Tirumala Surrounding Places | తిరుమలలో చూడాల్సినవి 

తిరుమలలో చూడాల్సినవి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అయినతరువాత ఏమిమి చూడాలి ? అని చాలామంది అడుగుతుంటారు. తిరుమల అనగా కొండపైన అని తిరుపతి అంటే తిరుపతి అనగా కొండ క్రింద అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏమేమి చూడాలి అనేవి మూడుభాగాలుగా ముందు చూడాలి .

1) తిరుమలలో ( కొండపైన ) చూడాల్సినవి

2) తిరుపతి లో ( కొండక్రింద ) చూడాల్సినవి

3) తిరుపతి చుట్టుప్రక్కల చూడాల్సినవి

ముందుగా తిరుమలలో చూడాల్సినవి , ఇవి కూడా రెండు భాగాలు చేయాలి ఎందుకంటే తిరుమలలో చూడాల్సిన శ్రీవారి పాదాలు , శిలాతోరణం వరకు బస్సు లు వెళ్లవు మనం చూడాలంటే వ్యాన్ , జీప్, కార్  ల ద్వారా మాత్రమే చూడగలం. కొండపైన పాపవినాశనం , ఆకాశగంగకు వరకు వెళ్లే బస్సు లు ఉంటాయి .

1) బస్సు లో చూడగలిగే ప్రదేశాలు

> పాపవినాశనం

> ఆకాశ గంగ

> వేణుగోపాల స్వామి గుడి

> జపాలి తీర్ధం

బస్సు లో ఎక్కిన తరువాత అప్ &డౌన్ టికెట్ ఒకేసారి తీసుకోవడం వల్ల  వచ్చే టప్పుడు టికెట్ అవసరం ఉండదు .

బస్సు మొదటిగా చివరి పాయింట్ అయినటువంటి పాపవినాశనం లో  ఆగుతుంది. తిరుమలలో స్వామి వారి పుష్కరిణి లో తరువాత ఇక్కడ మాత్రమే స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ స్నానం చేసినతరువాత ఆకాశ గంగ కు బస్సు లో వెళ్తారు . ఆకాశ గంగ పాతాళ గంగాళ క్రిందకి ఉంటుంది. ఆ తరువాత వేణుగోపాల స్వామి గుడి ఆ తరువాత జపాలి తీర్ధం ఆంజనేయ స్వామి గుడి కి వెళ్ళలంటే బస్సు ఆగిన దగ్గర నుంచి సుమారు 4 కిమీ పైనే నడవాలి వయస్సు ఎక్కువగా ఉన్నవారు నడవడం కష్టం. ఆ తరువాత బస్సు వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర్లో ఆపుతారు .

కార్ లో వెళ్తే :

కార్ లేదా వ్యాన్ లో మనం వెళ్తే పై వాటితో పాటు శ్రీవారి పాదాలు , శిలాతోరణం కూడా చూసిరావచ్చు . ప్రస్తుతానికి ఒక్కొక్కరికి 120 వరకు ఛార్జ్ చేస్తున్నారు.

తిరుమల మ్యూజియం కూడా చూడాల్సిన వాటిలో ఒకటి , ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు .

మనం మరో సారి ఒక్కొక్క ప్రదేశం గురించి స్థలపురాణం విశేషాలు చెప్పుకుందాం . స్వస్తి .

Keywords : Tirumala Surrounding Temples , Tirumala Tour, TTD Panchangam , Online Room Booking, Tirumala Seva Tickets Bookings,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *