Skip to main content

Puranas and Shastras - ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు

ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు అంటారు, It is said that scriptures related to Vedas, Puranas and Shastras should not be read at any time

పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధి కాలాలలో, శ్రాద్ధ భోజనాలు ఈ సమయాలలో చదువుకూడదు. ఈవేళల్లో చదువుకి ఒక రోజు సెలవు పాటించాలి. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప ఉల్కాపాత సమయాల్లో చదవటం ఆపేయాలి. శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆక్షణం నుండి మూడు రోజులు వరకు చదువకూడదు.

ఉత్సవాలకు, శక్ర ధ్వజం దిగినప్పుడు, ఏడుపులు పెడబొబ్బలు దగ్గరలో వినబడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు తాత్కాలికంగా చదువకూడదు. అపవిత్ర స్థలంలో, అపవిత్రంగా ఉన్నప్పుడు, మాటిమాటికి ఆకాశం మెరుస్తున్నప్పుడు, మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల, పలుమార్లు ఉరుములు వినబడినప్పుడు, జలమధ్యంలో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేదశాష్త్రాలను చదువకూడదు. పరుగెడుతూ కాని, మద్యం వాసన వస్తున్న వ్యక్తి ప్రక్కన ఉన్నప్పుడు గాని, గాడిద, ఒంటె, నౌక, గుర్రం, చెట్టు, పర్వతం, మొదలైన వాటిపై కూర్చున్నప్పుడు గాని, ప్రయాణిస్తున్నప్పుడు గాని, దొంగలు, రాజులు గ్రామానికి ఉపద్రవం తెచ్చినప్పుడు గాని వేదశాష్త్రాలను చదువకూడదు.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

శ్రీ భగవద్ గీత తెలుగులో - Bhagavad Gita In Telugu

శ్రీ భగవద్ గీత తెలుగులో దిగువన ఇవ్వబడిన భగవద్గీత సంబంద eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు .