Potana Telugu Bhagavatam 8th Poem | Bhagavatam Poems with Meaning Audio files PDF Download

Telugu Bhagavatam Poems : Lokambulu Lokeshulu Tegina Tudi , Gajendra Moksham ( 8-75 )

మనం ఇప్పుడు ప్రధమ స్కంధం నుంచి అష్టమ స్కంధం లోకి వచ్చాం. ముందుగా చెప్పినట్టుగానే మనం సులువైన పద్యాలూ కంఠస్తం చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.  అష్టమ స్కంధం లోనే మనందరికీ తెలిసిన గజేంద్ర మోక్షం ,, సముద్రమధనం , కుర్మా అవతారం , హాలాహలం పుట్టడం, శివుడు గరళ భక్షణం చేయడం, సముద్ర మధనం చేయగా ఐరావతం, కల్పవృక్షం , లక్ష్మి దేవి రావడం. అమృతం పంచడానికి జగన్మోహిని రావడం , రాహు వృత్తాంతం , బలిచక్రవర్తి కధ , వామన అవతారం ఈ అద్భుత గట్టాలన్నీ ఈ స్కంధం లోనే ఉన్నాయి.

గజేంద్ర మొక్షం లో కొన్ని పద్యాలూ మనం ఇప్ప్పుడు నేర్చుకుందాం. గజేంద్రుడు మనలా ఎన్నో ప్రశ్నలు వేస్తాడు.. తాను ఎవరిని పడితే వారిని ప్రార్ధించను అంటూ పద్యాలూ చెబుతాడు. అసలు దేవుడు ఉన్నాడా అంటాడు .. కలిమి లేములు చూడని దేవుడు నన్ను ఎందుకు కాపాడాడు అంటాడు .. ఉన్నాడు అనుకుంటున్నా దేవుడు అసలు ఉన్నడో లేడో అంటాడు.. పై ప్రశ్నలు అన్ని ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అడిగినవాడు. చివర దశలో ఓ కమలాప్త ఓ వరద అంటూ శరణాగతి వేడుకుంటాడు.. తరువాత జరిగిన అద్భుతాలు ముందు ముందు చూద్దాం.  ఈ పద్యం అష్టమ స్కంధం లో 75 వ పద్యం.

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

ప్రతిపదార్ధం : 

లోకంబులున్ = లోకములు; లోకేశులున్ = లోకాలనుపాలించేవారు; లోకస్థులు = లోకములలోనుండువారు; తెగిన = నశించినతరువాత; తుదిన్ = కడపట; అలోకంబున్ = కనబడనిది, గుడ్డిది; అగు = అయిన; పెంజీకటి = గాఢాంధకారము; కిన్ = నకు; అవ్వలన్ = ఆవతల; ఎవ్వండు = ఎవడు; ఏక = అఖండమైన; ఆకృతిన్ = రూపముతో; వెలుగున్ = ప్రకాశించునో; అతనిన్ = అతనిని; ఏన్ = నేను; సేవింతున్ = కొలచెదను.

భావం :

లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.

9. వ పద్యం Bhagavatam App / Website Bhagavatam Books భాగవత పద్యాలు ఎలా నేర్చుకోవాలి భాగవత పద్యాల లిస్ట్

Keywords :

Potana Bhagavatam, Bhagavata Poems, Telugu Bhagavatam PDF , Potana Bhagavatam, Telugu Bhagavatam Poems with Meaning,Audio files, Astama Skandam. Lokambulu Lekeshulu , Gajendra Moksham Story.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *