Vishnu Sahasranam MP3 Free Download M.S.Subbalakshmi

విష్ణు సహస్ర నామస్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి:

ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.

విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం “ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును” అని చెప్పబడింది.

విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.



విష్ణు సహస్రనామ స్తోత్ర కథ :

భీష్ముని దగ్గర నుంచి అనేక ధర్మములు తెల్సుకున్న ధర్మరాజు , భీష్మాచార్యుణ్ణి 6 ప్రశ్నలు అడుగుతాడు అవి :

కిమ్ ఏకమ్ దైవతం లోకే – లోకంలో ఒక్కడే అయిన దేవుడు (పరమాత్ముడు) ఎవరు?
కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ – జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ – ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ – ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః – మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ – ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?

హనుమాన్ దండకం

శివాష్టకం / Shivashtakam
లింగాష్టకం / Lingashtakam
కనకధారా స్తోత్రం / Kanakadhara
స్తోత్రాలు / Stotras

Keywords : Vishnu Sahasranam, MP3 Download, M.S.Subbalakshmi , Lord Vishnu Devotional Songs.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. Kalyani Duggirala says:

    I am already member here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *