How to Perform Thulabaram at Tirumala Venkateswara Swamy Temple

తులాభారం అనగానే మనకు శ్రీ కృష్ణుడు గుర్తుకు రావడం సహజం. శ్రీ కృష్ణ తులాభారం విని చూసి తరించాం కూడా.. చాలామంది భక్తులు తమ పిల్లలకు తులాభారం వేస్తుంటారు.

భక్తులు ఎవరు ఎలా మొక్కుకుంటే మొక్కుకున్నవి పిల్లవాడు ఎంత బరువు ఉంటే అంత దేవాలయానికి ఇస్తుంటారు. తులాభారం ఇచ్చే వాటిలో ఎక్కువగా డబ్బులు,పటిక బెల్లం, పంచదార .. ఆలా చాలానే ఉన్నాయి. అన్ని ఒక ఎత్తైతే వాటిలో రూపాయి కాసులు మొక్కు కున్నవారు చాలానే ఇబ్బంది పడతారు ఎందుకంటే చిల్లర కోసం.. నెల రోజులు నుంచి రూపాయి కాసులు పోగుచేసి కోవడం పనిలో ఉంటారు. మీరు కూడా అలానే చేసారా ? సరే తిరుమలలో తులాభారం ఎక్కడ వేయించాలి? టికెట్ ఎక్కడ తీసుకోవాలి? మీరు పెద్దగా కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే తిరుమలలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడే ప్రధాన ద్వారం కుడివైపు తులాభారం వేయబడును అని బోర్డు పెట్టి ఉంటుంది. పిల్లవాణ్ణి బరువు చూసి వారు మీకు చెబుతారు ఎంత అమౌంట్ చెల్లించాలి అని.. మీరు డబ్బులు వారికీ ఇవ్వనవసరం లేదు మీరే స్వయంగా హుండీలో వెయ్యవచ్చు. మీరు మొక్కుకున్న వాటి ధర బట్టి మీరు వేస్తె సరిపోతుంది.

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *