Hanuman Chalisa Lyrics in Telugu | PDF Download | Telugu Stotras | Mp3 Download

హనుమాన్ చాలీసా – Hanuman Chalisa

Hanuman Chalisa Download

Hanuman Chalisa Lyrics , Mp3 Download, PDF Download in Telugu , Telugu Stotras Temples Guide – తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి, అక్కడ కొంతకాలం నివసించాడు. ఒక రోజున తన నిత్యకృత్యాల్లో భాగంగా ‘చంద్రభాగా’ నదిలో స్నానం చేసి, విఠలనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అంధుడి పాదాలు తగిలాయి. అతడు పడిపోయాడు. తులసి వెంటనే ఆ అంధుణ్ని పైకిలేపి, ఆలింగనం చేసుకుని ‘క్షమించు నాయనా! నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి… ఇటు చూడు’ అన్నాడు. అంతే… అంధుడికి చూపు వచ్చింది. పరమానందంతో తులసీదాసు పాదాలపైనపడి “స్వామీ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. మరో జన్మకు నన్ను అర్హుణ్ని చేశారు. ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను” అని అన్నాడు. దానికి తులసీదాసు “నాయనా. ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుణ్ని. విఠల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు. అది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో!” అని చెప్పాడు.

ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. కొన్ని మహిమలు చూపి పారితోషకాలను స్వీకరించవలసినదిగా ఆయనను కోరాడు. దానికి తులసీదాసు తనవద్ద మహిమలు లేవనీ, నిమిత్తమాత్రుడననీ తెలియజేశాడు. ఏవైనా మహిమలు జరిగితే అవి శ్రీరామ చంద్రుని లీలలేనని తెలియజేసాడు. దానికి అక్బరుకు ఆగ్రహం కలిగింది. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. అంతా నిలువునా కంపించిపోసాగారు. చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. తులసికేమీ అర్థం కాలేదు. కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. తనకే కోతులు కనిపించడం లేదే. భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు- ‘స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దరిసెనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు’ అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే, ఎలుగెత్తి వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. ఆంజనేయుని దర్శనమొంది పరమానందభరితమైనాడు. అదే హనుమాన్‌ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది.


దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||

బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||

 

ధ్యానమ్

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |

రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |

బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

 

చౌపాఈ

జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |

జయ కపీశ తిహు లోక ఉజాగర ||

రామదూత అతులిత బలధామా |

అంజని పుత్ర పవనసుత నామా ||

మహావీర విక్రమ బజరంగీ |

కుమతి నివార సుమతి కే సంగీ ||

 

కంచన వరణ విరాజ సువేశా |

కానన కుండల కుంచిత కేశా ||

 

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |

కాంథే మూంజ జనేవూ సాజై ||

 

శంకర సువన కేసరీ నందన |

తేజ ప్రతాప మహాజగ వందన ||

 

విద్యావాన గుణీ అతి చాతుర |

రామ కాజ కరివే కో ఆతుర ||

 

ప్రభు చరిత్ర సునివే కో రసియా |

రామలఖన సీతా మన బసియా ||

 

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా |

వికట రూపధరి లంక జరావా ||

 

భీమ రూపధరి అసుర సంహారే |

రామచంద్ర కే కాజ సంవారే ||

 

లాయ సంజీవన లఖన జియాయే |

శ్రీ రఘువీర హరషి ఉరలాయే ||

 

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |

తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ ||

 

సహస వదన తుమ్హరో యశగావై |

అస కహి శ్రీపతి కంఠ లగావై ||

 

సనకాదిక బ్రహ్మాది మునీశా |

నారద శారద సహిత అహీశా ||

 

యమ కుబేర దిగపాల జహాఁ తే |

కవి కోవిద కహి సకే కహాఁ తే ||

 

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |

రామ మిలాయ రాజపద దీన్హా ||

 

తుమ్హరో మంత్ర విభీషణ మానా |

లంకేశ్వర భయే సబ జగ జానా ||

 

యుగ సహస్ర యోజన పర భానూ |

లీల్యో తాహి మధుర ఫల జానూ ||

 

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |

జలధి లాంఘి గయే అచరజ నాహీ ||

 

దుర్గమ కాజ జగత కే జేతే |

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||

 

రామ దుఆరే తుమ రఖవారే |

హోత న ఆఙ్ఞా బిను పైసారే ||

 

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |

తుమ రక్షక కాహూ కో డర నా ||

 

ఆపన తేజ తుమ్హారో ఆపై |

తీనోఁ లోక హాంక తే కాంపై ||

 

భూత పిశాచ నికట నహి ఆవై |

మహావీర జబ నామ సునావై ||

 

నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా ||

 

సంకట సేఁ హనుమాన ఛుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై ||

 

సబ పర రామ తపస్వీ రాజా |

తినకే కాజ సకల తుమ సాజా ||

 

ఔర మనోరధ జో కోయి లావై |

తాసు అమిత జీవన ఫల పావై ||

 

చారో యుగ పరితాప తుమ్హారా |

హై పరసిద్ధ జగత ఉజియారా ||

 

సాధు సంత కే తుమ రఖవారే |

అసుర నికందన రామ దులారే ||

 

అష్టసిద్ధి నవ నిధి కే దాతా |

అస వర దీన్హ జానకీ మాతా ||

 

రామ రసాయన తుమ్హారే పాసా |

సాద రహో రఘుపతి కే దాసా ||

 

తుమ్హరే భజన రామకో పావై |

జన్మ జన్మ కే దుఖ బిసరావై ||

 

అంత కాల రఘువర పురజాయీ |

జహాఁ జన్మ హరిభక్త కహాయీ ||

 

ఔర దేవతా చిత్త న ధరయీ |

హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||

 

సంకట కటై మిటై సబ పీరా |

జో సుమిరై హనుమత బల వీరా ||

 

జై జై జై హనుమాన గోసాయీ |

కృపా కరో గురుదేవకీ నాయీ ||

 

జో శత వార పాఠ కర కోయీ |

ఛూటహి బంది మహా సుఖ హోయీ ||

 

జో యహ పడై హనుమాన చాలీసా |

హోయ సిద్ధి సాఖీ గౌరీశా ||

 

తులసీదాస సదా హరి చేరా |

కీజై నాథ హృదయ మహా డేరా ||

 

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |

రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||

సియావర రామచంద్రకీ జయ |

పవనసుత హనుమానకీ జయ |

బోలో భాయీ సబ సంతనకీ జయ |

హనుమాన్ దండకం

శివాష్టకం / Shivashtakam
లింగాష్టకం / Lingashtakam
కనకధారా స్తోత్రం / Kanakadhara
స్తోత్రాలు / Stotras

Telugu Stotras

Source : telugu wikipedia

Telugu Storas, Hanuman Chalisa PDF , Hanuman Chalisa Mp3 Download, Chanuman Chalisa Telugu Lyrics and Mp3 Download at Hindu Temples guide

Ask Your Questions / Share Your Knowledge

hindutemples

Temples Guide

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *