Jyotirlinga Information | Sri Ujjain Mahakaleshwar Swami Temple

శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని :

Jyotirlinga Information | Sri Ujjain Mahakaleshwar Swami Temple

జ్యోతిర్లింగా ( ద్వాదశ జ్యోతిలింగాలు) క్షేత్రాలలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం క్షేత్రం ఒకటి మరియు శక్తి పీఠం. శ్రీ మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో ఉంది. మహా శక్తివంతమైన క్షేత్రం గా చేబుతారు. ద్వాదశ జ్యోతిలింగా క్షేత్రాలలో దక్షిణం వైపుకు తిరిగి ఉన్న క్షేత్రం మహాకాలేశ్వరమే, ఇక్కడ శివలింగాన్ని దక్షిణ మూర్తి అని కూడా పిలుస్తారు.మహాకాళేశ్వర ఆలయం లో మూడు శివలింగాలు మూడంతస్థులలో ఉంటాయి. మహాకాళేశ్వర లింగం మొదటి అంతస్తు లోను తరువాత ఓంకార లింగం , నాగేంద్ర స్వరూపమైన శివలింగం మూడవ అంతస్తు లోను ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సంతవత్సరానికి ఒకసారి ‘పర్జన్యానుష్ఠానం’ వర్షాకాలం ప్రారంభానికి ముందర చేస్తారు.. ఈ అనుష్టానం పూర్తికాగానే వర్షం వస్తుంటుంది. ఎప్పడినుంచో ఈ తంతు జరుగుతూనే ఉంది.

మహాకలేశ్వరాలయంలో తప్పకుండా చూడవలసింది :

భస్మహరతి ఈ హారతి ఉదయం నాలుగు గంటలకు ( 4 am ) ఇస్తారు. మామోలుగా ఇస్తే మనం ప్రత్యేకంగా చెప్పుకొనేది ఎం ఉంటుంది. ఇక్కడ శివయ్యకు రెండు రకాలుగా విభూదితో అభిషేకం చేస్తారు.. ఒకటి ఆవు పేడతో చేసిన ( ఆవు పిడకలు ) విభూదిని ఒక పలుచని గుడ్డలో గట్టి మూటను లింగం పైన ఉంచుతారు, మరోక మూటతో ఈ విభూది మూటను కొడతారు .అప్పుడు శివలింగం పైనే కాకుండా చుట్టూ విభూది గాల్లోకి లేచి ఒక కొన్ని క్షణాలు శివయ్యను విభూదితో కప్పినట్టుగా ఉంటుండగా మంత్రాలూ చదువుతూంటే .. శంఖాలు, భేరీలు పెద్ద పెద్ద మృదంగాలు మ్రోగిస్తారు .. ఓం నమః శివాయ.. ఓం నమః శివాయ అంటూ వినిపిస్తుంటే.. మనం ఒక అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోతాం.

రెండవది శ్మశానం లోంచి భస్మాన్ని అర్చకులు తీస్కుని వస్తారు..ఆ భస్మ పాత్రని అందరికి ఇస్తారు ఆ భస్మం తో స్వామి వారికి చుట్టూ కూర్చుని అభిక్షేకం చేస్తారు.ఈ హరతికి ఆడవాళ్ళకు ప్రవేశం లేదు, ఒక పదిమంది నాగ సాధువులు మాత్రమే గర్భగుడిలో ఉండి పూజచేస్తారు.. భక్తులు మండపం లో ఉండి తిలకిస్తారు. ఈ హారతి సమయం లో స్వామి చాల అందంగా కనిపిస్తాడు.
ఉజ్జయిని శ్రీ మహాకాలేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని రాష్ట్రంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధ ఆలయం.

మహాకలేశ్వరాలయం దాడులకు గురైనది, ప్రస్తుత నిర్మాణం క్రీ.శ 1736 లో శ్రీమంత్ రానోజీరావు షిండే మహరాజ్ యొక్క జనరల్స్ అయిన శ్రీమంత్ పీష్వా బాజీరావు మరియు ఛత్రపతి షాను మహరాజ్ లచే నిర్మింపబదినది.

Temple Daily Pooja Schedule :

Bhasmarti early morning 4 am.
Morning Pooja 7:00 To 7:30 am
Mid-day Pooja 10:00 to 10:30 am
Evening Pooja 5:00 to 5:30 pm
Aarti Shree Mahakal 7:00 To 7:30 pm
Closing Time 10:00 pm

Ujjain Mahakaleshwar Temple Official Website :Mahakaleshwar

Famous Temple in Ujjain :

మంగళనాథ ఆలయం :

పురాతన గ్రంథాల ప్రకారం, ఇది అంగారక గ్రహం యొక్క జన్మ స్థలం అని నమ్ముతారు.

కాల భైరవ ఆలయం :

ఉజ్జయినీలోని భైరవగాగర్ లో ఉన్న భైరవ ఆలయం కాలి భైరవ ఆలయం. ఇది ప్రధాన నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సందీపని ఆశ్రమం :

సంజీపని ఆశ్రమం అత్యంత పురాతనమైనది మరియు ఉజ్జయినీలోని ప్రసిద్ధ ఆశ్రమాలలో ఒకటి. ఇది గొప్ప మహర్షి సందీపని పేరు పెట్టబడింది. ఆశ్రమం లోపల శివుడికి అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి మరియు ఈ ఆలయం అన్ని ఇతర శివుని దేవాలయాల నుండి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నంది ఈ ఆలయంలో శివుని ముందు నిలబడి ఉంటాడు.

చార్ ధాం ఆలయం:

ఉజ్జయినీలోని చార్ ధాం ఆలయం చాలా అందమైన దేవాలయాలలో ఒకటి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి అన్ని నాలుగు చార్ధామ్లను సందర్శించటమే ఈ ప్రదేశం. ఇది మహాకాలేశ్వర్ ఆలయం వెనుక ఉంది.

Temple Timings : 5 am to 9 pm

శిప్రా నది :

ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరియు ఇండోర్ నుండి 56 కిలోమీటర్ల దూరంలో రాంఘాట్ ఉంది. షిప్ర నది మరియు ఉజ్జయినీ నగరం చరిత్రలో రాంఘాట్ ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. స్టేషన్ నుండి చేరుకోవటానికి 5-10 నిమిషాల సమయం పడుతుంది. ప్రతి 12 సంవత్సరాల తర్వాత నిర్వహించిన కుంభమేళా లేదా సిహస్తహ్ సమయంలో, ఇది నది యొక్క పవిత్రమైన ఘాట్ అని వారు విశ్వసిస్తారు.

హర్షిద్ధి ఆలయం :

హర్షిద్ధి ఆలయం మన దేశంలోని అన్ని శక్తి పీఠాలలో అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఇది శిప్రా నదికి సమీపంలో ఉజ్జయినీలో ఉంది. మాతా హర్షిద్ధి విగ్రహం అద్భుతమైన మరియు అందంగా ఉంది. ఇది దేవుని దృష్టి తరువాత ఒక భక్తి భావాలను ఇస్తుంది. ఆలయంలో మరో 3 దేవతలు ఉన్నారు. 3 దేవతలు అన్నపూర్ణ, మహాలక్ష్మీ మరియు మహాసరస్వతి

బడే గణేష్ ఆలయం :

ఇది ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి సుమారు 1 కి. మీ.ల దూరంలో ఉంది. ఇది మహాకలేశ్వర దేవాలయం నుండి కొన్ని దశలు దూరంలో ఉంది. బడే గణేష్ జీ దేవాలయం ఉజ్జయినీలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. దీనిని బడే గణేష్జీ పేరుతో పిలుస్తారు ఎందుకంటే ఆలయంలో ఆలయంలో గణేష్జీ యొక్క పెద్ద కళాత్మక విగ్రహం ఉంది.

Shree Mahakaleshwar Temple Contact Details :

E-mail: office@mahakaleshwar.nic.in
Tel.: 0734-2550563
Dharmshala: 0734-2551714, 0734 2585873

Sri Mahakaleshwar Swami Temple Pooja and Sevas / Ticket Cost Information : Click Here

Accommodation in Sri Mahakaleshwar Swami Temple :Click Here

Sri Mahakaleshwar Swami Temple Google Map : Click Here

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *