Tirumala ASTABANDHANA Updates | Hindu Temples Guide

అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

ఆగస్టు 12, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు.

బంగారు కూర్చ సిద్ధం :

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను టిటిడి సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీనిని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు.

శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతోపాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు,శ్రీ నాగరాజ,బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ గురురాజారావు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

మహాభారతం డౌన్లోడ్ తిరుమల కొండపైన ఏమిమి చూడాలి తిరుపతి లో చూడాల్సిన క్షేతాలు సహస్రదీపాలంకర సేవ అంగప్రదిక్షణ సేవ టికెట్స్ తిరుమలలో రూమ్స్ కొరకు టీటీడీ పంచాంగం డౌన్లోడ్

Facebook Page : https://www.facebook.com/templesguide
You Tube: https://www.youtube.com/c/templesguide

Keywords : Tirumala, Tirumala updates, Tirumala Astabhandana, Tirumala Astabhandana updates,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *