How to Apply For Tirumala Srivari Seva | Tirumala Information

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్నికల్పిస్తోంది టీటీడీ.

శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?
తెలుసుకోండి మరి…!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!
ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.
హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.
శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.
వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.
ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.
శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.
సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.
గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.
శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.
కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.
” సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు.”
నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.
తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.
సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

డ్రెస్ కోడ్..!

సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

వివరాలు పంపాల్సిన చిరునామా..!

పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.

How to Apply Srivari Seva Online:

శ్రీవారి సేవ ఆన్లైన్ లో బుక్ చేస్కోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
శ్రీవారి సేవకు బుక్ చేస్కునే ముందు ఆ రోజుల్లో Availability ఉందో లేదో చెక్ చేస్కోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి :
Official Website : http://srivariseva.tirumala.org/
TTD SEVA ( voluntry service ) website:
http://www.tirumala.org/
పై వెబ్సైట్ లో మీరు శ్రీవారి సేవ కు , లడ్డు సేవకు , పరకామణి సేవకు విడివిడిగా బుక్ చేసుకోవచ్చును.

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *