Skip to main content

Laksha Vattula Nomu - లక్షవత్తుల నోము

పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది.

అంతేకాదు ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం ఇలా ఒకటేంటి మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు.

అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది.
అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు.

‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాంత అనే ఒక వేశ్య వుండేది. ఒకరోజు ఆమె విహారానికి వెళ్లగా ఒక బ్రాహ్మణుని శవం ముందు విదారకరగా రోదిస్తున్న అతని ఇల్లాలిని చూసి ‘‘అయ్యో పాపం! స్త్రీలకే ఎందుకు ఇంత దుర్భరం’’ అని అంటుంది. ఆ సమయంలో ఆమె పక్కనున్న దాసుడు ఈమె మాటలు విని‘‘సృష్ట్యా సృష్ట్యా పురాద్వి జా రేహిణం చైవ లోకానాం హితార్థం మంత్ర కోవిదా:’’ అని చెబుతాడు. అది విన్న ఆమె వెంటనే ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి, ‘‘కులస్త్రీలకు ఇంతటి కష్టం రావడానికి కారణం ఏంటి’’ అని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా యాచకుడు ఈ విధంగా చెబుతాడు.‘‘అమ్మాయీ! స్త్రీలు అనేకానేక జ్ఞానం, అజ్ఞానంతో చేసిన పాపాలవల్లే ఇలా కష్టాలు కలుగుతాయి. దేవ, పితృకార్యాల్లో ఒక్కోసారి హఠాత్తుగా రజస్వలవుతుంటారు. సంప్రదాయానికి భయపడో, పురుషులేమంటారోననే భయంతోనో, తామున్న ప్రాంతమంతా అషౌచమవడం వల్ల అక్కడి విలువైన ద్రవ్యాలన్నీ వృధా అవుతాయనే లోభత్వం వల్లనో, వారు తమ ఇబ్బందిని గోప్యంగానే వుంచుకుని కార్యక్రమాలు సాగిస్తారు. అవన్నీ చెడు ఫలితాలనే యిస్తాయి. ఈ పాపాలే పెరిగి వైధవ్యాన్ని అనుగ్రహిస్తాయి.

దీని నుండి విముక్తి కలిగే మార్గం లక్షవత్తి వ్రతం ఒక్కటే. ఈ వ్రతం నిర్వహించడం వల్ల సువాసినులకు, సంపూర్ణమైన మూసివాయినాలు ఇవ్వడం వల్ల అన్ని దోషాలు నశిస్తాయి’’ అని వివరిస్తాడు. దానికి ఆమె అతనితో ‘‘దీనికేమైన ఋజువుందా?’’ అని ప్రశ్నించగా ఆయన ‘‘నువ్వే ఋజువు. నువ్వే ఈ వ్రతం చేసి, ఆ ఫలితాన్ని ఆ విధవరాలికి ధారబోసి చూడు’’ అని అంటాడు. అప్పుడు ఆమె దేనిగురించి ఆలోచించకుండా, డబ్బును వెచ్చించి, యాచకుడినే బ్రహ్మగా వరించి వ్రతాన్ని ఆచరిస్తుంది. దాంతో వచ్చిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణ వితంతుడుకు ధారబోయగా, మరణించిన బ్రాహ్మణుడు తిరిగి పునర్జీవుడవుతాడు.

ఇలా ఈ విధంగా మొదలైన ఈ వ్రతం ప్రతిఒక్కరు ఆచరించి తమ దోషాలను తొలగించుకుంటూ విముక్తులవుతున్నారని శివుడు పార్వతికి వివరిస్తాడు.

విధానం

ఈ వ్రతాన్ని చాతుర్మాస్యంలో చేస్తారు. ఉదయాన్నే లేచి నిరంతర కార్యక్రమాలు ముగిశాక సంచగవ్వ ప్రాశనం చేయాలి. తరువాత వచనం, తర్పణ చేయాలి.

ఇలా చేసిన తరువాత గుహ్యసూక్త ప్రకారం 1000 నారాయణ గాయత్రి, పరమాన్నం, నెయ్యితో హోమం చేయాలి. నాలుగు మూలలున్నవేదిక చేసి గోమయంతో అలికి మధ్యలో పంచరంగులతో అష్టదళ పద్మాన్ని వేసి, చెఱకు గడలతో చాందినీ కట్టి, వాటిమధ్య దివ్య వస్త్రం పరచి, అయిదు కుంచాల బియ్యం పోసి మధ్యలో పంచపల్లవ శోభితమైన కలశం స్థాపించాలి. ఆ వస్త్రం మీద లక్ష్మీనారాయణ ప్రతిమను ఆవాహనం చెయ్యాలి. షోడ శోపచారాల లక్ష్మీనారయణుల్ని అర్చించాలి. లక్ష వత్తులతో ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. ఇలా చేసిన తరువాత రాత్రంతా జాగారం చేయాలి. 0 ఫలాల ఎత్తుగల కంచుగిన్నె నిండా ఆవు నెయ్యి పోసి, బంగారపు వత్తినీ వెండి వత్తినీ...ప్రత్తి వత్తినీ ఉంచి మహా దీపారాధన చెయ్యాలి.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.