Telugu Bhagavatam Poems | Learn Telugu Bhagavatam Poems
నమస్కారం
భాగవత పద్యాలూ నేర్చుకోవాలనే మీ ఆసక్తి అభినందనలు. భాగవతం లో మొత్తం 9000 పైగా పద్య గద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలలో కొన్నింటిని మన తరం వారు మన ముందు తరం వారు కొన్ని పద్యాలూ కలిపి భాగవత మకరందాలుగా , ఆణిముత్యాలుగా పిలుచుకుని చదువుకుని పాడుకుని తరించారు. ఇక్కడ భాగవతం లోని కొన్ని పద్యాలూ నేర్పే ప్రయత్నం చేస్తాను. చాల సులభంగా భాగవత పద్యాలూ మనం నేర్చుకోవచ్చు , చిన్న పిల్లలకు కూడా నేర్పవచ్చు.
> మీరు కనుక ఇక్కడ నేర్పించబోతున్న పద్యాలలో ఒక 30 పద్యాలూ ఆగస్టు 25 లోపు మీరు నేర్చుకుంటే భాగవతం ఆర్గనేషన్ నుంచి మీకు అభినందన సర్టిఫికెట్ మీకు పంపించడం జరుగుతుంది.
> మీరు అందంగా పద్యం పాడి పంపిస్తే టెంపుల్స్ గైడ్ సైట్ లో మీరు పాడిన పద్యాలూ ఉంచడం జరుగుతుంది.
మీకు ఇక్కడ భాగవతం లోని పద్యాలూ, పద్యం యొక్క ప్రతిపదార్ధం, భావం తో పాటు గా ఏ విధంగా పాడాలో ఆడియో ఫైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
పద్యం నేర్చుకునే విధానం :
> ముందుగా పద్యాన్ని 3 సార్లు చదవాలి
> పద్యం చదివిన తరువాత ఆడియో వినండి
> ఆడియో వింటూ పద్యం చూస్తూ ఎలా చదవాలో / పాడాలో అవగాహనా చేస్కోండి
> ముందుగా మొదటి లైన్ లేదా ఒకసారి ఆగేవరకు విని మీరు 3 సార్లు పాడాలి , ఆ తరువాత 2వ లైన్ కి వెళ్ళాలి మరల మూడు సార్లు పాడాలి, ఆ విధంగా వింటూ పాడుతూ నేర్చుకోవాలి.
> ఒక బుక్ పై పద్యాలూ రాస్కోండి
> మీకు వచ్చిన విధంగా పద్యాలు పాడటానికి ప్రయత్నించండి
> అసలు రాగం రాకపోతే మామోలుగా ఐన అప్పగిస్తున్నట్లు అప్పగించండి.
> మీ ఫ్రీ టైం లో మీకు నచ్చిన పద్యం గుర్తుకు తెచ్చుకుని మనసులో పాడుకోండి.
> ఇక్కడ పద్యాలు వరసగా ఇవ్వబడవు , నేర్చుకోవడానికి వీలుగా చిన్న పద్యాల నుంచి కాస్త పెద్దవి ( ఒత్తులతో ఉన్నవి , పలకడం కష్టమైనవి ) ఇవ్వడం జరుగుతుంది.
> కష్టంగా ఉంది అని పద్యాన్ని వదలకండి, చిన్న చిన్న వాటిగా విడకొట్టి తరువాత కలుపుని పాడటం నేర్చుకోండి.
– మీ సందేహాలు పద్యాలక్రింద కామెంట్ చేయండి.
> భాగవతం యాప్ / వెబ్సైటు కోసం Telugu Bhagavatam Website/ App
> టీటీడీ భాగవత పుస్తకాలూ కోసం Bhagavatam Books
> మీరు నేర్చుకోబోయే పద్యాల కోసం Bhagavata Padyalu
వ్యాసమహర్షి సంస్కృతం లో రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన తెలుగు లోకి అనువదించారు. వ్యాసమహర్షి వేదరాశిని ఒక క్రమ పద్దతిలో విభజించి నాలుగు భాగాలను విభజించారు. వేద విభాగం చెయ్యడం వల్ల వ్యాసునకు వేద వ్యాసుడు అని పేరువచ్చింది. మనకు ఉన్న అష్టాదశ పురాణాలు రచించింది కూడా వ్యాసమహర్షి . వ్యాసమహర్షి మహాభారత కాలం నాటి వారు మహాభారతం లో వ్యాసమహర్షి కూడా మనకు కనిపిస్తారు . రామాయణ కాలం లో ఉండి వాల్మీకి ఏ విధంగా ఐతే రామాయణ రచనగావించారో అలానే మహాభారతాన్ని వ్యాసమహర్షి చెప్పగ వినాయకుడు రచించాడు .
భాగవతం కృష్ణ పరమాత్మా యొక్క భక్తుల కధగా చెప్పుకోవచ్చు. భక్తి రసం తో కూడిన గాథలు భాగవతం లో ఉంటాయి . సృష్టి ఆవిర్భావం దగ్గర నుంచి జరిగిన సన్నివేశాలు భాగవతం లో ఉంటాయి. మనషి జన్మ దేనికి ? దేవునికి పూజ చెయ్యాలి ? జీవితం లో ఒక్కసారి కూడా భగవంతుని నామస్మరణా చెయ్యని వాడు కూడా ఆపదలో పిలిస్తే భగవంతుడు పలుకుతాడా లేడా ? భగవంతుడు ఎక్కడున్నాడు ? మనం చేసుకున్న పాపా పుణ్యాలు వాటి ఫలితాలు ? భగవంతుని నామ స్మరణ గొప్పతనం ఇవన్నీ భాగవతం లో వివరించబడతాయి .
ఒక్కొక్క భక్తుని కధ ఒక్కో సందేహాన్ని ఇస్తూ మనల్ని భగవంతునికి మరీంత దగ్గరగా చేస్తాయి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ భాగవతం గురించి వినడం , చదవడం జరగదని పెద్దల చేత చెప్పబడింది.
Bhagavatam App / Website Bhagavatam PDF Books పద్యాలు ఎలా నేర్చుకోవాలి భాగవత పద్యాల లిస్ట్
Nenu bhagavatam padyalu. nerchukuntunnanu Naku chala nachhinayi
Ravi , vizag
Chala chala tq, padyalu easy ga vunnae,
bhagavata padyalu nerchukuntunnanu. chala chakkaa easy way lo nerpistunaru
khammam
Ee padyalu chala bagunnay…. Memu ivi chala baaga nerchukuntunnamu….. Thank you……
Madhuri Grandhi….Dowleswaram