Famous temples list in Nijamabad district in Telangana State

నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల జాబితా :

1.  శ్రీ నరసింహ స్వామి ఆలయం , నింబాద్రి , బెల్లం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ గ్రామం కి 5 kms దూరం లో కలదు. ఈ ఆలయాని దక్షిణా బద్రీనాథ్ అలయంగా పిలుస్తారు. ఈ ఆలయం లో ప్రత్యేకత స్వామివారికి బిల్వప్రతలతో స్వామివారికి పూజా నిర్వహిస్తారు. వందల సం || చరిత్ర ఈ ఆలయం కి కలదు. కార్తీక మాసంలో ఈ ఆలయం లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:00pm to 7:30pm.

2.  శ్రీ రామాలయం , డిచ్ పల్లి :

ఈ ఆలయం డిచ్ పల్లి రామాలయం లేదా ఖిలా రామాలయం అని పేరు కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు 14వ శతాబ్దానికి చెందిన ఆలయం . కాకతీయుల రాజుల కాలంలో నిర్మించినారు. ఈ ఆలయానికి 105 మెట్లు కలవు. శ్రీ రామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:30pm to 7:30pm.

3.  శ్రీ హనుమాన్ ఆలయం , సారంగాపూర్ :

ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. నిజామాబాద్ పట్టణం నుంచి 13 kms దూరంలో సారంగాపుర్ గ్రామంలో కలదు. ఈ ఆలయానికి 450 సం|| చరిత్ర కలదు. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు బాగా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:00pm to 8:00pm.

4.  శ్రీ రఘునాథ ఆలయం , క్వెలా :

ఈ ఆలయం ఛత్రపతి శివాజీ కాలం నాటి ఆలయం. చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి ఉత్సవాలతో పాటు , రఘునాథ స్వామి ఉత్సవాలు కూడా జరుగుతాయి. నిజామాబాద్ జిల్లా నైరుతి నుంచి 4 kms దూరంలో ఈ ఆలయం కలదు. విగ్రహాలు కూర్మ పీఠం పై ఉండడం ఈ ఆలయంలో ప్రత్యేకత.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:30pm to 8:00pm.

5.  శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం , భీఖుర్ :

ఈ ఆలయం లో స్వామి వారు స్వయంభూ. ఈ ఆలయం కామారెడ్డి నుంచి 15kms దూరంలోను , రాయంపేట నుంచి 10 kms దూరంలోను కలదు. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు స్వామి వారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 11:30pm  తిరిగి 4:00pm to 7:30pm

6.  శ్రీ నరసింహ స్వామి ఆలయం , జనకంపేట్ :

ఈ ఆలయం జనకంపేట్ గ్రామం నుంచి 10 kms దూరంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 18వ శతాబ్దానికి చెందినది ఈ ఆలయం. దక్షిణా భారతదేశం మొత్తంలో అష్ఠముఖి కోనేరు ఈ ఆలయం లో కలదు. ప్రతి సం|| జనవరి 24 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఈ ఆలయంలో జాతర నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:00pm to 7:30pm.

7.  శ్రీ కాలభైరవ స్వామి ఆలయం , రామగిరి , కామారెడ్డి :

ఈ ఆలయం కామారెడ్డి నుంచి 8 kms దూరంలో కలదు. ఇస్సాన్నపల్లి లో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో ప్రత్యేకత భూత,ప్రేత , పిశాచలకి వచలించడానికి ఈ ఆలయానికి చాలా మంది వస్తారు.

దేవాలయ దర్శన సమయం : 7:00am to 11:30pm  తిరిగి 4:30pm to 7:30pm.

8.  శ్రీ లలితా దేవి ఆలయం , న్యాయకుల్ రోడ్ :

ఈ ఆలయాని 20/6/2003 లో నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి మంగళ , శుక్ర వారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. పండుగ రోజులలో ఈ ఆలయం లో రద్దీ అధికంగా ఉంటుంది.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 12:00pm  తిరిగి 4:00pm to 7:30pm.

9.  శివ స్వామి ఆలయం , కంటేశ్వర :

ఈ ఆలయం నిజామాబాద్ నుంచి 18 kms దూరంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 500 సం|| చరిత్ర ఈ ఆలయానికి కలదు. జైనుల కాలం నాటిది అని శాసనాలు ద్వారా తెలుస్తుంది. ప్రతి సం || రధసప్తమి  ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 11:30pm  తిరిగి 4:00pm to 7:30pm.

10.  శ్రీ నవనాధుల సిద్దేశ్వర ఆలయం , సిద్దిలంగూడ :

ఈ ఆలయం నిజామాబాద్ పట్టణం నుంచి 28 kms దూరంలో ఆర్మూర్ గ్రామం కలదు. ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. నవనాధులచే ఈ ఆలయం ప్రతిష్టా కాబడినాది. తెలుగు 2 రాష్ట్రాలలో ఇటువంటి ఆలయం  మరీ యెక్కడా లేదు. శివరాత్రి , నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మొట్ట మొదట 1960లో మెట్ల మార్గాన్ని నిర్మించారు. ఈ ఆలయం నల్లని పెద్ద గుట్టల క్రింద శివాలయం ఆలయం ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 11:30pm  తిరిగి 3:00pm to 7:00pm.

11.  ఎల్లమ్మ ఆలయం , నిజామాబాద్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . 12వ శతాబ్దానికి చెందినది ఈ ఆలయం. ఈ ఆలయం లో శ్రీ రేణుకా ఎల్లమ్మ గ్రామ దేవత గా పూజలు అందుకుంటున్నారు. ప్రతి సం|| అమ్మవారికి కళ్యాణం నిర్వహిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 11:30pm  తిరిగి 4:30pm to 7:30pm.

12. శ్రీ శివాలయం , అంక్స పూర్ :

నిజామాబాద్ జిల్లా అంక్సపూర్ గ్రామం లో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో శివ స్వామి సంతమల్లన స్వామిగా కొలువై పూజలు అందుకుంటున్నారు. సంత మల్లన్న స్వామి దీక్షలు 41 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ దీక్షల సమయం లో ఏ ఒక్క జంతు విక్రయ కార్యక్రమాలు నిర్వహించకుండ ఉండడం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత.

దేవాలయ దర్శన సమయం : 6:00am to 11:00pm  తిరిగి 4:00pm to 7:00pm.

13.  100 స్తంభాల ఆలయం , భోదన్ :

నిజామాబాద్ జిల్లా భోదన్ గ్రామం లో ఈ ఆలయం కలదు.  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు క్రీ.శ 915-927 ఇంద్ర నారాయణవారు నిర్మించారు అని అక్కడి శాసనలో లభ్యమైనది. ఈ ఆలయంలో కళా వైభవం ఎక్కువ. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఈ ఆలయం నేడు శిధిలావస్థకు చేరుకున్నది.

 

temples guide bones points

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *