Famous Temples list in Medak district in Telangana State

మెదక్ జిల్లా లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల జాబితా

1.  శ్రీ సరస్వతి ఆలయం , అనంత సాగర్ :

శ్రీ సరస్వతి క్షేత్రము అనంత సాగర్ , చిన్న కోడూర్ మండల్ సిద్దిపేట్ డివిజన్ లో కలదు. తెలంగాణ లో మెదక్ జిల్లా లో ఉన్న శ్రీ సరస్వతి యొక్క ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం శుక్రవారం 2 May 1980 న శ్రీ నరసింహా శర్మ చే నిర్మించబడినది. ఈ ఆలయం హైదరబాద్ నుండి 125 kms  దూరం లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 5:30 am to 12:30 pm మరియు 3:00pm to 7:00pm.

2.  శ్రీ రాచన్న ఆలయం , జహీరాబాద్ :

శ్రీ రాచన్న స్వామి ఆలయం బాదంపేట గ్రామం లో కలదు.  ఈ ఆలయం లో శ్రీ శివ స్వామి రాచన్న స్వామి పూజలు అందుకుంటున్నారు.  ఈ ఆలయం మెదక్ నుంచి 18 kms దూరం లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:30 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

3.  శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం , జరాసంగం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లో ఒక ” అమృత గుండం ” అనే పుష్కరణి ఉంది. అందులో స్నాన్నం ఆచరించిన చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి అని పేద్ధల నమ్మకం. ఇది మెదక్ జిల్లా జరసంఘం గ్రామం వద్ద కలదు. కేతికి సంగమేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

4.  శ్రీ ఏడు పాయల వనదుర్గామాత ఆలయం , నగసాన్ పల్లి  :

ఏడు పాయల వనదుర్గమాత దేవస్థానం 7 సరస్సులు కలిసే ప్రదేశం. ఇక్కడ దుర్గా మాత ఆలయం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతం అయిన  ఆలయం. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. దుర్గా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

5.  శ్రీ శ్రీ శ్రీ భూనీళ సమేత వరదరాజ స్వామి ఆలయం , వరదరాజ పురం  :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం . ఈ ఆలయం లో ప్రధాన దేవత వరదరాజ స్వామి ఆలయం. ఆలయ ప్రాంగణంలో హనుమాన్  ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రాంగణం లోని గోడలపై ఈ దేవాలయ శాసనాలు ఇప్పటికి కూడా చూడవచ్చు.

ఆలయ దర్శన వెళ్ళలు : 8:00 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

6. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , కుచద్రి :

ఈ ఆలయం కూచన్ పల్లి గ్రామం లో మెదక్ లో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. అప్పట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో ఈ ఆలయంనీ దేవాదాయ ధర్మదయ అధీనంలోకి తీసుకుంది.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:00pm.

7.  శ్రీ సప్త భవాని ఆలయం , ఇస్లాంపేట్ :

ఈ ఆలయం లో అమ్మవారు భవాని మాతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఆలయం ఇస్లాంఖాన్ పేట్ అనే గ్రామం లో కలదు. ఈ ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 4:00pm to 8:00pm.

8. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , భోంత పల్లి :

ఈ ఆలయం లో వీరభద్ర స్వామి తో పాటు అయ్యప్ప స్వామి , ఆంజనేయ స్వామి ఇతర ఉప ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. Bowenpalli నుంచి 33 kms దూరంలో ఈ ఆలయం కలదు. బొంత పల్లి గ్రామం జిన్నారం మండలం లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

9.  శ్రీ నృసింహ స్వామి ఆలయం, నాచారం :

ఈ ఆలయం NH 7 లో కలదు. ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం. ప్రాచీన కాలంలో దీనిని “స్తేత గిరి” అనే నామం కలదు. ఈ ఆలయం హరిద్ర నది అనే ఆనకట్ట దగ్గర లో కలదు. పూర్వం హిరణ్యకశ్యపు నీ చంపిన తరువాత స్వామి కోపం తో ఉండడం వల్ల స్వామిని శాంతి పొందలేక పోయారు. లక్ష్మీ దేవి స్వామి కోసం తపస్సు చేయడం వల్ల స్వామి ఈ ప్రాంతానికి వచ్చి తన కోపాన్ని వదిలాడు అనే కధ ఈ ఆలయంనికి కలదు. ఈ ఆలయం మెదక్ నుంచి 50 kms దూరం లో కలదు.

ఆలయ దర్శన వెళ్ళలు : 5:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:00p.

10.  శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం , జోగిపేట్ :

ఈ ఆలయం హైదరబాద్ నుంచి 100 kms దూరం లో కలదు. ఈ ఆలయం లో రోజు వారి ఉచిత అన్నాదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:30 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

11.  శ్రీ విద్యా సరస్వతి ఆలయం , వర్గల్ :

చాలా మంది సరస్వతి దేవి ఆలయం అనగానే బాసర ఆలయం అని అనుకుంటారు కానీ వర్గల్ లో కూడా శ్రీ సరస్వతి ఆలయం ఉంది. ఈ ఆలయం కాంచి కమకోటి పీఠం అధీనం లో కలదు. ఆలయం వర్గల్ గ్రామం లోని ఒక కొండ పై ఈ ఆలయం కలదు. ఆలయం లో సరస్వతి దేవితో పాటు లక్ష్మీ , గణపతి , శని , ఉప ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు. వసంత పంచమి , దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:30pm.

12.  నవగ్రహ ఆలయం , రాం పూర్ :

పాత నవగ్రహ ఆలయం రాం పూర్ వద్ద కలదు. ఈ ఆలయం లో ప్రధాన దేవత శ్రీ శని భగవానుడు. గ్రహ పీడన వాటికి ఈ ఆలయం లో పూజలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శన వెళ్ళలు : 8:00 am to 12:00 pm మరియు 3:00pm to 6:30pm.

13.  శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం , బీరంగుడ :

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బీరం గూడ అనే గ్రామం అమీన్ పూర్ కి దగ్గర లో కలదు. ఈ ఆలయం 2వ శ్రీశైలం గా పిలువబడుతుంది. ఈ ఆలయం 13 వ శాతబ్దంకి చెందినది. ఈ ఆలయం లో అంతర్గత మార్గం గుండా వెళితే శ్రీశైలం కి చేరుకోవచ్చు అని అక్కడి ప్రజలు నమ్ముతారు. స్థానిక ప్రజలు ఈ స్వామి ని బిరప్ప స్వామి అని కూడా పిలుస్తారు. 1980 తరువాత ఆలయం అబభివృద్ధి జరిగినది. శివరాత్రి  ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి. ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:00pm.

14.  శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , జహీరాబాద్ :

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం జహీరాబాద్ లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. హైదరబాద్ నుంచి 115 kms దూరంలో ఈ ఆలయం కలదు. వైకుంఠ ఏకదాశి , వైభవం గా జరుగుతుంది.

ఆలయ దర్శన వెళ్ళలు : 7:00 am to 12:00 pm మరియు 3:00pm to 8:00pm .

15.  శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం , అల్లందుర్గా పురం :

శ్రీ ఎల్లమ్మ దేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. నాందేడ్ & మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సం|| ఏప్రిల్ లో అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయం దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఆలయ దర్శన వెళ్ళలు : 6:00 am to 12:00 pm మరియు 3:00pm to 7:00pm.

temples guide bones points

 

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *