Skip to main content

మూడు కన్నుల హనుమంతుడు Sri Trinetra Dasa Bhuja Veeranjaneya Swamy Temple

పది భుజాలు.. మూడు కళ్లు కలిగిన హనుమంతుడిని ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? నిజంగా ఆంజనేయుడి రూపాల్లోనే ఇది చాలా ఆశ్చర్యకరమైనది. ఈ రూపంలో హనుమంతుడిని చూడాలంటే తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా ఆనందమంగళం వెళ్లాల్సిందే. ఇక్కడి ఆంజనేయుడికి ‘త్రినేత్ర దశభుజ వీరాంజనేయు’’డని పేరు. ఇక, ఈ ఆలయ చరిత్ర, విశేషాలలోకి వెళ్తే..

హనుమాన్‍ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతేకాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు.

హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో లేదా రాముని పాదాల వద్ద వినయంగా కూర్చున్న ముద్రలోనో కనిపిస్తాడు. ఇక, ఆంజనేయ ఆలయాల్లో ఆయన అభయహస్త ముద్రలో దర్శనమిస్తాడు. కానీ, తమిళనాడులోని ఆనందమంగళంలో మాత్రం విచిత్ర రూపంలో కనిపిస్తాడు. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడిని మనం చూడవచ్చు. ఈ రూపంలోని హనుమంతుడిని దర్శించు కునేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు.

త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారం ఎత్తి రావణుడిని సంహరించిన అనంతరం నారదుడు ఆయనను కలుసుకున్నాడు. ‘స్వామీ! లంక నాశనంతో మీ యుద్ధం పూర్తి కాలేదు. రావణుని వారసులు ఇంకా చాలామంది ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై ఏదో ఒకనాడు యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాక ముందే మీరు వారిని సంహరించాలి’ అని నారదుడు రాముడిని వేడుకున్నాడు.

అప్పుడు రాముడు నారదుడికి ఇలా బదులిచ్చాడట-‘నారద మహర్షీ! రామావతారంలోని నా కర్తవ్యం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. నువ్వు చెప్పిన పనిని పూర్తి చేయడానికి మరెవరినైనా ఎంపిక చేయాల్సిందే’’.

రావణుడి వారసులను తుదముట్టించేందుకు ఎవరు సరైనవారా? అని నారదాదులు అంతా విచారించగా, చివరకు రాక్షస వధకు హనుమంతుడే సరి అని అంతా కలిసి నిర్ణయించారు. రావణ వారస మూకపైకి హనుమంతుడినే పంపాలని సంకల్పించారు.

ఈ యుద్ధంలో సహాయకారులుగా ఉండేందుకు విష్ణుమూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని హనుమంతుడికి అందచేశాడు. శివుడు ఏకంగా తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించాడు.

ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన ఆంజనేయుడు దశభుజుడయ్యాడు. కైలాసనాథుడి నుంచి మూడో కంటిని పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్ఠుడు, అంజనీపుత్రుడు అయిన ఆంజనేయుడు పై ఆకారంలో వీరవిహారం చేసి రాక్షస వధను పూర్తి చేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసి నందును ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు.

రాక్షస వధ అనంతరం విజయంతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ‘ఆనందమంగళమ్‍’ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతారు. దేశంలో మరెక్కడా ఆంజనేయుడి రూపం ఈ విధంగా ఉండదు. ఆనందమంగళమ్‍లోని ఆలయంలో మాత్రమే ఆంజనేయుడిని పది భుజాలు, మూడు నేత్రాలు గల రూపాన్ని దర్శించుకోగలం.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

శ్రీ భగవద్ గీత తెలుగులో - Bhagavad Gita In Telugu

శ్రీ భగవద్ గీత తెలుగులో దిగువన ఇవ్వబడిన భగవద్గీత సంబంద eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు .