మాఘ మాసం వసంతోత్సవాలు | శారద మాత పూజావిధానం

మాఘ మాసం శారదా నవరాత్రులు.

Importance Of Magha masam Hindu Temples Guide

మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు శారదా నవరాత్రులుగా జరుపుకుంటాము. ఇక్కడ నుండి వసంత కాలవాతావరణం కనిపిస్తుంది కనుక ,ఇతర ప్రాంతాలలో వసంతాధి దేవతలు  పూజిస్తారు.వీరి అనుగ్రహం చేత జీవితం లో సర్వాభీష్టాలు తీరి, ఆనందమయంగా ఉండి, ఏమైన అవరోధాలు ఉంటే తొలగిపోతాయి అని శాస్త్రవచనం.ఈ మాఘమాసం మొదలు..అంటే ఈ నెల నుండి, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్సవాలు, లేక వసంత ఉత్సవాలు అనేవి అనేక విధాలుగ జరపబడుతుంటే,మన ప్రాంతంలో ఈ కాలంలో శారదా నవరాత్రులుగా పండుగ జరుపుకుంటాము.

విద్యాధిదేవీ, ఙ్ఞానాధిదేవీ అయిన శ్యామల దేవి కి సంబందించినటువంటి రోజులు ఈ శారదా నవరాత్రులు. ఇవి ఙ్ఞానప్రధానమైన నవరాత్రులు. ఈ రోజుల్లో అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఙ్ఞానం లభిస్తుంది. తొమ్మిది రోజులు వీలుకాని వారు, మాఘ శుద్ధ పంచమి, అనగా శ్రీ పంచమి రోజున మాత్రం ఆ శారదా దేవిని తప్పనిసరిగా పూజించాలి.

‘కాలాత్మక పరమేశ్వర రామ’ అంటారు తత్త్వజ్ఞులు. పరమేశ్వరుడు కాలాత్మకుడు. కాలాత్మకుడు శ్రీరామ చంద్రుడు. మానవుడు కాలజ్ఞానం ద్వారా కూడా పరమేశ్వరారాధన చేయవచ్చని ఆ వాక్యంలోని అంతరార్థం. నిమేషం మొదలుకొని సంవత్సరం వరకు పదకొండు కాల విభాగాలను భారతీయులు గుర్తించారు. అందులో ‘మాసం’ ఒకటి. మఘానక్షత్రంతో కలసి ఉన్న పూర్ణిమ గల కాల ప్రమాణాన్ని ‘మాఘం’ అంటారు. నిజానికి ఏ మాసం ప్రత్యేకత ఆ మాసానిదే.

 

Importance Of Magha masam Hindu Temples Guide

అశ్విని మొదలైన నక్షత్రాల వరుసలో మఘ పదవది. ఏదో ఒక నిమిత్తాన్ని సంభావించి దైవజ్ఞులు అనేక దినాలను పర్వదినాలుగా నిర్దేశించారు. అది నిమిత్తంగా చేసుకొని సర్వమూ తానయైన పరమాత్మను యథాశక్తి అర్చించి త్రికరణశుద్ధిని సాధించాలని వారి ఉద్దేశ్యం. మాఘమాసంలో అటువంటి పర్వదినాలు చాలానే ఉన్నాయి. శ్రీపంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, మాఘపూర్ణిమ, మహాశివరాత్రి అనేవి మరింత వైశిష్ట్యం కలవి. సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే శ్రీపంచమి సరస్వతీ ఆరాధనకు ప్రధానంగా, సంబంధించినది. సరస్వతీదేవి అంటే జ్ఞానశక్తి. అది అంబికాతత్త్వానికి సంకేతం. రథసప్తమి సూర్యనారాయణ రూప పరమాత్మను దృష్టిలో ఉంచుకుని ఏర్పడింది. అంటే అది విష్ణు తత్త్వానికీ, ఆదిత్య తత్త్వానికీ సంబంధించినది. మాఘ పూర్ణిమ విశిష్టతను గూర్చి ఆంద్ర శేషగిరి రావుగారు ‘పండుగలు – పరమార్థాలు’ అనే గ్రంథంలో ఇచ్చిన వివరాలను గమనిస్తే అదంతా జలాధిదేవతకు సంబంధించిన విశేషాంశంగా కనిపిస్తున్నది. దాని ఉప లక్షణంగా తీసుకుని మాఘపూర్ణిమ పంచభూతాల సమాహార రూపార్చన పరమైనది అనుకుంటే అది గణపతి తత్త్వానికి సంకేతంగా నిలుస్తుంది.

Importance Of Magha masam Hindu Temples Guide
మాఘమాస వ్రతాన్ని ఆచరించేవారు ఈ నెలలో నూనె రాసుకుని స్నానము చేయరాదు. అరుణోదయ సమయంలో దైవ స్మరణంతో స్నానం చేసిన వాడు దేవతల చేత కూడా పూజితుడౌతాడని బ్రహ్మపురాణ వచనం.

అస్మిన్ హి భారతే వర్షే కర్మభూమౌ విశేషతః!
అమాఘస్నాయినాం న్రూణాం నిష్ఫలం జన్మకీర్తితం!!
తపోభూమి, కర్మభూమి అయిన భారతదేశంలో జన్మించి కూడా మాఘస్నానం చేయని వారి జన్మ వృథాయని ఈ శ్లోకార్థం.
న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా!
తద్వత్ స్నానేన మాఘస్య న సమాః క్రతుజాః క్రియాః!!
సూర్యుని కాంతికి సాటి లేనట్లే, మాఘస్నాన మహిమకు సాటిగా వచ్చే మరొక క్రతువు కానీ, క్రియ కానీ లేవు.
ఈ మాసంలో ప్రయాగలో స్నానం అతి ప్రాశస్తం. ప్రయాగను స్మరిస్తూ ఇంట్లో స్నానం చేసినా సరే ఉత్తమఫలితం లభిస్తుంది.
స్నానానికి ఈవిధంగా సంకల్పం చెప్పుకోవాలి –
దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ చ!
ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం!!

మాసమంతా విధివిధానంగా స్నానం చేయలేని వారు మూడు దినములైనా లేదా పూర్ణిమనాడైనా విధివిధానాలతో స్నానం చేయాలి.
స్నానానంతరం తిలలు, ఉసిరికలు దానం చేయడం ఉత్తమం. ఈ మాసమంతా శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలను కలుగజేస్తుందని “శివరహస్యం” తెలియజేస్తోంది.

 

Karthika Puranam 22 th Day

 

అక్షరములు అంతా శారదా మయం,కనుక అసలు ఏ రంగమైన సరే..ఒక ఆధ్యాత్మిక రంగము లో సిద్ధించాలంటే ఆ శారదా అనుగ్రహం పొందాలి. ఆవిడే చైతన్య స్వరూపిణి.ఆ అమ్మే జగము అంతా వ్యాపించి, ఆవిడ శక్తిని ప్రసరింపచేస్తోంది.

అలాంటి తల్లిని ఈ నవరాత్రులలో పూజించి, మనము అందరము అమ్మ కటాక్షమునకు పాత్రులం అవ్వుదాము.

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

ఈ సమాచారం తో పాటు టి‌టి‌డి వారి ఉచిత ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చూడగలరు.

January to December 2018 TTD SAPTHAGIRI TELUGU MAGAZINE PDF DOWNLOAD | Complete yearly Sapthagiri Magazine

 

Telugu and Potana Bhagavatam Vol-1

 

Nayanarlu PDF e Books temples guide

 

Keywords : Importance Of Magha Masam, Spl in Magha Masam, Sarada Navaratris, Lord Shiva Poojas in Magha Masam, Hindu Temples Guide.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *