Tirumala Information in Telugu | Good News For New Couples

మాంగల్యధారణం అంటే.. “నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నారు. నీవు నిండు నూరేళ్ళు జీవించు” అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. యువతీ యువకులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి జగ్రదక్షకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు.

వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది తిరుమల, తిరుపతి దేవస్థానం. భక్తులు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు.. శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది. వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతారు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన ‘కల్యాణ సంస్కృతి’ పేరిట ఓ పుస్తకాన్ని, తితిదే ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు. ఇందుకోసం నూతన వధూవరులు ‘కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి- 517501’ పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్‌ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని తితిదే సూచించింది.
కొత్త దంపతులకు తితిదే వారు పంపే కుంకుమ, కంకణం, ఆశీర్వచన పత్రిక

Address:

The Executive Officer, TTD Administrative Buildings,
KT Road, Tirupati 517501
TTD call centre: 0877 2233333 or 2277777

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *