Life History of Sri Sri Sri Jagath Guru Adi Shankaracharya Swami

శ్రీ శ్రీ శ్రీ జగత్తు గురువు ఆది శంకరాచార్య స్వామి జీవిత చరిత్ర :

శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం ,

నమామి భగవత్పాద శంకరం లోక శంకరం.

ప్రపంచం అంతా ఒక ఇంటిగా భావిస్తే అందులో పూజా గది నా ఈ భారతదేశం. ఆ కైలాస శంకరుడే ఈ ధర్మ,వేద , పుణ్య భూమి పై నడిచిన శంకరుడే మన శంకరాచార్య స్వామి.  శంకరాచార్య స్వామి జననం కేరళ రాష్ట్రం లోని ‘కాలడి’ గ్రామంలో జరిగినది.  కాలడి గ్రామంలోనే జరుగుటకు పెద్ద కధ ఉన్నది. ఆ కధ ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ శంకరాచార్య స్వామి జననంకి ముందు :

పూర్వం విద్యాబి రాజు అనే రాజు ఉండే వారు ఆయనకి కుమారుడు శివగురువు. శివగురువు గారి భార్య ఆర్యమాంబ. వీరికి మొదట సంతానం కలుగలేదు. వైదికధర్మని నమ్ముకొని బ్రతికిన కుటుంబం. ఈ శివగురువు ఆర్యమాంబ త్రిసూర్ చేరుకొని మండల పర్యంతం భజన చేశారు. అనగా ఆలయంలోనే ఉండిపోయి స్వామివారికి సేవ చేయడం. 40రోజుల స్వామి భజన చేయగా శివ సాక్షాత్కార్యం కలిగినది. శంకరాచార్య స్వామి వీరికి జన్మించారు. శ్రద్ధతో స్వామిని నమ్మి త్రిసూర్ లోని స్వామిని పూజించారు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

త్రిసూర్ ఆలయం యొక్క ప్రత్యేకత :

ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వాటిలో కాలడి అగ్రహారం ఒకటి. ఈ త్రిసూర్ ప్రత్యేకం కలిగిన ప్రాంతం. కాలడి అగ్రహారం ఎంచుకోవడంలో గల మర్మం అనగా పంచక్రోశం అనేది ఒకటి కలదు. 2 1/4 మైళ్ళు అనగా చాలా శక్తి కలిగిన క్షేత్రంలలో దానికి ఐదు క్రోశలలో దూరంలో ఉన్నట్టువంటి ప్రాంతాలలో అని కూడా ఈ దేవాలయ తేజస్సుచే ప్రకాశిస్తు ఉంటాయి. దీని ప్రకాశం ఈ భూమండలం పై పడుతుంది. కావున ఇక్కడ కూడా ఈశ్వరుని అనుగ్రహం పడుతూ ఉండేటూవంటి ప్రాంతం. అందుకే త్రిసూర్ చాలా గొప్ప ప్రదేశం. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలోకి అర్చక పూజారులు త్రిసూర్ ఆలయంలోకి వెళుతూ ఉంటే ఒక మహారాజు అంతఃపురం లోకి ఎలా వెలుతరో ఆ విధంగా ఊరేరిగింపుగా తీసుకొని వెళ్ళుతారు. ఆరు నెలల పాటు ఈ అర్చక స్వాములు అక్కడే ఆలయంలోనే ఉంటారు. తిరిగి ఇంటికి వెళ్ళేది ఆరు నెలల తరువాతయే. దేవాలయంలోనే  భోజన , స్నాన కార్యక్రమాలు చేస్తూ అక్కడే భజన చేస్తూ ఉంటారు.   ఈ అర్చక స్వాములని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళడం కూడా ఆ విధంగానే తీసుకొని వెళ్ళుతారు. ఈ ఆరు నెలల తరువాత రెండో కుటుంబం అర్చకత్వం కొరకు వస్తుంది. త్రిసూర్ మరో గొప్ప ప్రత్యేకత ఆలయ ఉత్సవ మూర్తి బయటికి వేళ్ళదు. దేవాలయ ప్రాంగణం లోనే  తిరుగుతుంది.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

ఇప్పటికీ కూడా మనం ఈ ఆలయంలో స్వామి వారి కొరకు ఆవు నేయి తీసుకొని వెళ్ళితే అర్చన చేయరు. మన పేరుపై డబ్బు ఇస్తే ఆలయ అర్చకులు వారే ఆవు నేయి  తయారు చేసి ఆ నేయిని స్వామివారికి మన గోత్రనామాలతో పూజా చేసి సమర్పిస్తారు. వేయి ఏళ్ళు నుంచి నేతి ముద్ద గర్భాలయం లో అలాగే ఉంటుంది. అంత నేయి స్వామి శివ లింగం పై ఉన్నకూడా చూట్టు దీపాలు వెలుగుతూ ఉన్న నేయి కరగదు. ఈగ వాలదు. ఒక్క చీమ కూడా పాకదు. ఇంతటి తేజస్సు కలిగిన ఆలయం కావున ఈ తేజస్సు కాలడి పై పడుతుంది. కావున శ్రీ శంకరాచార్య స్వామి ఈ ప్రాంతంనే జన్మించారు.

సదాశివుడే ఆ ఆది శంకరుల రూపంలో భూలోకంలో జన్మించారు. కేరళ రాష్ట్రం , పూర్ణానది ఒడ్డున ఉన్న ‘కాలడి’ గ్రామంలో శ్రీ శంకరులు జన్మించారు. శ్రీ శంకరులు వైశాఖ శుద్ద పంచమి తిధి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు,శని ,గురుడు,కుజుడు , ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. క్రీ.శ 788-820 మధ్య  కేవలం 32 సం|| జీవించి ఉన్నారు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

బాల్యం :

శంకరుల బాల్యంలోనే తండ్రిగారు శివైక్యమ్ చెందారు. శంకరులు ఏకసంతాగ్రహి. బాల్యంలోనే వేదవిద్యలు , సంస్కృతం అభ్యసించారు. బాల బ్రహ్మచారిగా ఉండగా శంకరులు ఒక రోజు భిక్షాటనం చేస్తూ ఒక  పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా భిక్ష వేసేందుకు ఏమి లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ‘ఉసిరి’ కాయని దానం చేసింది. దానికి చలించిన శంకరులు ‘కనకధారాస్తోత్రం’ తో లక్ష్మీ దేవిని ప్రార్దించారు. కనకధారాస్తోత్రంతో పులకించిన ‘లక్ష్మీ దేవి’ బంగారు ఉసిరికాయలు  వర్షింపచేసింది. ఇప్పటికీ ఈ ఇంటికి మనం దర్శించవచ్చు. కేరళ రాష్ట్రంలో కలదు

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

ఒకరోజు శంకరుల తల్లిగారు ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయినాది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్దించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆ విధంగా నది ప్రవాహమార్గం మరే సరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యనికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారం :

సన్యాసం తీసుకునే సమయం అస్సన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినౌతానన్నా కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒక రోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని ఆ విధంగా మరణిచే సమయంలోలోనైనా తాను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించినది. దీనిని ‘ఆతురన్యాసం’ అంటారు. సన్యాసిగా మరే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులని వదిలివేసింది.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

గురువు కోసం అన్వేసిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ‘ప్రాతఃకాలం ,రాత్రి , సంధ్యాసమయాలలో ఏ సమయంలోనైనా స్పృహ లో ఉన్నప్పుడూ , స్పృహ లేనప్పుడు నన్ను తలంచుకోగనే నీ వద్దకు వస్తాను’ అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు.

గోవిందా భగవత్పదుల దర్శనం :

తల్లి అంగీకారం తీసుకొని శంకరులు కాలడి విడిచి గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్లారు. నర్మదా ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవిందా భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించినది. వ్యాస మహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివచించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవుల నుంచి నడిచి వచ్చిన అలసట అంతా ఒకసారిగా తీరిపోయినది.  గౌడపాడుల శిష్యులైన గోవిందా  భగవత్పదులకు నమస్కారం అని స్తోత్రం చేయ్యగా గోవిందా భగవత్పాదులు ‘ఎవరు నువ్వు ?’ అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

sri adi shankara charya swam home hindu temples guide

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖం నేంద్రియం

వా న తేషాం సమూహః

అనైకాంతి కత్వాత్సుషుష్యైక సిద్దిస్త దే కోవ శిష్ట శ్శివః

కేవలోహం.

అనగా నేను నింగిని కాదు , భూమిని కాదు , నీటిని కాదు , అగ్ని ని కాదు, గాలిని కాదు,ఎటువంటి గుణాలు లేని వాడిని ,ఇంద్రియాలు కానీ వేరే చిత్తం గాని లేనివాడిని ,నేను శివుడను . విభజనలేని జ్ఞాన సారాన్ని. ఇలా చెప్పగా గోవిందా భగవత్పదులు మెచ్చుకొని తమ శిష్యరిక్యం ఇచ్చారు. ఆ గురువు వద్ద విద్యలు నేర్చుకొన్నారు.

వారణాసిలో శంకరులు :

గుర్వజ్ఞా తో శంకరులు వారణాసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్య స్నానమాచరించి విశ్వేశ్వరుని సన్నిది లో కొంత కాలం గడిపినారు. అయస్కాంతం ఇనుపరాజను ఆకర్షించినట్లు , వేద సూక్ష్మలు , శంకరులను వారణాసిలో బాగా అవగతమయ్యాయి.వారణాసిలోనే ‘సదానందుడు ‘ అనే బ్రహ్మచారి శంకరులకి ప్రధమ శిష్యుడు అయినాడు.

మనీషా పంచకం :

ఒకరోజు గంగా నది వైపు వెళ్ళుతు ఉండగా మార్గమధ్యలో  నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు , ఆయన శిష్యులు అడ్డు తప్పుకోనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగారు.

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం చండాలుడి లోనైనా , బ్రహ్మణుడి లోనైనా ఒకే విధంగా పని చేస్తుంది. మీరు అడ్డు పడితే తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరన్నా , లేక లోపలనున్నా ఆత్మనా ? ఆ విధంగా అయితే అది ద్వంద్వము అవుతుంది. కానీ అద్వైతం కాదు.

ఆ మాటలు విన్న వెంటనే శంకరులు అంతరార్దం గ్రహించి సాక్షాత్తు ‘పరమశివుడే నాలుగు వేదాలతో’  వచ్చాడని గ్రహించి  మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులను పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యన్ని ఈ విధంగా వివరించాడు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

‘ వేదవ్యాసుడు క్రమబద్దీకరించిన నాలుగు వేదాలను అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు , అప్పటి వరకు బ్రహ్మ సూత్రాలను ఉన్న తప్పుడు అర్దాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తర్వాత ఆ సిద్దాంతం వ్యాప్తికి సంరక్షణకు దేశం నలు మూలలకు శిష్యులను పంపాలి’ ఇలా కర్తవ్యన్ని భోదించి ఆ పనులు అయ్యాక నన్ను చేరుకుంటావు అని చెప్పి శివుడు అంతర్ధానమైనడు.

వ్యాస మహర్షి :

ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకి తాను చేసే ప్రవచనం ముగించి వెళ్ళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్దా బ్రహ్మణుడి వేషంలో అక్కడకి వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాలు మీద చర్చకు  దిగాడు. 8 రోజుల తరువాత వచ్చినది సాక్షాత్తు ‘వ్యాసుడు’ అని గ్రహించి వారికి సాష్టాంగ ప్రణమాం చేసి తన భాష్యలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి ‘బ్రహ్మసూత్రాలు’ అస్సలు అర్ధాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసిచాడు.

వేద వ్యాసుడు నిష్క్రమించడం చూసి శంకరులు , ‘ నేను చేయవలసిన పని అయిపోయింది. నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించమని’ వ్యాసుని కోరగా , వ్యాసుడు ‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకున్ని ఇంకా శైవ దశలోనే ఉన్న ఆధ్యాత్మక స్వేచ్చానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యలను చదవగా కలిగిన ఆనందలోనీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తుంది. బ్రహ్మ నికిచ్చినది 8 సం|| ఆయుర్ధాయనికి అగస్థ్వాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తొడయింది. పరమేశ్వరుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు  లభించుగాక ‘ అని ధీవించి వెళ్ళిపోయారు.

sri adi shankara charya swam home hindu temples guide

శంకరాచార్యుల శిష్యులు :

శంకరులకు అనేకలు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రజ్ఞా పాఠవలకు కొందరు , చర్చల ద్వారా కొందరు , ఓడింపబడిన వారు కొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో కొందరు ముఖ్యులు ఉన్నారు.

పద్మపాదాచార్యులు :

శంకరులు కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను. నా పేరు సనందుడు. నాది చోళ దేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని సంపాదించడం కొరకు వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరాన్ని ఇవ్వమని ప్రార్ధించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు తత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలో ఆ అసూయను పోగొట్టదలచారు. ఒక రోజు గంగా నదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ ఈవలకి వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు సదానందుడి పై అసూయ పడినందువల్ల సిగ్గు పడ్డారు. అప్పటి నుండి సదానందుడు ‘పద్మపాదుడు’ అయ్యరు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

పద్మపాదునికి సంబందించి మరొక కదా కూడా ప్రాచుర్యంలో లో ఉన్నది. శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేశారు. శంకరులు తపస్సు చేసుకొంటు ఈ పరిసరాలలో హిందూ ధర్మ ప్రచారం చేయుచున్న కాలం నందు శంకరులు చేయు కార్యం లు  నచ్చని కొందరు కాపాలికులు ఆయనను అంతమొందించు యత్నంలో ఆ పరిసరాల యందు బీభత్సం సృష్టించుచున్న ఒక పెద్ద దొంగల ముఠా నాయకుడుని రెచ్చగొట్టి కొంత ధనంనిచ్చి పంపిచారు. అతడు ఇదే ప్రదేశంనా  పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనూకగా ఒకే వేటున తల ఎగరగొట్టు ప్రయత్నంనా ముందుకురికాడు. ఇక్కడ ఇది జరుగుతున్నా సమయమన శంకరులు ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయంన ఈశ్వరుని ధ్యానిస్తున అతనికి హఠత్తుగా ఈ దృశ్యం కనిపించేను. వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీ లక్ష్మీనృసింహస్వామి ని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆ దొంగల ముఠా నాయకునిపై ఎటునుండో హఠత్తుగా ఒక సింహం దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో వెళ్లిపోయినది. ఇప్పటికీ శ్రీశైలంలో పాలాధార , పంచధార, అనే ప్రదేశంలో శ్రీ శంకరుల గుడిని దర్శించవచ్చు. ఇక్కడ మరియొక్క ప్రత్యేకత శంకరుని పాదాలు చెక్కబడి ఉంటాయి.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

కుమారిల భట్టును కలవడం :

తన 15వ ఏటా శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒక్కపుడు తను నేర్చుకున్న బౌద్దమాత సిద్దాంతలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా ప్రశ్చాతప్పంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చితం చేసుకునే ప్రయత్నాలల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరుకునే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి బౌద్దనికి వ్యతిరేకంగా తను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యల గురించి తనకు తెలుసునని వాటికి వార్తికలు(వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదాని కూడా వెల్లడించాడు. ప్రాయశ్చితం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని , మహిష్మతి లో ఉన్న తన శిష్యుడైన ‘మండన మిశ్రుడు’ వ్రాస్తాడన్ని చెప్పాడు. శంకరుల దర్శనంతో తన సర్వ పాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు  ‘శివుని పుత్రుడైన కుమారస్వామిగా నిన్ను నేనేరుగుదును.’ నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుంచి నిన్ను రక్షిస్తాను. నా భాష్యలకు వార్తికలు రచించు ‘ అని కొరరు . భట్టు అందుకు నిరాకరించి , మహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని ఓడించి , తన శిష్యునిగా చేసుకొని , అతని చేత వార్తికలు వ్రాయించమని శంకరులకు చెప్పాడు.

మండన మిశ్రునితో తర్కగోష్టి :

మహిష్మతిలో మండన మిశ్రుని ఇంటికి వెళ్ళిన సమయానికి మండన మిశ్రునికి తన తపోశక్తిలో వ్యాసభాగవనుడిని, జైమిని మహామునిని ఆహ్వానించి వారికి అర్ఘ్యాపాద్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడం గమనించి , తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని , అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే మహర్షిలు ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానించాడు. తర్వాత రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు , జైమినిలను ఉండమని అభ్యర్దించాగా మండన మిశ్రుని భార్య అయిన ‘ఉభయ భారతి ‘ సాక్షాత్తు సరస్వతి స్వరూపమని , ఆమెనే న్యాయ నిర్ణేతగా ఉంచి గోష్టి జరపమని వారు చెప్పారు. ఉభయ భారతి మధ్యవర్తిగా ఉండడానికి అంగీకరించినది. వాళ్ళ ఇద్దరి మెడ లలో రెండు పూలమాలలు ఉంచి వాదన సమయంలలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్ళిదారు వాదన ప్రారంభించిన తర్వాత కొంత సేప్పటికి మండన మిశ్రుని మాలా వడలిపోయింది. కానీ భర్త శరీరంలో భార్య సగభాగం కనుక తనని కూడా ఒడిస్తే కానీ తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు.  ఉభయభారతి ఎన్ని చిక్కు ప్రశ్నలు వేసిన శంకరులు అని ప్రశ్నలకు సమాధానాలు చేపగలిగిన ఆమె చివరగా అడిగిన మన్మధ కళలేన్ని , వాటి స్వరూపార్ధలేమీటీ, శుక్ల పక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటే అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరులు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇవ్వమని అడిగారు.

sri adi shankara charya swam home hindu temples guide

కామరూప విద్య :

శంకరులు వంద మంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కపడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ద , ప్రీతి , ధృతి , కీర్తి , మనోభావ , విమల , రతి , మోదిని , ఫెనర్ , మద , మధనోత్పధక , ధీసిని ,వశకరి , రంజని , మొహిని , అనే పదిహేను కళలు నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరభూతురాలిని చేశారు. చివరికి మండన మిశ్రుని త ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి , తన శిష్యునిగా స్వీకరించి సూరేశ్వరాచార్యునిగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.

దిగ్విజయ యాత్రలు :

తర్వాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్రలోని పుణ్యాక్షేత్రాలను , శ్రీశైలం, వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో ‘శివానందలహరి’ని రచించారు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక సందర్భంలోనే శంకరులు శ్రీ లక్ష్మీ నృసింహా స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ సోత్రన్ని ‘శ్రీ లక్ష్మీ నృసింహా కరావలంబ స్తోత్రం’ అని కూడా అంటారు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

తర్వాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని , కొల్లూరులోని మూకాంబికా మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు  హస్తమల కాచార్యుడనే పేరుతో శంకరులకి శిష్యుడైనాడు. తర్వాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యారు. పిదప శంకరులు దక్షిణా , ఉత్తరాలలో తన ‘దిగ్విజయం’ సాగించారు. హిందూ , బౌద్ధ పండితులను వాదనలతో ఓడించి అద్వైతన్ని ఓపించారు. కేరళ , కర్ణాటక , సౌరాష్ట్ర , ప్రాంతాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం , సోమనాధ , ద్వారకా , ఉజ్జయినీ లను దర్శించారు.

Life History of Sri Sri Sri Jagath Guru Adi Shankaracharya Swami

సర్వజ్ఞ పీఠం అధిరోహణ :

శంకరులు కాశ్మీర ప్రాంతంలో శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. ( ఇది ఇప్పుడు పాకిస్తాన్ అక్రమిత ప్రాంతంలో కలదు).  ఆ పీఠానికి నాలుగు దిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్దండ పండితులు ఉన్నారు. కానీ దక్షిణ ద్వారం అంతవరకు తెగువబడలేదు. (అనగా దక్షిణ దేశం నుండి గొప్ప పండితులు లెవరూ రాలేదు). శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు.తన జీవితం చివరి దశలో శంకరులు కేధార్నాథ్ , బద్రినాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు.

sri adi shankara charya swam home hindu temples guide

శంకరులు సాధించిన ప్రధాన విజయాలు :

1. ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , విష్ణుసహస్రనామాలకు , భాష్యాలు రాశారు. తర్వాత శంకరుల అనుసరించిన వారికి శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవ్వి మౌలిక వ్యాఖ్య గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి.

2. శృంగేరి , ద్వారకా , పూరీ , జ్యోతిర్మఠము అనే నాలుగు మఠంలని స్థాపించారు. అవి శంకరుల సిద్దాంతనికి , హిందూ ధర్మానికి నాలుగు దిక్కుల దీపస్తంభాలుగా పని చేస్తునాయి.

3. బౌద్ద మతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో భౌతికంగా ఏ విధమైన బలప్రయోగం లేదు. పండితులతో వాదనలు సాగించి వారిని ఓప్పించి నెగ్గి , శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించారు.

4. గణేశ పంచరత్నం , భజగోవిందం , లక్ష్మీ నృసింహా కరావలంబ స్తోత్రం , కనకధారా స్తోత్రం , శివానంద లహరి , సౌందర్య లహరి , వంటి అనేక రచనలు చేశారు. హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తామవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఉన్నాయి.

ఈ పోస్ట్ ని ఓపికతో చదివినందుకు ప్రతి ఒకరికి పేరు పేరునా మరియు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన రాజా చంద్ర అన్నయ్య గారికి ధన్యవాదలు.  ఈ సమాచారం వల్ల మీరు సంతృప్తి చెందారు అని భావిస్తూ మా సేవలను మరింత మెరుగు పరచడం కొరకు కింద నున్న రేటింగ్ బాక్స్ లో రేటింగ్ ఇవ్వగలరు. ఇట్లు మీ డి.బాల్ నరసింగ్ రావు.

Life history of Sri Adi Shankara charya Swami home Hindu temples guide

 

Key words : Life History of Jagath guruvu Sri Sri Sri Adi Shankaracharya Swami , Shankaracharya Swami Birth Place, About Kaladi , Adi Shankaracharya Swami Biography, Life Achievements, Sri Adi Shankarachaya Swami Childhood, Adi Shankaracharya Sishyas, Trisur Temple, Adi Shankaracharya Writen Books, Adi Shankaracharya Swami Slokas, Kanchi

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *