Pithapuram Puruhutika Devi 10th Shakti Peetham | Temple History

పిఠాపురం పురుహూతిక దేవి 10వ శక్తి పీఠం , ఆలయ చరిత్ర :

అష్టాదశ శక్తి పీఠంలలో ఈ పురుహూతిక దేవి ఆలయం ఒకటి. పూర్వం దక్ష యజ్ఞ సమయంలో అమ్మవారు తనువు చాలిస్తే పరమేశ్వరుడు ఆ శరీరాన్ని భుజంపై వేసుకొని రౌద్ర ఆకారంలో తిరుగుతూ ఉంటారు.

లయకారుడు ఆ విధంగా ఉండడం చేత భూభారం అంతా పెరిగినది. ఈ శరీరాన్ని వేరు చేయమని చెప్పి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్దించారు.

విష్ణు మూర్తి పరమశివుడిని శాంతింపజేస్తాడు. మేనక హిమవంతులకి పార్వతిగా అమ్మవారు జన్మిస్తుంది అని చెప్పి పరమశివుడిని శాంతింపచేస్తాడు. ఈ సతీ దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 108 భాగాలుగా ఖండించగా అందులో 101 విశేషంగాను , 52 ముఖ్యముగాను ,27 ప్రధానమైనవిగాను , అందులో 18 అత్యంత ప్రధానమైనవిగా భావించడం జరుగుతుంది. ఈ 18 భాగాలనే అష్టాదశ(18) శక్తి పీఠంలు గా పేరుకొనడం జరుగుతుంది.

ఈ అష్టాదశ శక్తి పీఠంలలో 10వ శక్తి పీఠం మన పురుహూతిక దేవి శక్తి పీఠం. ఇలా ఖండించిన శరీర భాగాలలో అమ్మవారిది పీఠలాగా ఉండే ప్రదేశం. అందుకే ఈ ప్రాంతాన్ని ‘పీఠికాపురం , కాల క్రమంలో పీఠాపురం’ గా మార్పు చెందినది. ఇంద్రుడు శాపంతో భూలోకంలో సంచరిస్తుండగా ఈ ఆలయంలో మొట్ట మొదట పూజాలు నిర్వహించడం వల్ల తనకు ఇంద్ర పదవి లభించినది.

Youtube link :  https://www.youtube.com/watch?v=QA7-lg35k4k

Famous Temples List in Hyderabad District in Telangana State Famous Temples List Hyderabad District in Telangana State

Devotional books Devotional eBooks

kanakadhra stotram Kanankadhara Stotram

 

Key words : Sri Puruhutika Devi Temple, Sri Puruhutika Devi History, Peethapuram Village Temple, Devotional eBooks, Kanakadhara Stotram, Famous Temples list in Hyderabad District in Telangana State, Hindu temples guide

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *