Turupati Surrounding Temples Guide | Top Places in Tirupathi

తిరుపతి లో చూడాల్సినవి

తిరుమల కొండపైన చూడాల్సిన ప్రదేశాల గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తిరుపతి లో చూడాల్సిన వాటి గురించి చెప్పుకుందాం. ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి , మనం తిరుమల కొండపైన చూడాల్సిన సమయం లో వ్యాన్ లు కార్ లు ఎక్కి మనం శ్రీవారి పాదాలు ఎలా చూసి వచ్చామో అలానే తిరుపతి లోను తిరుపతి చుట్టుప్రక్కల ప్రదేశాలను చూపించడానికి వ్యాన్ లు కార్ లు ఉంటాయి.  ఉదయాన్నే తీస్కుని వెళ్లి మరల రాత్రికి తిరుమలలో ఉండేలా ప్లాన్ చేస్తారు . మీరు ఫ్యామిలీ తో వస్తే వారితో మాట్లాడుకుని వెళ్లడం బాగానే ఉంటుంది . సరే ముందుగా మీకు ఏమేమి చూడాలో నేను చెప్తాను తరువాత ట్రావెల్స్ వారు ఏమేమి చూపిస్తాం అన్నారు ఎంత అడుగుతున్నారో మీకు తెలుస్తుంది . 

తిరుపతి లో చూడాల్సినవి

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం , తిరుచానూరు :  

Sripadmavathi Amman Temple, Tiruchanuru

తిరుపతి నుంచి 3 కిమీ దూరం లో ఈ ఆలయం కలదు , దీన్నే అలమేలు మంగపట్నం అని కూడా అంటారు . ఈ ఆలయ ప్రాంగణం లోనే శ్రీ బలరామశ్రీకష్ణుల సన్నిధి మరియు శ్రీ సుందరరాజస్వామి ఆలయం ఉంది . తిరుచానూరు లో తప్పక దర్శించాల్సిన ఆలయం శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం . 

శ్రీకపిలేశ్వర స్వామి ఆలయం : 

Srikapileswara Swamy Temple

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 3 కిమీ దూరం లో ఉంటుంది, కపిల మహర్షి ప్రతిష్టించిన శివలింగం కనుక స్వామి వారు కపిలేశ్వరుడుగా , ఇక్కడ తీర్ధం కపిల తీర్ధం గా పిలవబడుతుంది. 

Kapaleswara Swamy Temple Tirupati

Kapaleswara Swamy Temple

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీనివాసమంగాపురం : 

 

Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasamangapuram

పద్మావతీ అమ్మవారిని అమ్మవారిని వివాహం ఆడిన తరువాత స్వామి వారు అగస్త్యుడు చెప్పిన ప్రకారం ఆరుమాసాలు శ్రీనివాస మంగాపురం లోనే ఉండి . ఆ తరువాత శ్రీనివాస మంగాపురం నుంచి కాలిదారి గుండా పద్మావతిని తీస్కుని కొండకు వెళ్లారని ఐతిహ్యం . తిరుపతి నుంచి 10 కిమీ దూరం లో ఉంటుంది శ్రీనివాస మంగాపురం , శ్రీవారు మెట్టు కు వెళ్లే బస్సు లు కపిల తీర్థం మీదుగా శ్రీనివాసమంగాపురం వెళ్లి అక్కడ నుంచి శ్రీవారు మెట్టుకు వెళ్తాయి . మీరు కపిల తీర్ధం దర్శించుకుని బయట నిలబడితే శ్రీవారి మెట్టుకు వెళ్లే బస్సు లు ఆగుతాయి . 

శ్రీ కోదండరామస్వామి ఆలయం : 

Sri Kodandaramaswamy temple , tirupati

జాంబవంతుడు రామవిగ్రహం ఈ ఆలయం లో ప్రతిష్టించాడని అయోధ్యకు తిరుగు ప్రయాణం అయిన శ్రీరాముడు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని స్థలపురాణం . రామచంద్ర గుంట అనే పుష్కరిణి ఈ ఆలయం లో కలదు. ఈ ఆలయం లో తిరుపతి లోనే కలదు . 

గోవిందురాజుల స్వామి ఆలయం : 

Govindarajula swamy temple, Tirupathi

తిరుపతి రైల్వేస్టేషన్ కు దగ్గర్లో కలదు, తిరుపతి కి పూర్వనామం గోవిందరాజపట్నం . శ్రీ రామానుజాచార్యులు గోవిందరాజులను ప్రతిష్టించి ఆలయం చుట్టూ తిరువీధులను ఏర్పరిచారు . ఆండాళమ్మ , పార్ధసారధి స్వామి ఉపాలయాలు ఉన్నాయి . 
Keywords : Tirumala Tour, Tirupati Surrounding Temples , Tirumala Guide, Tirumala Packages,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *