Panchaboota Linga Kshetras History Temples Information | Temples Guide

పంచభూత లింగ క్షేత్రాలు

పంచభూత లింగ క్షేత్రాల లో నాలుగు క్షేత్రాలు తమిళనాడు లో గలవు. ఒక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి క్షేత్రం దగ్గర లో గల శ్రీకాళహస్తి లో ఉంది. ఈ క్షేత్రాలకు ఎంతో చరిత్ర కలదు , ఒక్కో క్షేత్రం లో ఒక్కో స్థలపురాణం కలిగిన క్షేత్రాలు శివుని యొక్క మహిమను తెలియచేయడం తో పాటు నిర్మలమైన భక్తికి భగవతండు ఎలా దిగివస్తాడో , స్వామి వారికి ఆడంబరాలు కంటే భక్తే ప్రధానమైనదని తెలిసే క్షేత్ర పురాణాలతో కలవు పంచభూత క్షేత్రాలు.

మనం ముందుగా ఈ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఆ క్షేత్రాల పూర్తీ విశేషాలు మరల చెప్పుకుందాం .
ఈ పంచభూత లింగ క్షేత్రాలు అన్ని కూడా ఎత్తైన గోపురాలతో విశాల ప్రాంగణం లో నిర్మించబడినవి. తమిళనాడు లో చాల ఆలయాలు ఎత్తైన గోపురాలతో విశాల ప్రాంగణం లో నిర్మించినవే పెద్ద కోనేరులను కూడా మనం తమిళనాడు యాత్ర చేసేటప్పుడు చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రాంతం లో నిర్మించిన గోపురాలు అన్ని కూడా ఎత్తైనవే , భక్తి తో క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఈ గోపురాలు స్వాగతం పలుకుతున్నట్టు దూరం నుంచే కనిపిస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి.

పంచభూతలకు ప్రతీకగా ఆలయం లో మనకు ఆ క్షేత్ర వైభవం కనిపిస్తుంది.

వాయు లింగ క్షేత్రం –

Srikalahasti

వాయు లింగ క్షేత్రం శ్రీ కాళహస్తి లో కలదు , ఈ ఆలయం లో దర్శన సమయం లో స్వామి వారికి ఎదురుగ ఉంచిన రెండు దీపాలలో కుడివైపు దీపం దూరం నుంచి వస్తున్నా గాలి కి ఊగుతున్నట్టు ఎడమవైపు దీపం కంటే ఎక్కువగా ఊగుతుంది. స్వామి వారి తో పాటు ఆ దీపానికి కూడా నమస్కరిస్తారు .

పృద్వి లింగం –

Kanchipuram

పృద్వి లింగం ఈ క్షేత్రం తమిళనాడు లో గల కాంచీపురం లో కలదు. కాంచీపురం లో ఏకామ్రేశ్వర ఆలయమే పృద్విలింగం ఉన్న ఆలయం. ఈ ఆలయం కామాక్షి అమ్మవారి ఆలయానికి , కంచి పీఠానికి దగ్గర్లో ఉంటుంది. ఈ ఆలయం లో పార్వతి దేవి శివుని గురించి తపస్సు చేసిన పురాణ గాథతో కూడినది. స్వామి వారి లింగం పృద్వి లింగం ఈ ఆలయం లో స్వామి వారికి నీళ్లతో అభిషేకం చేయరు . ఏకామ్రేశ్వర ఆలయం లోనే 3000 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉండేది ఆ మామిడి చెట్టుకు నాలుగు కొమ్మలకు నాలుగు రకాలైన మామిడి పళ్ళు కాసేవి , ఆలయం ఎంట్రన్స్ లో మామిడి కాండాన్ని ఉంచారు మనం చూడవచ్చు .

