Skip to main content

Kanipakam Vinayaka Temple - కాణిపాకం వినాయకుడి ఆలయం

మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం కాణిపాకం వినాయకుడి చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసేఉంటుంది, చాలా సార్లు వెళ్లి ఉంటారు కూడా.. మరి  ఈ ఆలయం యొక్క చరిత్ర,  వాటివిశేషాలు మీకు తెలుసా…?  చాలా వరకూ ఎవరికీ తెలియవు. ఈ దేవాలయం లో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా… అయితే రండి మరి విశేషాలేమిటో చూద్దాం..

తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం.

హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్టించలేదు. తానే స్వయంగా వెలశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు.

కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా వుంటుంది. కానీ కాణిపాకం గుడి వున్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ముల వ్యవసాయభూమి.

బావి కొద్దిరోజులకు వారు వ్యవసాయభూమిలో నీరెండిపోవటం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరోస్తాయని తవ్వటం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం వూరటం మొదలైంది. కొద్దికొద్దిగా బావి నిండుతుంది.

కొబ్బరికాయల నీరు ముగ్గురన్నదమ్ములూ ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్థులకు తెలిసి పూజించటం మొదలెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపరకం అంత విస్తీర్ణం పాకింది.

విగ్రహం దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళపేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజురోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావిలోనే వుంది.

బావి నీరు మరో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమపవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయముంది. అదే కాణిపాక వినాయకునికి సత్యానికి మారుపేరు.

చుట్టుపక్కల గ్రామాలు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కి.మీ ల దూరంలో వుంది.

తిరుమల తిరుపతి ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ వుండండి. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

దర్శనీయ దేవాలయాలు కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి.

కుళొత్తుంగ మహారాజు ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కూడా వుంది.

అద్దాల మేడ వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా వుంది. ఈ ఊరు మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయములతో నిండి వుంది.

ఇతర విశేషాలు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది.

వరసిద్ది వినాయక ఆలయం ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి.

ఆలయ ప్రాంగణం వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

కాణిపాకం వినాయకుడుకి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోనిచిత్తూరు జిల్లాలో ఇరాలా మండలంలో బాహుడా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది.  కాణి అంటే తడి భూమి పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అని అర్థం.

మొట్టమొదట ఈ ఆలయాన్ని స్థాపించింది ఎవరు? అసలు ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు కథ ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే ముగ్గురు సోదరులు ఉండేవారు.  వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకుండా కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు.

దగ్గరలో ఉన్న ఒక బావిలో, వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరు నిత్యం వాడుకునే వారు. కానీ ఆ బావి క్రమంగా ఎండిపోవడంతో, వారిలో ఒకరు దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలు పెట్టిన కొంత సేపట్లోనే వారికి బావిలో ఏదో వున్నట్లనిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండి పోయింది.

ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులోనుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలిసిన వినాయకుడు ఆ ముగ్గురి అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సుడిగాలి జలాల నుండి  ఉద్భవించడం వల్ల దేవుడిని బయటకు తీయడం కష్టసాధ్యం అయ్యింది. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని స్వయంభు వినాయక స్వామి అని అంటారు. క్రమంగా దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలవడం మొదలు పెట్టారు.ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది.. కాణిపాకం వినాయక స్వామి ఆలయ చరిత్ర..

ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరు కనుగొన లేకపోయారు.ఆలయ అర్చకులు ఎల్లవేళలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఇక వినాయక చవితి ఉత్సవాలని తిలకించడానికి మన రెండుకళ్ళూ సరిపోవు సుమా…ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం గమనించవచ్చు.

ఇంతటితో ఈ దేవుడి కథ సమాప్తం అని అనుకుంటున్నారా… కాదు ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి…అందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి.. మరి తెలియని విశేషాలు ఏమిటో తెలుసుకోండి…

ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికీ కూడా వినాయకడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అందులో ఒకటేమిటంటే… 50 సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారు.  క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వల్ల ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పట్టడం లేదు. ఇదే సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే. ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందని అని ఒక నమ్మకం. అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి  గుడిలోకి  ప్రవేశించడానికి ముందే తన తప్పులు అంగీకరిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకని  వైభవం విస్తృతంగా వ్యాప్తి చెంది దర్శనీయ ప్రదేశమైంది.

వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది. వాయువ్వ దిశలో “బ్రహ్మహత్యా పాతక నివృత్తి” కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ప్రసిద్ధిచెందింది. అక్కడ షణ్ముఖ,దుర్గ దేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణి తో కూడిన సర్పము దర్శనమిస్తుంది. దేవతల సర్పంగా కొలవబడే ఈ పాము ఎవ్వరికీ ఎటువంటి హానీ చెయ్యదు అని అక్కడి భక్తులు చెప్పుతూ ఉంటారు. ఇక తూర్పు-ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ మహా విష్ణువు, జనమేజయుడి కలలో కనిపించడంతో ఈ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు. ఈ ఆలయంలో నవగ్రహాలు మండపం, అద్దాలమేడ కూడా ఉంటుంది. ప్రసిద్ధి కరమైన ఆంజనేయస్వామి గుడి కూడా కాణిపాకo లో దర్శనమిస్తుంది. దాదాపుగా, కాణిపాకం చుట్టూ అది సుమా ఊరులో మూడవ వంతు వరకు వివిధ ఆలయాలలో నిండి ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?

కాణిపారకం వినాయకుడిని చేరుకుననే భక్తులు వివిధ మార్గాలు ఎంచుకుంటారు!

రోడ్డు:

తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి  15 నిమిషాలు పడుతుంది. చిత్తూరు నుంచి వచ్చే భక్తుల కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.

రైలు ద్వారా:

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచైనా చిత్తూరుకు లేదా, రేణిగుంట లేదా, గూడూరు లకు రైళ్ళు కలవు. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు.

విమానం ద్వారా:

రేణిగుంట విమానాశ్రయం ద్వారా కూడా కాణిపారకం వినాయకుడి  ఆలయం చేరుకోవచ్చు

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.