Telugu Bhagavatam 21st Poem | Potana Bhagavatam Books Poems Meaning Audio Download
Potana Telugu Bhagavatam Poems : 21st Poem , Vaalina Bhakti Mrokkeda (1-2)
పోతన గారు ఈ కొత్త పద ప్రయోగం చేసారు. ఆ పదమే వాలిన భక్తి .. అసలు వాలిన భక్తి ఏమిటి, భక్తి వాలడం ఏమిటి ? పద్యం చదివి, ప్రతిపదార్ధ , భావాలను చదివి అర్ధం చేస్కోండి. ఏమి అర్ధమైందో కామెంట్ చేయండి
ఈ పద్యం భాగవతం ప్రధమ స్కంధం లో 2వ పద్యం.
పద్యం :
ప్రతిపదార్ధం :
వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింపలేని; తాండవ = తాండవమనే; కేళి = ఆట ఆడే వాని; కిన్ = కి; దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలికిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంకశశ (కుందేలు) గుర్తు కలవాడు, చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రె ధరించే వాడు; కిన్ = కి; మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ – సరస్సులో పుట్టినది, పద్మం}; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.
భావం :
అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను.
పద్యాల లిస్ట్ పద్యాలు ఎలా నేర్చుకోవాలి Bhagavatam App / Website Bhagavatam PDF Books
Keywords:
Telugu Bhagavatam, Bhagavatam Books, Online Telugu Bhagavatam, Bhagavatam PDF files, Bhagavatam App, Online Bhagavatam Store, Bhagavatam Padyalu.
Adyatmikata pempodinchukovachu