Skip to main content

Annaprasana - అన్నప్రాశన జరుపుకునే విధానం

సాధారణంగా శిశువు పుట్టగానే వారికి ఆరు నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఆహారంగా ఇస్తారు.అయితే శిశువుకు ఆరు నెలలు రాగానే వారికి చేసే కార్యక్రమం అన్నప్రాసన కార్యక్రమం.

అన్నప్రాశన విధానం

అన్నప్రాశన అనేది పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే కార్యక్రమం

ఈ సంస్కారము వలన శిశువుకు ఆయుర్వృద్ధి తేజస్సు ఆరోగ్యం సమకూరుతాయని ప్రజల విశ్వాసం.

అన్నప్రాశన ఎక్కడ చేయాలి

అన్నప్రాశన కార్యక్రమం దేవుడి గుడిలో లేదా శిశువు యొక్క అమ్మమ్మ ఇంట్లో చేయాలి

అన్నప్రాశన ఎప్పుడు చేయాలి

అన్నప్రాశన ఆడపిల్లలకు శిశువు పుట్టిన ఐదు నెలల పదకొండు రోజుల తర్వాత నుండి ఆరవ నెల ప్రవేశించే లోపు చేయాలి. లేదా శిశువు పుట్టిన సంవత్సరం లోపు బేసి సంఖ్య గల నెలలో చేయాలి. మగపిల్లలకు అయితే శిశువు పుట్టిన ఆరవ నెలలో లేదా పుట్టిన సంవత్సరం లోపు సరి సంఖ్య గల నెలలో చేయాలి.

అన్నప్రాశన ఆడపిల్లలకు ఐదవ నెల మగపిల్లలకు ఆరవ నెల చేయడం శ్రేష్ఠం అని శాష్త్ర వచనం

అన్నప్రాశనకు శుభ సమయాలు

శుభ తిథులు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, చతుర్దశి
కృష్ణ పక్షంలో వచ్చే చివరి మూడు తిథులు (త్రయోదశి చతుర్దశి అమావాస్య) పనికిరావు

శుభ వారములు

సోమ, బుధ, గురు, శుక్ర

శుభ నక్షత్రములు

అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర,హస్త, చిత్త, స్వాతి, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి

శుభ లగ్నములు

వృషభ, మిథునం, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నాలు మంచివి.
దశమ స్థానంలో ఏగ్రహలు ఉండకూడదు. ముహూర్త సమయానికి బుధ, కుజ, శుక్ర గ్రహలు ఒక వరుసలో ఉండకూడదు.

లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ శిశువుకు కుష్టు రోగం వచ్చే అవకాశం ఉంటుంది
లగ్నంలో క్షీణ చంద్రుడు ఉంటే దరిద్రుడు అవుతాడు
కుజుడు ఉంటే పైత్య రోగి, శని ఉంటే వాత రోగి అవుతాడు. రాహు, కేతువులు ఉంటే మిక్కిలి దరిద్రుడు అవుతాడు.

శుభ గ్రహములు

లగ్నంలో పూర్ణ చంద్రుడు ఉంటే అన్నదాత అవుతాడు. బుధుడు ఉంటే విశేష జ్ఞానవంతుడు, గురుడు ఉంటే  భోగి, శుక్రుడు ఉంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు.

అన్నప్రాసన చేయు విధానం :-

శుక్లపక్షమి రోజులలో అన్నప్రాశన ఉదయం పూట మాత్రమే చేయుట ఉత్తమం.
శిశువునకు కొత్త బట్టలు తొడిగి (పరిస్థితులను బట్టి) మేనమామ, మేనత్త కాని తల్లిదండ్రులు కాని తూర్పు ముఖముగా చాప లేదా పీటలపై కూర్చోవాలి.

శిశువును తల్లి లేద మేనత్త ఒడిలోర్చోబెట్టుకోవాలి. బంగారము, వెండి, కంచు మొదలగు పాత్రలో ఏర్పాటు చేసుకున్ననెయ్యి, తేనె, పెరుగులను ముద్దగా తండ్రి లేక మేనమామ కుడిచేతిలో బంగారు ఉంగరాన్ని పట్టుకుని ఆ పాత్రలోని నెయ్యి, తేనె, పెరుగులను ఉంగరం సహయంతో శిశువునకు తినిపించాలి. వసతి, స్థోమతలను బట్టి బంగారు లేక వెండి స్పూన్‌లను కూడ ఉపయోగించుకోవచ్చును. ఆ తర్వతనే అన్నం తినిపించాలి.

ఇలా మూడుసార్లు తినిపించిన తరువాత నాలుగోసారి చేతితో అన్నాన్ని తినిపించవలెను. ఆ తరువాత తల్లి, మేనమామ మిగతా కుటుంబ పెద్దలు అదే పద్ధతిలో చేయాలి. అన్నప్రాశన సమయంలో దేవుని సన్నిధిలో బంగారునగలు, డబ్బు, పుస్తకము, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెట్టి శిశువును ఈ వస్తువులకు దగ్గరగా కూర్చోబెడతారు. అమర్చిన వస్తువులలో శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన చెందుట ఒక సాంప్రదాయంగా వస్తుంది.

ముఖ్యాంశం :-

అన్నప్రాశన మూహూర్త లగ్నంలో రవి ఉన్న యెడల కుష్ఠు రోగి గాను, క్షీణ చంద్రుడు ఉన్న దరిద్రుడి గాను, పూర్ణ చంద్రుడు ఉన్న అన్నదాత గాను, కుజుడున్న పైత్యా రోగి గాను, బుద్ధుడున్న విశేష జ్ఞాన వంతుడిగాను, గురువున్న భోగ మంతుడుగాను, శుక్రుడున్న దీర్ఘాయువు గలవాడు గాను, శని ఉన్న వాత రోగము కలవాడు గాను, రాహు కేతువులు ఉన్న దరిద్రుడు అగును అని కాలామృత గ్రంధంలో తెలియజేయబడినది. ముహూర్త సమయానికి లగ్నానికి ఏ పాపగ్రహ సంబంధం లేకుండా ముహూర్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొలిసారి అన్నం తింటున్న శిశువునకు జాతకచక్ర ఆధారంగా అనుభవజ్ఞులైన పండితుల దగ్గరకు వెళ్లి వారికి దక్షిణ తాంభూలాదులు ఇచ్చి శుభమూహూర్తంను అడిగి తెలుసుకుని పండితుడు నిర్ణయించిన శుభమూహూర్తాన అన్నప్రాసన చేయడం బిడ్డకు శ్రేయస్సు,యశస్సులు కలుగుతాయి.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.