అగ్ని లింగ క్షేత్రం –

Arunachalam

అరుణాచలం తమిళం లో తిరువణ్ణామలై అని పిలుస్తారు. పంచభూత లింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి , అరుణాచలం ఈ రెండు క్షేత్రాలలో కొండ కలిగిన క్షేత్రాలు , ఈ రెండు క్షేత్రాలలో గిరిప్రదిక్షణ కలదు. అరుణాచలం లో శివుడు అరుణాచలేశ్వరుడు గా కొలువైయున్నాడు . ఇక్కడ గిరిప్రదిక్షణ ప్రతి రోజు చేస్తారు , పౌర్ణమి సమయాలలో వేలల్లోను , చైత్ర పౌర్ణమికి లక్షల్లో భక్తులు గిరిప్రదిక్షణ చేస్తారు. 14 కిమీ దూరం నడవాలి , పౌర్ణమి రోజుల్లో చిన్నపిల్లల నుంచి ముసలి వారి దాకా అందరు అరుణాచల శివ అరుణాచల శివా అంటూ గిరిప్రదిక్షణ చేస్తారు. రమణ మహర్షి ఆశ్రమాన్ని తప్పక దర్శిస్తారు. ఈ క్షేత్రం అగ్ని లింగ క్షేత్రం , అరుణాచలం లో శివుడు మూడు రూపాల్లో దర్శనం ఇస్తాడు గుడి లో లింగ రూపం లోను ఆలయం బయట కొండ గాను ఆలయం క్రింద గుహ ఉన్నట్టుగాను దక్షిణ మూర్తి స్వరూపం ఉన్నట్టుగాను చెబుతారు .

జల లింగ క్షేత్రం –

 Tiruvanaikoil

జల లింగ క్షేత్రం జంబుకేశ్వరం లో కలదు , జంబుకేశ్వరం అని అడిగితే ఎవరు చెప్పరు , తమిళం వాళ్ళు తిరువానై కోయిల్ (Tiruvanaikoil) అని అడిగితేనే వారికి తెలుస్తుంది . ఈ క్షేత్రం శ్రీరంగం రెండు కలిసే ఉంటాయి . ఇక్కడ ఆలయం లో అడుగుపెట్టగానే అన్ని క్షేత్రాల్లో ఉన్నట్టుగానే ఎత్తైన గోపురాలు కనిపిస్తాయి . దర్శనానికి స్వామి వారి దగ్గరకు వెళ్ళగానే ఎక్కువమంది వెళ్ళడానికి వీలు లేకుండా చిన్న ద్వారం ఒక ఆరడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. లోపల ఇబ్బందిగా ఒక ఆరుగురు నిలబడవచ్చు . ఆలా ఎందుకు నిర్మించారో తెల్సుకోవాలి అనే ఆసక్తి అందరికి కలుగుతుంది . ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపం లో ఉంటారు , శ్రీ ఆదిశంకర చార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీచక్రం ప్రతిష్టించారు .

ఆకాశ లింగం –

Chidambaram

ఆకాశ లింగం చిదంబర క్షేత్రం . మనం అందరు అనుకున్నట్టు చిదంబరం కేవలం శైవ క్షేత్రం కాదు , విష్ణు క్షేత్రం కూడా ఈ ఆలయం లో 108 వైష్ణ క్షేత్రాల్లో ఒకటి. విశ్వం అంత వ్యాపించి ఉన్నాడు శివుడు .. నీకు చూడటం రావాలి అనే భావనే కలిగించే విధంగా ఇక్కడ రూపం లేని శివుడు మనకు కనిపించడమే చిదంబర రహస్యం . ఇక్కడ స్వామి వారి ఉత్సాహ మూర్తికే ప్రధాన పూజలు అన్ని జరుగుతాయి . నటరాజ స్వామి గా దర్శనం ఇస్తారు .
ఈ పంచభూత లింగ ఆలయాలు అన్ని సుమారుగా ఒకే వరసలో నిర్మించారు . గూగుల్ మ్యాప్ లో కూడా మనం చూడవచ్చు . ఎంతో ప్రాచీనమైన క్షేత్రాలు ఈ ఆలయాలు , ఎందరో రాజులు ఈ ఆలయాలను దర్శించి అభివృద్ధి చేసారు .. గొప్ప గొప్ప భక్తులు ఆ భక్తుల చరిత్రను , స్వామి వారి ఆ భక్తులపై చూపిన కరుణను తలుచుకుంటూ స్వామి వారిపైనే భారం వేస్తూ ప్రతి రోజు ఎందరో భక్తులు ఈ ఆలయాలను దర్శిస్తూ తరిస్తున్నారు .
పంచభూత లింగ క్షేత్రాలలు ఎలా చేరుకోవాలి , వసతి , బస్సు , ట్రైన్ మరియు క్షేత్ర విశేషాలు సవివరంగా ఒక్కో క్షేత్రం గురించి తెల్సుకునే ప్రయత్నం చేద్దాం . స్వస్తి .

Keywords : Panchabhuta linga kshetras, Kanchipuram, sri kalahasti , jambukeswaram , chidambaram , arunachalam, Lord Shiva Famous Temples, Pancha Bhoota Stalam

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *