This week Pisces Horoscope | Meenam Rasi
ఈ రోజు మరియు ఈ వారం మీనం రాశి ఫలితం :
మీనం రాశి
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రోజు :
సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ప్రశాంత చిత్తంతో , ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇష్టదైవాన్ని స్మరించండి.
ఈ వారం :
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాటను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి . ఆత్మబలంతో ముందుకు సాగండి. విజయానికి చేరువలోనే ఉన్నారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బుద్దిబలం బాగుంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లలో మంచివాళ్లెవరో చెడ్డవాళ్లెవరో గుర్తించగలుగుతారు. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవబలం పెంచుకునే దిశగా ముందుకు సాగండి. శాంతి లభిస్తుంది. ఇష్టదైవ నామస్మరణ శక్తినిస్తుంది.
శంకరమంచి శివసాయి శ్రీనివాస్
Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide
Ask Your Questions / Share Your Knowledge