Skip to main content

విజయవాడ కనకదుర్గ గుడి - Vijayawada Kanaka Durga Temple Information


దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువైవున్న కనకదుర్గమ్మ ఆలయం ఒకటి! అంతేకాదు... శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.


విజయవాడ కనకదుర్గ గుడి

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

కనకదుర్గ గుడి గురించి ఆసక్తికరమైన విషయాలు

మహిషాశుర మర్ధిని గా మాత ప్రసిద్ధి చెందారు. మహిషాసురుడనే రాక్షసుడిని వధించడం వలన మాతను మహిషాసుర మర్ధినీగా కొలుస్తారు. స్వయంభూగా మాత ప్రసిద్ధి చెందారు. అంటే, మాత తనంతట తానే త్రేతాయుగంలో ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం. ఈ స్థలం యొక్క ప్రాముఖ్యతను అనేక గాధలు వివరిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన కథ ఏంటంటే ఒకప్పుడు ఈ స్థలం బీడు భూమిగా ఉండేది. రాతి భూభాగం వలన ఇక్కడ నుంచి కృష్ణా నది పారేది కాదు. అప్పుడు, పరమశివుడు కృష్ణా నదిని ఇక్కడ నుంచి ప్రవహించేలా ఏర్పాట్లు చేశాడు. అందువలన, ఈ భూమి సారవంతంగా మారింది. అందువలన, ఈ స్థలం ఇప్పుడు అందంగా కళకళలాడుతోంది. ఈ నది సొరంగాల గూండా ప్రవహిస్తుంది.


మరొక కథ ప్రకారం పాండవులలో ఒకడైన అర్జునుడు ఈ స్థలంలోనే ఘోర తపస్సు చేసి ఆ 1తరువాత పరమశివుడి వద్ద నుంచి పశుపతి అస్త్రాన్ని పొందాడు. యుద్ధంలో విజయం సాధించేందుకై పరమశివుడ్ని దీవించమని వేడుకున్నాడు. అందువలన కూడా ఈ స్థలం విజయవాడగా ప్రసిద్ధి చెందింది. అయితే, మరొక ప్రఖ్యాత స్థల పురాణం ప్రకారం, మహిషాసురుడనే రాక్షసుడు ఈ స్థలంపై దాడికి దిగాడు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు మహిషాసురుడు రాక్షసత్వానికి భయపడిపోయారు. ఇంద్రకీలా అనబడే ఋషి కనకదుర్గ మాత యొక్క కరుణాకటాక్షాలకై ఘోరతపస్సుని చేశాడు. ఇంద్రకీలుడి తపస్సుకి మెచ్చిన మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని ఇంద్రకీలుడిని అడిగింది. తన తలపై కొలువుండి రాక్షసుల ఆటను కట్టించాలని ఇంద్రకీలుడు మాతను కోరాడు. మాత అతని కోరికను మన్నించి మహిషాసురుడిని వధించింది. తిరిగి విజయవాడలోని ఈ ప్రాంతం మొత్తం శాంతి సౌభాగ్యాలతో నిండిపోయింది. అప్పటి నుంచి ఈ మాతను భక్తులు భక్తిశ్రద్ధలతో కొలవడం ప్రారంభించారు. ఆ తరువాత, ఈ ఆలయాన్ని ఈ సంఘటనకు గుర్తుగా నిర్మించారు. ఈ ఆలయంలో నాలుగు అడుగుల ఎత్తున్న విగ్రహం ఉంది. అమ్మవారు ఎనిమిది చేతులలో ఎనిమిది రకాల ఆయుధాలను పట్టుకుని ఉంటారు. శూలంతో అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని వధిస్తున్నట్టు కనిపిస్తారు. ఈ రూపం అనేది ఎంతో శక్తివంతమైనది. ఇటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పరచుకుంటే నెగటివిటీ అంతా తొలగిపోతుంది. నగలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. సౌందర్యరాశి అమ్మవారు.

స్థల పురాణం :

పూర్వం ‘కీలుడు’ అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు అనుగ్రహించి.. ఓ వరం వరము కోరుకొమ్మని అడుగుతుంది. దాంతో ఆ యక్షుడు.. ‘అమ్మా నువ్వు ఎపుడూ నా హృదయ స్ధానంలో కొలువై వుండేలా వరం ప్రసాదించు’ అని కోరాడు. అదివిన్న అమ్మ చిరునవ్వుతో.. ‘సరే కీల.. నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానది తిరంలో పర్వతరూపుడవై ఉండు.. నేను కృతాయుగంలో అసుర సంహారం తరువాత నీ కోరిక చెల్లిస్తాను’ అని చెప్పి అంతర్ధానం అయ్యింది.

అమ్మవారు చెప్పిన మాటలకు సంతోషించిన కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషుణ్ణి వదించి.. కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో దుర్గమ్మ కీలాద్రిపై వెలిసింది. తదనంతరకాలంలో ప్రతిరోజు ఇంద్రాద్రిదేవతలంతా అమ్మవెలిసిన ప్రాంతానికి వచ్చి.. దేవిని పూజించడం ప్రారంభించారు. దాంతో ఇది ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణశోభితరాలై ఉండడం వల్ల అమ్మవారికి ‘కనకదుర్గ’ అనే నామం స్థిరపడింది.

మల్లికార్జునుడు కొలువైవున్న గాధ :

ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి శతాశ్వమేదయాగం చేశాడు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.

మరో పురాణగాధ ప్రకారం.. ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా.. అతనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్దం చేశాడు కాబట్టి.. మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.

పేరువెనుక చరిత్ర

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఉంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శువుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయుంది.

క్షేత్ర పురాణం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కెన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

నవరాత్రి ఉత్సవాలు:
ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

  • మొదటి రోజు బాల త్రిపురసుందరి దేవి 
  • రెండవ రోజు గాయత్రి దేవి
  • మూడవ రోజు అన్నపూర్ణా దేవి
  • నాలుగవ రోజు లలితా త్రిపురసుందరి దేవి
  • ఐదవ రోజు సరస్వతి దేవి
  • ఆరవ రోజు దుర్గాదేవి
  • ఎడవ రోజు మహాలక్ష్మిదేవి
  • ఎనిమిదవ రోజు మహిషాసురమర్దినిదేవి
  • తొమ్మిదవ రోజు రాజరాజేశ్వారిదేవి

ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు,విద్యార్దులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు,శ్రీరాముల వారు కొలువుతీరి వున్నారు. ఈ దేవాలయంను దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాలు నుండి వస్తారు.

దర్శన సమయం

ధర్మ దర్శనం : ఉదయం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులు దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖమండపం : ఉదయం 4:00 నుంచి సాయంత్రం 5:45 వరకు, తిరిగి 6:15 నుంచి 9:00 గంటల వరకు ఈ దర్శనానికి సమయం కేటాయించడం జరిగింది. ఈ దర్శన సమయంలో కేవలం ఒక్కరు మాత్రమే లోనికి వెళ్లాల్సి వుంటుంది. అయితే.. ఈ దర్శనానికి ఒక్కొక్కరు చొప్పున రూ.5 రుసుము చెల్లించాల్సి వుంటుంది.

ప్రత్యేక దర్శనం : ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5:00 గం. నుండి సాయంత్రం 5:45 గం.వరకు, తిరిగి సాయంత్రం 6:30 గం. నుండి రాత్రి 9.00 వరకు.. ఇలా ఈ దర్శనానికి రెండు సమయాలు కేటాయించడం జరిగింది. ఈ దర్శనానికి ఒక్కొక్కరు రూ.20 చొప్పున రుసుము చెల్లించాల్సి వుంటుంది.

అంతరాలయం దర్శనం : ఈ దర్శనం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5: 30 వరకు మరియు తిరిగి సాయంత్రం 6:15 నుండి రాత్రి 10:00 గంటల వరకు గుడిని సందర్శించవచ్చు. అంతరాలయం దర్శనానికి ఒక్కొక్కరు 300 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. మల్లేశ్వర స్వామి టెంపుల్ దర్శన వేళలు : 4:00 am - 6:30 pm & 6:15 pm - 10:00 pm (ఉచిత దర్శనం).

ఆలయంలో నిత్యం జరిగే సేవలు :
సుప్రభాత సేవ ఉదయం 2:30 నిముషాలకు
తోమాల సేవ ఉదయం 3:30 నిముషాలకు
అర్చన ఉదయం 4:30 నిముషాలకు

ఎలా చేరుకోవాలి?
కొండపైకి చేరుకోవటానికి దేవస్థానం బస్సులు ఉన్నాయి. సిటీ బస్సులు కూడా కొండపైకి వెళుతుంటాయి. విజయవాడలో వాయు, రైలు, బస్సు మార్గాలు చక్కాగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు, బస్సులు, విమానాలు వస్తుంటాయి. విజయవాడ బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళటానికి ఉచిత బస్సు సేవలు కలవు. కొండ మీదకు ప్రవేట్ ఆటోలు, టాక్సీలు కూడా వెళతాయి. కాలినడకన కూడా భక్తులు కొండపైకి చేరుకోవచ్చు.

బస్సు మార్గం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లేందుకు అనువుగా బస్సు మార్గాలున్నాయి. విజయవాడకు అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం కలదు.  ఇక హైదరాబాద్ నగరం నుంచైతే ఇంచుమించు ప్రతీ అరగంటకు ఓ బస్సు సర్వీసు ఉంది. ఇక పండుగ సందర్భంలో ప్రభుత్వాలు ప్రత్యేకంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకుగల దూరం కి"మీ లలో..

1. హైదరాబాద్ నుండి - 267
2. వైజాగ్ నుండి - 382
3. తిరుపతి నుండి - 409
4. వరంగల్ నుండి - 237
5. గుంటూరు నుండి - 32

రైలు మార్గం
సౌత్ సెంట్రల్ రైల్వేలోనే విజయవాడ రైల్వే జంక్షన్ అతి పెద్దది. కాబట్టి.. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. చైన్నై- హౌరా, చెన్నై- ఢిల్లీ వంటి పెద్దమార్గాల్లో ఈ విజయవాడ జంక్షన్ వుంటుంది. అంతేకాదు.. దేశంలో వున్న వివిధ ప్యాసింజర్స్, ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు విజయవాడతో కనెక్ట్ చేయబడి వున్నాయి. పైగా.. ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి కావడం వల్ల.. ఇక్కడికి చేరుకునేందుకు రైల్వే మార్గాలున్నాయి.

విమానమార్గం
విజయవాడకు 20 కి.మీ. దూరంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు వుంది. విమానమార్గం ద్వారా వచ్చేవారు ఈ ఎయిర్ పోర్టులో దిగి.. కేవలం 30 నిముషాల వ్యవధిలోనే దుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి 30 నిముషాలకోసారి విజయవాడకు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో వున్నాయి.

సరస్వతీ పూజ అలాగే తెప్పోత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దసరా సమయంలో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది.

Source: teluguwishesh, telugubhaktiblog, nativeplanet

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.