద హరె కమనీయరూప హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే  

మాధవ కేశవ హే గోవింద హరె మంగళరూప హరే గోవింద హరె
ముక్తిప్రద శ్రీహరే గోవింద హరె మమకార హర హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే  

అచ్యావతార హరే గోవింద హరె ఆదిమ పురుష హరే గోవింద హరె
అలమేలుమంగాపతే గోవింద హరె అద్భుత రూప హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే

నారద వినుత హరే గోవింద హరె అన్నమయ్య నుత హే గోవింద హరె
త్యాగరాజస్తుతహే గోవింద హరె రామదాస నుత హే గోవింద హరె  
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే  గోవింద హరె

వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె
వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె

వేఙ్కటేశ హరే గోవింద హరె శ్రీనివాస హరే గోవింద హరె 

శ్రీ వేంకటేశ్వర సర్వస్వము

గోవింద వేఙ్కటేశ గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశ గోవింద శ్రీనివాసా

తిరుమల తిరుపతి శ్రీనారాయణ గోవింద వేఙ్కటేశ
కలియుగ వరదా కామిత ఫలదా గోవింద శ్రీనివాసా
వరాహ క్షేత్ర వాస శ్రీపతే గోవింద వేఙ్కటేశ
వల్మీక దహే వాసుదేవ శ్రీ గోవింద శ్రీనివాసా
వకుళమాలిక సుపుత్ర శ్రీ హరే  గోవింద వేఙ్కటేశ
పద్మావతీ మానసచోర  గోవింద శ్రీనివాసా
ఆకాశరాజ జామాత శ్రీ  గోవింద వేఙ్కటేశ
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

శ్రీ శేషశైల శిఖర నివాస గోవింద వేఙ్కటేశ
కమనీయ దివ్య గరుడాద్రి వాస గోవింద శ్రీనివాసా
శ్రీ వేఙ్కటాద్రి చిన్మయ రూప గోవింద వేఙ్కటేశ
నారాయణాద్రి శిఖర నివాసా  గోవింద శ్రీనివాసా
వృషభాద్రి వాస ఋషిజన వందిత  గోవింద వేఙ్కటేశ
వృషాద్రి వాసా వేఙ్కట రమణ గోవింద శ్రీనివాసా
అంజనాద్రీశ ఆర్షిత వత్సల  గోవింద వేఙ్కటేశ
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

వజ్ర ఖచిత మణిమయ మకుటధర  గోవింద వేఙ్కటేశ
విశేషకర్ణాభరణ భూషిత గోవింద శ్రీనివాసా
శంఖచక్ర ధర వర చతుర్భుజ  గోవింద వేఙ్కటేశ
సహస్ర లక్ష్మీ మాలా భూషణ గోవింద శ్రీనివాసా
సాలగ్రామ సుమాలా విలసిత గోవింద వేఙ్కటేశ
నాగాభరణ నాగేంద్ర శయన గోవింద శ్రీనివాసా
అఖిలాభయకర ఆనంద నిలయ గోవింద వేఙ్కటేశ
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

సుప్రభాత సేవా వైభవ  గోవింద వేఙ్కటేశ
సహస్రనామార్చన సంతోష గోవింద శ్రీనివాస
నిత్య కల్యాణ ఉత్సవ ప్రియ గోవింద వేఙ్కటేశ
సహస్రదీపాలంకార ప్రియ  గోవింద శ్రీనివాస
తోమాలసేవా తోషిక హృదయ గోవింద వేఙ్కటేశ
సహస్ర కలశాభిషేక ప్రియా  గోవింద శ్రీనివాస
ఏకాంత సేవా శ్రీకాంత లోల గోవింద వేఙ్కటేశ
సర్వదర్శన ప్రియ సర్వేశ  గోవింద శ్రీనివాస
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

శుక్రవాసర అభిషేక ప్రియా గోవింద వేఙ్కటేశ
నేత్రదర్శన నందిత లోకా  గోవింద శ్రీనివాసా
పవిత్రోత్సవ ప్రణయ పావన  గోవింద వేఙ్కటేశ
తెప్పొత్సవ ప్రియ వటపత్ర శయన  గోవింద శ్రీనివాసా
ఆనివరాస్థాన ఉత్సవ ప్రియ  గోవింద వేఙ్కటేశ
పద్మావతీ పరిణయ నిరతా గోవింద శ్రీనివాసా
పుష్పయాగ పరిపూర్ణ పరిమళా  గోవింద వేఙ్కటేశ
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

పూలంగి సేవా పూర్ణ మనోరథ గోవింద వేఙ్కటేశ
వసంతొత్సవానంత ప్రశాంత గోవింద శ్రీనివాసా
డోలోత్సవ లీలా విలాసిత గోవింద వేఙ్కటేశ
నిజపాద పద్మ దర్శన నిరతా గోవింద శ్రీనివాసా
జ్యేష్ఠాభిషేక దేదీప్యమాన గోవింద వేఙ్కటేశ
పారువేటాక్ష ఉత్సవ ప్రియా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

బ్రహ్మోత్సవ వైభవ విభవాహరే గోవింద వేఙ్కటేశ
శేషవాహనా విశేష విలసిత గోవింద శ్రీనివాసా
గరుడ వాహన గజేంద్ర రక్షక గోవింద వేఙ్కటేశ
సింహ వాహనా ప్రహ్లాద వరద గోవింద శ్రీనివాసా
మోహిహీ వేష మోహన రూప గోవింద వేఙ్కటేశ
సూర్యప్రభ వాహన సురంజిత గోవింద శ్రీనివాసా
చంద్రప్రభ వాహన విరాజిత గోవింద వేఙ్కటేశ
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

కల్పవృక్ష వాహన కామితార్థ గోవింద వేఙ్కటేశ
సువర్ణమణిమయ రథ సురంజితా గోవింద శ్రీనివాసా
హనుమద్‌వాహన ఆషితావన గోవింద వేఙ్కటేశ
సర్వభూపాల వాహన ప్రియ గోవింద శ్రీనివాసా
రథోత్సవ ప్రియ రంగనాథ శ్రీ గోవింద వేఙ్కటేశ
అశ్వవాహనా అనశ్వరేశ్వర గోవింద శ్రీనివాసా
చక్రస్నాన సమస్త పాప హర గోవింద వేఙ్కటేశ
సకల లోక కల్యాణ కారక గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా
గోవింద వేఙ్కటేశా గోవింద శ్రీనివాసా

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.