TOP 10 FAMOUS TEMPLES SURROUNDING TIRUMALA GUIDE

తిరుమల చుట్టుప్రక్కల ప్రసిద్ధ క్షేత్రాలు

తిరుమల యాత్ర దూరప్రాంతం వారికి ఎప్పటికో కానీ వీలుకాదు, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఎన్ని సార్లు తిరుమల వచ్చిన చూడాల్సిన ప్రదేశాలను చూడకుండానే వచ్చేస్తుంటారు. తిరుమల కొండపైన ఏమిమి చూడాలి , కొండ క్రింద ఏమి చూడాలి ఏమి చూడాలి అనేవి తెలుసుకున్నాం కదా . ఇప్పుడు తిరుమల చుట్టుప్రక్కల ప్రసిద్ధ క్షేత్రాలు ఏమున్నాయో చూద్దాం .

1) కాణిపాకం శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం :

Kanipakam Sree Siddhi Vinayaka Swamy Temple :
ఈ ఆలయం చేరుకోవడానికి కొండ పై నుంచి మరల కొండ క్రింద నుంచి కూడా బస్సు లు ఉంటాయి. తిరుమల నుంచి తిరుపతి కి సుమారు 40 ని|| సమయం పడుతుంది. తిరుపతి నుంచి కాణిపాకం గంటన్నర సమయం పడుతుంది . తిరుపతి నుంచి కాణిపాకం సుమారు 68 కిమీ దూరం . రెగ్యులర్ గా బస్సు లు ఉంటాయి .

2) అర్ధగిరి ఆంజనేయ స్వామి :

Ardhagiri Anjaneyaswamy Temple :
కాణిపాకం , అర్ధగిరి తమిళనాడు సరిహద్దు ప్రదేశాలు , అర్ధగిరి పేరు అరకొండ , అరగొండ గా అక్కడ పిలుస్తారు. ఆంజనేయుడు ఒక్క చేత్తో కొండను తీస్కుని వెళ్లడం గుర్తుండే ఉంటుంది కదా మీకు ఆ కొండలో కొంతభాగం కాణిపాకం దగ్గర్లో పడిందట. ఎన్నో ఔషధ మూలికలు కలిగిన ప్రదేశమే అర్ధగిరి. ఇక్కడ కోనేటిలోని నీరు సేవిస్తే ఎన్నో రోగాలు పోతాయని చెబుతారు. తెలిసినవారు మాత్రమే ఈ క్షేత్రానికి వెళ్తుంటారు. కాణిపాకం నుంచి 15 కిమీ దూరం లో ఉంటుంది ఈ ఆలయం, ఆటో ల ద్వారా వెళ్ళవచ్చు.

3) శ్రీపురం గోల్డెన్ టెంపుల్ :

Sripuram Golden Temple Information


రాత్రి వేళలో అమ్మవారి గుడి చూస్తే అద్భుతంగా ఉంటుంది . ఆలయం మొత్తం బంగారు పూత పూయబడి ఉంటుంది . నిజంగా లక్ష్మి దేవి ఉండే ప్రదేశం ఇలానే ఉంటుందేమో అన్న భావన ప్రతిఒక్కరిలోను కలుగుతుంది . ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు . రాత్రి 8 గంటల లోపు మీరు అక్కడ ఉండేలా చూసుకోవాలి , 8 దాటితే గుడిలోకి ప్రవేశం ఉండదు . కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళవచ్చు , గోల్డెన్ టెంపుల్ తమిళనాడు లో ఉంది గోల్డెన్ టెంపుల్ శ్రీపురం లో ఉంది. వెల్లూర్ బస్సు స్టాండ్ లో దిగి అక్కడ నుంచి బస్సు లో 5 కిమీ దూరం లో ఉన్న శ్రీపురం చేరుకోవాలి. శ్రీపురం దగ్గర్లో కాట్పాడి రైల్వే జంక్షన్ ఉంది. కాట్పాడి నుంచి హైద్రాబాద్ , రామేశ్వరం , అరుణాచలం , బెంగళూరు , విజయవాడ , తిరుపతి , కాకినాడ వెళ్లే ట్రైన్ లు ఆగుతాయి. కాట్పానుంచి వెల్లూర్ 8 కిమీ దూరం లో ఉంటుంది. తిరుమల నుంచి వెల్లూరుకు బస్సు లు ఉన్నాయి . తిరుమల నుంచి వెల్లూరు కు 113 కిమీ దూరం .

4) కాంచీపురం :

Kanipuram Famous Temples :
కాంచీపురం లో ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి ఆలయం , బంగారు బల్లి ఉండే వరదరాజ పెరుమాళ్ టెంపుల్ , పంచభూత లింగ క్షేత్రాలలో పృద్వి లింగం ఉండే ఏకమ్రేశ్వర స్వామి ఆలయం , 108 దివ్య క్షేత్రాలలో ఒకటైన వైకుంఠ పెరుమాళ్ , వామన మూర్తి ఆలయం , వరదరాజ పెరుమాళ్ , బస్సు స్టాండ్ కి దగ్గర్లో చిత్రగుప్తుని ఆలయం . కైలాశ నాదర్ దేవాలయం ఎన్నో ఆలయాలు . కంచి మఠం చూడాల్సినవి. గోల్డెన్ టెంపుల్ వరకు వచ్చారు కదా ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళడానికి బస్సు లు ఉంటాయి . 2 గంటల సమయం పడుతుంది . మీరు తిరుమల నుంచి తిరుపతి నుంచి కూడా డైరెక్ట్ బస్సు లు ఉంటాయి . 4 గంటల సమయం పడుతుంది .

5) అరుణాచలం :

Arunachalam Temple :
అరుణాచలాన్ని తమిళం లో తిరువణ్ణామలై అని పిలుస్తారు . అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్ని లింగ క్షేత్రం . మీరు వెల్లూర్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి బస్సు లు ఉంటాయి .దేవాలయాన్ని , రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడటానికి ఒకరోజు సరిపోతుంది కానీ గిరిప్రదిక్షణ చేద్దామనుకుంటే ఒక్కరోజు సరిపోదు . అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవడానికి కనీసం 15 రోజులు ముందే ప్రయత్నించాలి . అరుణాచలం నుంచి కాంచీపురం వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు లు ఉంటాయి .

6) అప్పలాయిగుంట , శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి :

Appalayagunta Sreeprasanna Venkateswara Swamy :
తిరుపతి నుంచి 16 కిమీ దూరం లో ఈ క్షేత్రం ఉంది. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న అనంతరం తిరుమలకు బయలుదేరుతున్న సమయం లో సిద్దేశ్వరస్వామి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేయగా తపస్సుకు మెచ్చి అభయహస్తం తో దర్శనమిచ్చి ఈ ఆలయం లో కొలువు తీరినట్టు స్థలపురాణం .

7) నారాయణవనం ,శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి :

Narayanavanam Sri Kalyanavenkateswara swamy temple :
శ్రీ మహావిష్ణువు వేదవతికి ఇచ్చియాన్ మాటకోసం ఈ భూమండలంలోని నారాయనవనక్షేత్రం లో శ్రీనివాసుడిగా అవతరించి ఆకాశరాజు పుత్రికగా పద్మావతీరూపంలో ఉన్న వేదవతిని కళ్యాణం చేసుకోవడం చేత ఈ నారాయణవన క్షేత్రం పవిత్ర పుణ్యక్షేత్రం గా పేరు గాంచింది.


అరణీనదిపై అవనాక్షమ్మ ఆలయం అలరారుతోంది. ఈ ఆలయాన్ని సందర్శించిన ఆదిశంకరాచార్యులవారు అమ్మవారి విగ్రహం దగ్గర ప్రతిష్టించిన తామ్రచక్రశాసనాన్ని ఈనాటికీ చూడవచ్చు. తిరుపతి నుంచి 50 కిమీ దూరం లో నారాయణవనం ఉంది.

8) నాగలాపురం ,  శ్రీ వేదనారాయణస్వామి  :

Nagalapuram Sri Vedanarayanaswamy
ప్రతిసంవత్సరం మర్చి నెలలో గోపురాద్వారాలనుండి సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ఇక్కడి ప్రత్యేకత . విష్ణువు మత్స్యావతారం లో శ్రీదేవి భూదేవి సహితుడై ఈ క్షేత్రం లో నెలకొని ఉన్నాడు . తిరుపతి నుంచి చెన్నై రహదారిలో తిరుపతికి 65 కిమీ దూరం లో ఈ ఆలయం ఉంది.

9) శ్రీకాళహస్తి :

Srikalahasti Temple :
పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన వాయు లింగ క్షేత్రం శ్రీకాళహస్తి లో ఉంది, తిరుపతి నుంచి 40 కిమీ దూరం లో ఉంటుంది. రాహుకేతు పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి. భక్తకన్నప్ప గాథ ఈ క్షేత్రం లో జరిగినదే. శ్రీకాళహస్తి నుంచి తిరుమలకు , తిరుపతి కి బస్సు లు ప్రతి 15 నిషాలకు ఒక్కటి చొప్పున తిరుగుతాయి . శ్రీకాళహస్తి తిరుపతి కి కుడివైపున ఉంటే ఎడమవైపున కాణిపాకం ఉంటుంది . మధ్యలో తిరుపతి ఉంటుంది .

Srikalahasti temple

10) గుడిమల్లం, పరశురామేశ్వర క్షేత్రం :

Gudimallam Sree Parashurameswara Khsetram
పరశురామేశ్వరం క్షేత్రం చాల ప్రాచీనమైన క్షేత్రం , ఈ క్షేత్రం మారుమూల ఒక పల్లెటూరిలో గలదు రవాణా సౌకర్యాలు తక్కువ. ఈ క్షేత్రం చేరుకోవడానికి తిరుపతి నుంచి కన్నా రేణుగుంట వెళ్లి అక్కడ నుంచి బస్సు లో వెళ్ళవచ్చు రేణుగుంట నుంచి 15 కిమీ దూరం లో ఉంటుంది . బస్సు లో వెళ్ళటం కన్నా ఆటో లో లేదా వ్యాన్ లో వెళ్లడం ఉత్తమం. బస్సు ని నమ్ముకుని వెళ్తే తిరిగి సమయానికి తిరిగిరావడం కష్టం .

మహాభారతం డౌన్లోడ్ తిరుమల కొండపైన ఏమిమి చూడాలి తిరుపతి లో చూడాల్సిన క్షేతాలు సహస్రదీపాలంకర సేవ అంగప్రదిక్షణ సేవ టికెట్స్ తిరుమలలో రూమ్స్ కొరకు టీటీడీ పంచాంగం డౌన్లోడ్

ఈ క్షేత్రాల గురించి విడివిడిగా మరల చెప్పుకుందాం స్వస్తి .

Facebook Page : https://www.facebook.com/templesguide
You Tube: https://www.youtube.com/c/templesguide

Keywords : Tirumala Tour, Tirumala Surrounding Temples, Tirumala Famous Temples, Tirumala Tour, Online Tirumala Details.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *