Famous Temples List in Ranga Reddy District Telangana State

రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల జాబితా

1. శ్రీ రామ ఆలయం , అమ్మపల్లి :

ఈ ఆలయం 13 వ శతాబ్దానికి చెందినది . ఈ ఆలయం లో రాళ్ళగూడ ప్రాంతం లో ఉంది . ఈ ఆలయం లో శ్రీ రామ నవమి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి. ఈ ఆలయం శంషాబాద్ నుంచి 5 kms దూరం లో కలదు.  ఈ ఆలయంలో సినిమా షూటింగు కు చాలా ప్రసిద్ది కలది.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 1:00 pm మరియు 4:00 pm to 7:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : శంషాబాద్ నుండి TSRTC మరియు ప్రైవేట్ వాహనాలు కూడా ఈ ఆలయానికి వెళ్ళుతాయి.

2. శ్రీ సిద్దేశ్వరా ఆలయం , శిధిలాగుట్ట :

ఈ ఆలయం లో వేడికొండ సిద్దేశ్వరా స్వామి ఆలయం. ప్రకృతి రమణీయుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉంటుంది. ఈ ఆలయం శంషాబాద్ నుండి 4 kms దూరం లో కలదు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 3:00 pm to 6:00 pm

ఆలయానికి చేరుకునే మార్గాలు : శంషాబాద్ నుండి ప్రైవేట్ వాహనాలు ఈ ఆలయానికి చేరుకుంటాయి.

3.  శ్రీ శివ ఆలయం , మహేశ్వరం :

ఈ ఆలయనికి 350 సం || చరిత్ర కలిగినది. ఈ ఆలయాని అక్కన , మాధన్న వారు అభివృద్ధి పరిచారు. ఈ ఆలయంలో నీటి పుష్కరిణి కూడా ఉంది. 3 వైపులా నీటితో ఉండి మధ్యలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయం లో మరొక్క విశేషం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి గా పూజాలు అందుకుంటారు. అమ్మవారు క్రింద అంతస్తులోను , స్వామి వారు పై అంతస్తులో ఉంటారు. ఈ ఆలయం లో శివరాత్రి , నవరాత్రి , చండీ హోమం వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm  మరియు 3:00 pm to 7:30 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు :  శంషాబాద్ నుండి మహేశ్వరం కి చేరుకొని అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలు వెళ్ళుతాయి.

4.  శ్రీ రామలింగేశ్వరా  ఆలయం , బుగ్గ :

ఈ ఆలయనికి 500 సం || చరిత్ర కలిగి ఉన్నది. శివ లింగం క్రింద ఉద్ద్భవించి , ఏడాది పొడవునా నిరంతరంగా ప్రవహిస్తుంది.  ఆలయ సమీపంలో ఒక చెరువు నుండి వచ్చిన నీరు హైదారాబాద్ గుండా ప్రవహించే నది మూసి నది ఈ ప్రదేశం నుండే పుట్టినది.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 2:00 pm to 7:00 pm.

5.  శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం , అనంతగిరి : ఈ ఆలయానికి 400 సం || చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయం నిజం నవాబు కాలం నాటి ఆలయం. ఏకాదశి , పుణ్య తిధి లలో రద్దీ అధికం గా ఉంటుంది. ఈ ఆలయంతో పాటు అనంతగిరి కొండలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 1:00 pm మరియు 3:00 pm to 7:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : ఈ ఆలయం హైదారాబాద్ నుండి 75 kms దూరంలో కలదు.  ముందుగా వికారాబాద్ కి చేరుకొని అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలు కూడా వెళ్ళుతాయి

6.  శ్రీ వేంకటేశ్వరా ఆలయం , అల్వాల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . సుమారు ఈ ఆలయం 18వ శతాబ్దం కి చెందినది. వైకుంఠ ఏకాదశి నాడు రద్దీ అధికం గా ఉంటుంది.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 1:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : సికింద్రాబాద్ నుండి ఈ ఆలయం 10 kms దూరం లో కలదు. సికింద్రాబాద్ నుండి TSRTC వాహనాలు వెళ్ళుతాయి.

7.  శ్రీ వేంకటేశ్వరా ఆలయం , జిలెల్లగూడ :

ఈ ఆలయం  శ్రీ వేంకటేశ్వరా స్వామి స్వయంభూ విగ్రహం.  ఈ ఆలయంలో ధనుర్మాసం , వైకుంఠ  ఏకాదశి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 9:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : మిధాని మరియు దిల్ సుఖ్ నగర్ నుంచి TSRTC బస్ లు కలవు.

8.  శ్రీ రత్న ఆలయం , శామీర్ పేట్ :

ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరా సమేత పద్మావతి , అలివేలు మంగమ్మ కొలువై ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణం 26/ఏప్రిల్/2001 లో ప్రారంబము జరిగి 19/ఫీబ్రవరి/2003 లో పూర్తి అయినాది. కేవలం 22నెలలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. శ్రీ చిన్న జీయర్ స్వామి వారిచే ప్రారంబింబడినది. ప్రతి నెల శ్రీ వేంకటేశ్వరా స్వామి వారికి  అభిషేకం , కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఆలయం లో యజ్ఞశాల , గోశాల , కళ్యాణ హాల్ , మొదలుగునవి ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం 8:00 గంటలకు ప్రత్యేక హారతి ఇస్తారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm  మరియు 4:00 pm to 8:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : ఈ ఆలయం రాజీవ్ గాంధీ హైవే , నుంచి 25kms దూరం లో కలదు. ప్రైవేట్ వాహనాలు మాత్రమే ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

9.  శ్రీ భావిగి  బద్రేశ్వరి ఆలయం , తాండూర్ :

ఈ ఆలయం 1940 లో ప్రారంభించారు. ఈ ఆలయం లో భద్ర్రప్ప స్వామి ఉత్సవాలు ఘనం గా జరుగుతాయి. ప్రతి ఏటా చైత్ర శుక్ల అష్టమి నాడు చైత్ర మాసం లో ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఆలయం లో శివరాత్రి , నవరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 8:00 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : సంగారెడ్డి నుంచి 50 kms వికారాబాద్ నుంచి 40 kms దూరం లో ఉంది. ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

10.  శ్రీ వేంకటేశ్వరా ఆలయం , మైలారం :

ఈ ఆలయం మైలారం , పరిగి ప్రాంతం లో కలదు.  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఏకాదశి రోజు మరియు ముఖ్యమైన పుణ్యా తిధిలలో రద్దీ అధికం గా ఉంటుంది.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00am to 11:00am మరియు 5:00pm to 7:00pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : ముందుగా పరిగి కి చేరుకొని అక్కడి నుండి ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

11. శ్రీ శివ ఆలయం , ఎల్లకొండ :

ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయం సుమారు 1000 సం || చరిత్ర కలిగి ఉన్నది. ముని పగటి సమయం లో శివుడు ఆలయ భక్తుల తపస్సు లో మునిగిపోయాడు అని చరిత్ర లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 3:00 pm to 7:30 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : ఈ ఆలయానికి ముందుగా హైదారాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఈ గ్రామానికి బస్ లు కలవు.

12.  శ్రీ వేంకటేశ్వరా స్వామి ఆలయం , చేవెళ్ళ :

ఈ ఆలయం లో ప్రధాన దేవత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరా స్వామి. ఈ ఆలయం చేవెళ్ళ ప్రాంతం నుంచి 2 kms దూరం లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm  మరియు 3:00 pm to 7:30 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : ఈ ఆలయం హైదారాబాద్ నుండి పరిగి వెళ్ళే మార్గం లో చేవెళ్ళ ప్రాంతం లో కలదు. హైదారాబాద్ నుంచి TSRTC బస్ లు బయలుదెరుతాయి. హైదారాబాద్ నుంచి 40kms దూరంలో కలదు.

13.  నవగ్రహ ఆలయం , ఎన్ కట్ల :

ఈ ఆలయం లో శనైశ్వర స్వామి ప్రధాన దేవత. ఈ ఆలయం ఎంక్కాల్ల గ్రామం , మొమిన్ పేట్ మండలం లో కలదు. గ్రహభాదలు విముక్తి కోసం ఈ ఆలయం దర్శిస్తారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00am to 12:00pm మరియు 3:00pm to 7:00pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : శంకర్ పల్లి నుంచి 20 kms దూరం లోను మరియు హైదారాబాద్ నుంచి 60 kms దూరం లో ఈ ఆలయం కలదు. ఈ ఆలయానికి ప్రైవేట్ వాహనాలు వెళ్ళుతాయి.

14.  శ్రీ వేంకటేశ్వరా ఆలయం , పరిగి :

ఈ ఆలయం లో శ్రావణ మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. బ్రమ్మహోత్సవాలు వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:00pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : హైదారాబాద్ నుంచి పరిగి కి TSRTC బస్ లు బయలుదేరుతాయి. హైదారాబాద్ నుంచి 55 kms దూరంలో కలదు.

15.  శ్రీ రంగనాయక స్వామి ఆలయం , గండిచెరువు :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కి 500 సం || చరిత్ర ఉన్నది. నీరు సరిగా లేని ఈ ప్రాంతం లో శ్రీ రంగనాధుని కృప వలన పంటలు బాగా పండుతున్నాయి అని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ధనుర్మాసం , శ్రీ రామ నవమి ఉత్సవాలు కూడా వైభవం గా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00 pm to 7:30 pm.

ఆలయానికి చేరుకునే మార్గాలు : హయాత్ నగర్ మరియు దిల్ సుఖ్ నగర్ నుంచి బస్ లు కలవు. హయాత్ నగర్ నుంచి ప్రైవేట్ ఆటొ లో కూడా ఈ ఆలయానికి వెళ్ళుతాయి. హైదారాబాద్ నుంచి 32 kms దూరం లో ఈ ఆలయం కలదు.

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *