Sri Venkateswara Suprabhatam Audio Download and Meaning in Telugu

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. “సు-ప్రభాతము” అనగా “మంచి ఉదయం” (Good Morning) అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే “సుప్రభాతం” అని అంటారు.

తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా (అంటే 580 సంవత్సరాలుగా) ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

సుప్రభాతాన్ని బంగారువాకిలి ఎదురుగా “తిరుమామణి మంటపం”లో పఠిస్తారు. ఈ సుప్రభాతం కీర్తనలో నాలుగు భాగాలున్నాయి. వెంకటేశ్వర సుప్రభాతం – దేవునికి మేలుకొలుపు : 29 శ్లోకాలు – ఇది ప్రతివాద భయంకర అణ్ణన్ రచించిన భాగం. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలను ధరించిన శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవెంకటేశ్వరునిగా అవతరించి భక్తులను బ్రోచుచున్నాడని, ఆ దేవదేవుని కొలిస్తే సకలార్ధ సిద్ధి కలుగుతుందని సుప్రభాత కీర్తనలో సూచింపబడుతున్నది.

వెంకటేశ్వర స్తోత్రం – భగవంతుని కీర్తన : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి – భగవంతునికి శరణాగతి: 16 శ్లోకాలు – శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి లక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము – పూజానంతరము జరిపే మంగళము : 14 శ్లోకాలు – ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించాడట.

సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన ‘ముడుంబ నంబి’ వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.

Source : Telugu Wikipedia

Keywords ; Tirumala Sri Venkateswara Suprabhatam, Suprabhatam Audio , Venkateswara Suprabhatam Mp3 Download , Devotional Songs Free Download , Hindu Temples Guide ,

Get Bonus Points :

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *