This week Aquarius Horoscope | kumbham Rasi
ఈ రోజు మరియు ఈ వారం కుంభం రాశి ఫలితం :
కుంభం
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల)
ఈ రోజు :
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు సొంతమవుతాయి. తోటివారిని కలుపుకుపోవడం మంచిది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించండి.
ఈ వారం :
విశేషమైన శుభఫలితాలున్నాయి. ఏది తలపెట్టినా మంచే జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగంలో ప్రోత్సాహకరమైన, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను బాగుంటుంది. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఇష్టదైవ దర్శనం శక్తినిస్తుంది.
శంకరమంచి శివసాయి శ్రీనివాస్
This week Horoscope results , Stotrams , Online Horoscope
Ask Your Questions / Share Your Knowledge