Bhagavata Padyalu | Palikedidi Bhagavatamata | Potana Telugu Bhagavatam

Potana Bhagavatam Padyam -1

తెలుగు లో భాగవతాన్ని ఎవరు రచించారు అని అడగగానే బమ్మెర పోతన అని వెంటనే సమాధానం ఇస్తాం . కానీ పోతనగారు మాత్రం నేను భాగవతాన్ని రాయడం లేదు/ చెప్పడం లేదు, నా చేత ఆ శ్రీ రామ చంద్ర మూర్తి పలికిస్తున్నాడు అంటూ తన విధేయతను భక్తి శ్రద్ధలను ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు.  

ఈ పద్యం ప్రధమ స్కంధం లోని 18 వ పద్యం.  మనం నేర్చుకోబోయే పద్యాల యొక్క ఆడియో లు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయాలి. 

తెలుగుభాగవతం వెబ్సైటు సహాయం తో పద్యం , పద్యం యొక్క ప్రతిపదార్ధం , భావం తో పాటు ఆడియో ఫైల్ కూడా ఇవ్వడం జరిగింది. 

లికెడిది భాగవత మఁట, 
లికించెడివాడు రామద్రుం డఁట, నేఁ
లికిన భవహర మగునఁట, 
లికెద, వేఱొండు గాథ లుకఁగ నేలా?

ప్రతిపదార్ధం :

పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.

భావం :

వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.

2. వ పద్యం Bhagavatam App / Website Bhagavatam PDF Books పద్యాలు ఎలా నేర్చుకోవాలి  భాగవత పద్యాల లిస్ట్

Keywords :

Palikedidi Bhagavatamata , Bhagavatam Pradama Skandam, Palikedidi , potana padyalu, bhagavata padyalu, 1st poem,  learn bhagavata slokas, bhagavata padyalu, Download telugu bhagavatam Audio files and PDF Files. telugu bhagavatam website, Potana Telugu Bhagavatam PDF Files and Audio files.

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

1 Response

  1. CJSReddy says:

    Good for me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *