Famous Temples List in Wrangal district in Telangana State

వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన దేవాలయల జాబితా

1.  1000 స్తంబాల ఆలయం , వరంగల్ టౌన్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. కాకతీయ కాలం నాటి ఆలయం. ఈ ప్రాచీన కాకతీయుల విశ్వకర్మ స్థపతి ద్వారా నిర్మాణ నైపుణ్యాల పరంగా ఇది ఒక కళా ఖంఢాన్ని మరియు ప్రధాన ఎత్తును సాధించింది. 1136 లో రాజు రుద్రదేవా చే వేయి స్తంబాల ఆలయం నిర్మించింది అని నమ్ముతారు.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 4:00 pm to 7:00 pm.

2.  శ్రీ మల్లన్న స్వామి ఆలయం , కొమరవెల్లి :

కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం లో ప్రధాన దేవత శివ స్వామి మల్లన్నస్వామి గా పూజలు అందుకుంతున్నారు. ఈ ఆలయం తెలంగాణ లోని కొమరవెల్లి గ్రామం , వరంగల్ జిల్లా లోని ఇంద్రకేలాద్రి అనే కొండపై ఉన్నది. N. H. 7 రహదారిపై సిద్ధిపేట్ లో కలదు. కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర కనులపండుగ గా జరుగుతుంది.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 2:00 pm to 8:00 pm.

3.  శ్రీ సమ్మక్క – శ్రీ సారక్క ఆలయం , మేడారం :

సమ్మక్క – సారక్క జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం లో జరిగే గిరిజన ఉత్సవం కుంభమేళా తర్వాత మేడారం జాతర దేశం అత్యంత సంఖ్య లో భక్తులు పాల్గొంటారు. ఈ జాతర లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు పాల్గొంటారు. వరంగల్ నుండి 90 kms దూరం లో ఈ ఆలయం కలదు.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 7:00 pm.

4.  శ్రీ భద్రకాళి ఆలయం , వరంగల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం.  ఈ ఆలయం లో అమ్మవారు భద్రకాళిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం లో శారదా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వరంగల్ నుంచి కేవలం 5 kms దూరం లో ఈ ఆలయం కలదు.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 1:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

5.  శ్రీ నృసింహా స్వామి ఆలయం , హేమాచలం :

శ్రీ ఉగ్ర నృసింహా స్వామి ఆలయం మల్లూరు గ్రామం లో కలదు. ఈ ఆలయానికి 4000 సం || చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయం లో విశేషం స్వామి శరీరం పై చర్మం మన చర్మం లాగే మెత్తగా ఉంటుంది.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 8:00 pm.

6. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం కురవై :

ఈ ఆలయం చాళుక్య రాజవంశం యొక్క ప్రసిద్ధి పాలకుడు “భీమరాజు” నిర్మించినది. జిల్లా కేంద్రం నుంచి 100 kms దూరంలోను మరియు మహబూబాబాద్ నుంచి 9kms దూరంలోనే ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళాలు : 5:00 am to 1:00 pm మరియు 4:00 pm to 7:00 pm.

7.  శ్రీ పద్మక్షీ ఆలయం , హన్మకొండ :

ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. స్థానిక ప్రజలచే “అమ్మ”గా దేవత పద్మక్షీ అని పిలుస్తారు. ఈ అమ్మవారు ఒక కొండపై కొలువై ఉన్నారు. ఈ ఆలయం లో నవరాత్రి మరియు దీపావళి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళాలు : 7:00 am to 12:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

8.  శ్రీ కోటి లింగాల ఆలయం , వరంగల్ :

ఈ ఆలయం శతవాహనుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయం కి సుమారు 300 సం || చరిత్ర కలదు. శతవాహనుల కాలం లో ఈ ప్రాంతం రాజదానిగా ఉండేది అని చారిత్రక పరిశోదకులు భావించారు మరియు ఈ ఆలయం కీర్తి నగర్ కాలనీ లో కలదు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 4:00pm to 7:30 pm.

9.  శ్రీ గణపతి ఆలయం , కాజీపేట్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం విష్ణు పురికాలనీ , కాజీపేట్ జంక్షన్ లో కలదు. గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

10.  శ్రీ సిద్దేశ్వరా ఆలయం , హన్మకొండ :

ఈ ఆలయం చాళుక్య కాలం నాటిది మరియు చాలా పురాతన ఆలయం. హన్మకొండ నుంచి కేవలం 4 kms దూరంలోనే ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు మరియు స్వామి వారి కళ్యాణం ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం కి హన్మకొండ వరకు ట్రైన్ లో చేరుకొని అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయం కి చేరుకోవచ్చు.

ఆలయ దర్శన వెళ్ళాలు : 7:00 am to 12:00 pm మరియు 3:00 pm to 7:00 pm.

11.  శ్రీ రామ లింగేశ్వర (రామప్ప) ఆలయం , పాలంపేట్ :

ఈ ఆలయం 11వ శతాబ్దం కి చెందినది. ఈ మధ్య యుగ ఆలయం ఒక శివాలయం మరియు శిల్పి రామప్ప పేరు పేట్టారు. కాకతీయుల రాజవంశం కళ వైభవం కి ఈ ఆలయం ఒక ఉదాహరణ. ప్రణాళిక మరియు రామప్ప ద్వారా చెక్కబడినది ఈ ఆలయం. ఈ ఆలయం హైదారాబాద్ నుంచి 157kms దూరం లో కలదు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 4:00 pm to 7:00 pm.

12.  శ్రీ సోమేశ్వరా లక్ష్మీ నృసింహా స్వామి ఆలయం , పాలకుర్తి :

ఈ ఆలయం పాలకుర్తి గ్రామం జనగామ జిల్లాలో కలదు. ఈ ప్రాంతం శ్రీ పాల్కురికి సోమనాధుడు కవి పేరు పై పాలకుర్తి అనే పేరు వచ్చినది. ఈ ఆలయంలో శివ , విష్ణు ఆలయాలు ఉన్నాయి. శివరాత్రి , వైకుంట ఏకాదశి రోజులలో రద్ధి అధికం గా ఉంటుంది.

ఆలయ దర్శన వెళ్ళాలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *