Rishikesh Tour Surrounding Places Temples Information

ఉత్తరాఖండ్ – రిషికేష్- లక్ష్మణ్ ఝులా

ఉత్తరాఖండ్ లో గల రిషికేష్ హరిద్వార్ కు 25 కిమీ దూరం లో ఉంది. హిమాలయాల నుంచి ప్రవహించే  గంగ రిషికేష్ ద్వారా వెళ్తుంది. ఋషికేష్ పేరు రిషికేష్ గా పిలవబడుతుంది. రామాయణ కాలం నుంచి రిషికేష్ పేరు వినిపిస్తూనే ఉంది, శ్రీరాముడు రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కథనం.

ఋషికేశ్ పరిసరాలలోని ఆకర్షణీయమైన పల్లె ఋషికీ రేటీ. శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ‘ శివానంద ఆశ్రమం’ మరియు ‘డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ’ ఉన్నాయి. ఉత్తర ఋషికేశ్, లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి. నీలఖంఠ మహాదేవ్ గుడి ఋషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.

 

ఋషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్థులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద, స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.
రుషికేష్ లో అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పుణ్యకార్యం శ్రీ నీలకంఠేశ్వరస్వామి దర్శనం రుషికేష్ నుంచి 15 km దూరంలో ఎత్తైన కొండలమీద కొలువైయున్న నీలకంఠేశ్వరుడు కొలువై ఉన్నాడు.
Keywords : Uttarakhand Famous Places, Ramayana Related Places, Famous Places,

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *