This Week Horoscope | ఈ వారం రాశి ఫలాలు

మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

పనుల్లో విఘ్నాలున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. మనసు చంచలంగా ఉంటుంది. దైవబలం కాపాడుతోంది. నూతన నిర్ణయాలకు సమయం కాదు. శత్రుభయం ఉంటుంది. సమయానుకూలంగా మాట్లాడాలి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆపదలు తొలగుతాయి. శివారాధన మంచిది. మిత్రుల సూచనలు మేలు చేసే విధంగా ఉంటాయి. అనవసర ఖర్చులను తగ్గించండి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

స్తోత్రాలు డౌన్లోడ్

వృషభం
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పూర్వ పుణ్యం వల్ల అదృష్టప్రాప్తి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ధనలాభం ఉంది. మనోబలంతో విజయం సిద్ధిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఒక సంఘటన శ్రమ కలిగిస్తుంది. విభేదాలకు అవకాశమివ్వకండి. చేయాల్సిన పనులు స్పష్టమవుతాయి. లక్ష్మీధ్యానం శుభాన్నిస్తుంది. వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. మౌనంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

మిథునం
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)

గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. శుభకాలం కొనసాగుతోంది. ఆర్థిక యోగం అనుకూలంగా ఉంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తే సరిపోతుంది. వస్తు సేకరణ ఉంది. వ్యాపార, గృహ లాభాలున్నాయి. ఇంట్లో ప్రశాంత జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంది. శాంతచిత్తంతో పనిచేయండి. ఆశిస్తున్న ఒక పని కార్యరూపాన్ని దాలుస్తుంది. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ అవసరం. అనవసర విషయాల్లో సమయాన్ని పాడుచేయకండి. కీలక విషయాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. గురు ధ్యానం శుభఫలితాన్నిస్తుంది.

కర్కాటకం
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

శుభయోగాలున్నాయి. చక్కని ప్రణాళికతో పనిచేయండి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. స్థిరత్వం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. సంపదలు సమకూరతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలను ఆరంభించే కాలమిది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. పైఅధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్నిస్తాయి. వారం మధ్యలో మంచి చేకూరుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఇష్టదైవారాధన శుభఫలితాన్నిస్తుంది.

సింహం
(మఖ, పుబ్బ,ఉత్తర 1వ పాదం)

గొప్ప శుభకాలం. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తి అవుతుంది. క్రమంగా పైకి వస్తారు. అవరోధాలు తొలగుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. ఎదురుచూస్తున్న ఒక విజయం వరిస్తుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. బుద్ధిబలం పనిచేస్తుంది. ఇష్ట దైవదర్శనం మంచిది.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. ఈశ్వరార‌ధ‌న శక్తినిస్తుంది.

కన్య
(ఉత్తర 2, 3, 4 పాదాలు;హస్త, చిత్త 1, 2 పాదాలు)

శ్రమ పెరుగుతుంది. ఏకాగ్రతతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులున్నాయి. అపనిందలున్నాయి. ప్రతి విషయాన్నీ మనసుకు తీసుకోవద్దు. కష్టాలను అధిగమించే అవకాశముంది. అవసరాలకు ధనం లభిస్తుంది. సాహసంతో చేసే పనులు లాభాన్ని
చేకూరుస్తాయి. శివారాధన ఉత్తమం.ప్రసన్న వదనంతో ముందుకు సాగితే ఆటంకాలు తొలుగుతాయి. ప్రయాణాల్లో నిదానం అవసరం. గురు ధ్యానం శుభప్రదం.

తుల
(చిత్త 3, 4 పాదాలు,స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)

సత్పురుషుల సాంగత్యం వల్ల మంచి విజయం సాధిస్తారు. శుభయోగాలున్నాయి. అదృష్టవంతులవుతారు. మంచి పనులు చేసి పెద్దల నుంచి అభినందనలు పొందుతారు. గత వైభవప్రాప్తి ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దృఢమైన సంకల్పసిద్ధి ఉంది. మిత్రులకు మేలు జరుగుతుంది. పదిమందికీ సహాయపడతారు. సూర్యారాధన మంచిచేస్తుంది.

నూతనోత్సాహంతో పనులు ప్రారంభించండి. శుభాలను పొందుతారు. ఐశ్వర్యప్రాప్తి ఉంది. అనుకూల కాలం మొదలైంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. కొందరివల్ల మేలు జరుగుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ముఖ్య వ్యక్తుల సూచనలు పాటిస్తే ఆపదలు దరిచేరవు. గౌరవ పురస్కారాలున్నాయి. ఆదిత్య హృదయం చదవండి.తోటివారికి మార్గదర్శకంగా నిలుస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభ ఫలితాన్నిస్తుంది.

వృశ్చికం
(విశాఖ 4వ పాదం;అనూరాధ, జ్యేష్ఠ)

కార్యసిద్ధి ఉంది. నిశ్చలమైన మనసుతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. కష్టాల నుంచి బయటపడతారు. కొందరు మోసం చేయాలని చూస్తారు. కలహాలకు అవకాశముంది. బంధువులతో జాగ్రత్త. ముఖ్యుల సూచనలు అవసరం. ఆర్థికంగా కలిసి వస్తుంది. దైవబలం రక్షిస్తోంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం. కుటుంబ స‌భ్యుల‌తో కలిసి పనిచేయండి. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. తోటివారితో ఆనందకర క్షణాలను గడుపుతారు. గోవిందనామాలు చదవడం మంచిది.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

విజయాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సహనం పరీక్షిస్తుంది. అపార్థాలకు తావివ్వవద్దు. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సమర్థంగా పనిచేస్తే ప్రశంసలూ ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి. బాగా గమనిస్తూ అవసరాల‌కు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో మంచి ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యను అశ్రద్ధ చేయకండి. లక్ష్మి ఆరాధన శుభాన్నిస్తుంది.

మకరం :

(ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)

ఆత్మీయుల వల్ల విజయం లభిస్తుంది. ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారబలం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మిత్రులతో కలిసి ఒక మంచి పనిచేస్తారు. విఘ్నాలున్నా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. మీరు చేసిన ఒక మంచి ఇప్పుడు అక్కరకు వస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం. మనశాంతి పెరగడానికి చేతనైన దాన ధర్మం చేయండి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకండి. విష్ణుసహస్రనామ పారాయణం శుభాన్నిస్తుంది.

కుంభం
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)

శుభఫలితాలున్నాయి. శక్తివంచన లేకుండా పనిచేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అభీష్టసిద్ధి ఉంది. న్యాయపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ధన లాభాలున్నాయి. గౌరవం పెరగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. ప్రశంసించే వారున్నారు. వాద ప్రతివాదాలకు తావివ్వొద్దు. శుభవార్త ఆనందాన్నిస్తుంది. లక్ష్మీస్తోత్రం పఠించండి. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధువుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. వారం మొత్తం ప్రశాంతంగా గడుస్తుంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

మీనం
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

అదృష్టయోగముంది. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. కొత్తకొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగపరమైన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గురువుల కృపాకటాక్షాలు లభిస్తాయి. సమాజంలో పేరూ గుర్తింపూ సంపాదిస్తారు. ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు సాగండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.అర్హతను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ఇష్టదేవతారాధ‌న శుభాన్నిస్తుంది

– డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

కనకధారా డౌన్లోడ్  భగవద్గీత డౌన్లోడ్

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *