Tirumala Arjita Seva Ticket Cost Details | Suprabhatam Tomala Nijapadadarshanam

తిరుమల ఆర్జిత సేవ లు అనగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన ఈ ఐదు సేవలే కాకుండా విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా కలవు . ముందుగా చెప్పిన ఐదు సేవలకు ప్రస్తుతం లక్కీ డిప్ ద్వారా టికెట్స్ ఇస్తున్నారు . అన్ని సేవలకు ప్రతినెల మొదటి శుక్రవారం టికెట్ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

పైన చెప్పిన సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన ఈ సేవలకు మాత్రమే మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఐదు రోజులు సమయం ఇస్తారు . మిగిలిన సేవ లు అనగా విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్స్ విడుదల చేసిన వెంటనే బుక్ చేసుకోవాలి . ప్రధానంగా విశేష పూజ , కల్యాణోత్సవం టికెట్స్ వెంటనే బుక్ చేసుకోకపోతే దొరకవు . ఏ సేవలో ఎలా ఉంటుందో తరువాత చెప్పుకుందాం ముందుగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన సేవ టికెట్స్ ధరలు ఎంత ఉంటాయి , ఏ సమయం లో జరుగుతాయి , ఏ రోజు ఏ సేవ జరుగుతుందో చూద్దాం.

తోమాల సేవ :

తోమాల సేవ వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది . తోమాల సేవ టికెట్ ధర 220 , సేవ జరిగే సమయం ఉదయం 3.30 నుంచి 4.30 వరకు జరుగుతుంది . రిపోర్టింగ్ టైం ఉదయం 3 గంటలు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు .

Tomala Seva :
Ticket Cost : 220 , Seva Timings : 3.30 to 4.30 , Reporting Time : 3 am

అర్చన :

అర్చన వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది. అర్చన సేవ టికెట్ ధర 220 రూపాయలు. సేవ జరిగే సమయం ఉదయం 4.30 to 5.30 , రిపోర్టింగ్ టైం 4 గంటలకు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు .
ARCHANA :
TICKET COST : 220 , SEVA TIMINGS : 4.30 TO 5.30 , REPORTING TIME : 4 AM

అష్టదళ పాద పద్మారాధన :

అష్టదళ పాద పద్మారాధన వారం లో మంగళవారం నాడు మాత్రమే చేస్తారు. టికెట్ ధర 1250 , సేవ జరిగే సమయం ఉదయం 5.30 to 6.30 , రిపోర్టింగ్ టైం 5 గంటలకు , ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు .
ASTADALA PADAPADMARADHANAMU :
TICKET COST : 1250 , SEVA TIMINGS : 5.30 to 6.30 am , REPORTING TIME : 5 AM

సుప్రభాతం :

సుప్రభాత సేవ ప్రతిరోజూ జరుగుతుంది , సుప్రభాత సేవ టికెట్ ధర 120 రూపాయలు . సేవ సరిగే సమయం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు , రిపోర్టింగ్ టైం ఉదయం 2 . ఒక టికెట్ పై ఒక్కరిని మాత్రమే పంపిస్తారు .
SUPRABHATAM :
TICKET COST : 120 , SEVA TIMINGS : 3 AM TO 4 AM , REPORTING TIME : 2 AM

నిజపాద దర్శనం :

నిజపాద దర్శనం ప్రతి శుక్రవారం ఉంటుంది. నిజపాద దర్శనం టికెట్ ధర 200 రూపాయలు , సేవ జరిగే సమయం ఉదయం 5.30 TO 6.30 వరకు , రిపోర్టింగ్ టైం : 4.30 AM , ఒక టికెట్ పై ఒక్కరినే పంపిస్తారు .
NIJAPADA DARSHANAM :
TICKET COST : 200 , SEVA TIMINGS : 5.30 AM TO 6.30 AM , REPORTING TIME : 4.30 AM

గమనిక :
12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు.
టికెట్ బుక్ చేసుకున్నాక డేట్స్ మార్చడానికి వీలుండదు .
టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వరు .
ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకున్నాకూడా ఏదైనా కారణం చేత టీటీడీ వారు ఆ సేవ రద్దు చేయవచ్చు .
ఆధార్ కార్డు తప్పకుండా తీస్కుని వెళ్ళాలి .
మీరు ఏదైనా సేవ వెళ్తే 180 రోజుల వరకు మరల టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుండదు.

తిరుమల గురించి మరీంత సమాచారం :

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి : https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు : https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి : https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి : https://goo.gl/EddXiw
అంగప్రదిక్షణ వివరాలు : https://goo.gl/6dKzrm
తులాభారం ఎలా వెయ్యాలి : https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి : https://goo.gl/o2t5Eh
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? : https://goo.gl/TY79zP
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు : https://goo.gl/JDqNq5
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి : https://goo.gl/UCvVjV
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? : https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా : https://goo.gl/4a3tVd
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి : https://goo.gl/TmNqgQ
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా : https://goo.gl/Gc5HNr
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి : https://goo.gl/FiYDnf
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది : https://goo.gl/4QGMXD
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం : https://goo.gl/q1ARrX
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? : https://goo.gl/dL4oB7
కొత్త జంటకు శుభవార్త : https://goo.gl/BT2KXA
తిరుమల సమగ్ర సమాచారం : https://goo.gl/s3FkjC
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి : https://goo.gl/kxtS8y
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి : https://goo.gl/pEVK2R
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు : https://goo.gl/32t1kA
తిరుమల వెళ్లేవారికి నా సలహా : https://goo.gl/PkSPou
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు : https://goo.gl/ZKa956
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం : https://goo.gl/RcYHMN

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *