Sahasra Deepalankarana Seva Tirumala Online Ticket Booking Timings Darshan Details

సహస్ర దీపాలంకార సేవ

తిరుమల స్వామి వారికి జరిగే సేవలలో సహస్ర దీపాలంకర సేవ ఒకటి , ఈ సేవ లో 1000 దీపాలు వెలిగిస్తారు.భక్తులే స్వయంగా దీపాలను వెలిగించవచ్చు . ఈ సేవ  మూలవిరాట్ కి కాకుండా ఈ కార్యక్రమం ఆలయం బయట జరుగుతుంది . మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమీతుడిగా మనకు దర్శనం ఇస్తారు,  కొండపైన ఆలయం దగ్గర్లో గల కొలిమి మండపం లో ఈ సేవ జరుగుతుంది.

సమయం :

సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు జరుగుతుంది, సేవ అయినా తరువాత స్వామి వారిని మాడవీధుల్లో ఉరిగేస్తారు.

టికెట్స్ :

ముందుగా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలి , TTD SEVA ONLINE WEBSITE లో టికెట్స్ ఉంచుతారు. 120 రోజులకు వీలుగా టికెట్స్ ఉంచుతారు. ఒక అకౌంట్ కి 2 టికెట్స్ బుక్ చేస్కోవచ్చు . ఒక్కో టికెట్ 200 రూపాయలు .

దర్శనం :

సహస్ర దీపాలంకార సేవ లో పాల్గొన్న భక్తులకు సేవ పూర్తీ కాగానే దర్శనానికి అనుమతి ఇస్తారు. ఒక్కొక్కరికి రెండు లడ్డులు కూడా ఇస్తారు.

డ్రెస్ కోడ్ :

సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలి .

ఆన్లైన్ లో టికెట్ బుక్ చేస్కునే విధానం :

టీటీడీ సేవ ఆన్లైన్ సైట్ లో లాగిన్ అయినతరువాత కుడివైపున దీపం ఐకాన్ కనిపిస్తుంది , దీపం పై క్లిక్ చేసిన తరువాత వేరే పేజీ ఓపెన్ అవుతుంది. select seva క్రింద all అని కనిపిస్తుంది , మీరు all పైన క్లిక్ చేసిన తరువాత Sahasra Deepalankara Seva పై క్లిక్ చేయగానే కేలండర్ ఓపెన్ అవుతుంది .
RED COLOR లో ఉన్న తేదీలకు టికెట్స్ లేవని అర్ధం
Green Color లో ఉన్న తేదీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ,

మీరు తేదీ సెలెక్ట్ చేసిన తరువాత క్రింద ఎన్ని టికెట్స్ కావాలో బాక్స్ లో నెంబర్ ఇవ్వాలి , రెండు టికెట్స్ కంటే ఎక్కువ తీసుకోదు. ఆ తరువాత పేమెంట్ చేయడమే.

తిరుమల / Tirumala Information

Keywords : Tirumala Information , Tirumala Samacharam , Tirumala Updates, Tirumala Seva information

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *