Translate

Sri Bramarambika Stotram - శ్రీ భ్రమరాంబిక అష్టకంరవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి
శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా ||

కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా
వెలయు శ్రీ గిరి శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయావా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీ గిరి భ్రమరాంబిక ||

అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్‌
పొంగుచును వరహాల కొంకణ భూములయందునన్
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్
శృంఖలా దేశముల వెలసిన శ్రీ గిరి భ్రమరాంబిక ||

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరి భ్రమరాంబిక ||

ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి
శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా ||

నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||

సోమశేఖర పల్లవారధి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ||

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా ||

ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా ||

తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక ||

శ్రీ భ్రమరాంబిక అష్టకం

చాంచల్యారుణలో చనాంచిత కృపాచంద్రార్క చూడామణీం
చారుస్మేరముఖాం చరాచర జగత్సంరక్షణీ తత్పరామ్
చంచచ్చంపక నాసికాగ్ర విలసన్ముక్తమణిరంజితాం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోధ్భాసి ఫాలస్థలీం
కర్పూర ద్రవమిశ్ర చూర్ణఖదిరాం మేధోల్ల సధ్వీషికామ్
లోలాపాంగ తరంగి తైరధీ కృపాసారైర్నతానందినీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం
రాజీవ ప్రభవాది దేవమకుటాం రాజత్పదాం భోరుహామ్
రాజీవాయత మంద మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాంతర సంస్థితాం వరసుధాం షద్యోగినీవేష్టితామ్
షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాషోడశీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

శ్రీనాధాత్కృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం
ఙ్ణానాసక్తమనోజ యౌవనల సద్గంధర్వ కన్యావృతామ్
దీనానామతివేగ భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

లావణ్యాధిక భూషితాంగ లతికాం, లాక్షారసద్రాగిణీం
సేవాయాత సమస్త దేవవనితాం సీమంతభూషాన్వితామ్
భావోల్లాస వశీకృత ప్రియతమాం భాండాసురచ్చేదినీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

ధన్య స్సోమవిభావనీయ చరితాం ధారాధర శ్యామలాం
మున్యారాధన మేదినీం సుమవతాం ముక్తి ప్రదానవ్రతామ్
కన్యా పూజనసుప్రసన్న హృదయాం కాంచీల సన్మధ్యమాం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

కర్పూర అగరు కుంకుమాంకిత కుచాం కర్పూరవర్ణాస్థితాం
కష్టోత్కృష్ట నికృష్ట కర్మ దహనాం కామేశ్వరీ కామినీమ్
కామాక్షిం కరుణారసార్ద్ర హృదయాం కల్పాంతరస్థాయినీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతామ్
గంగా గౌతమ గర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే
Previous
Next Post »
0 Komentar