Famous temples list in Khammam district in Telangana state
ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల జాబితా :
1. శ్రీ రామ ఆలయం , భద్రాచలం :
ఈ ఆలయాలని కంచర్ల గోపన్న నిర్మించారు. ఈ ఆలయం పురాతన ఆలయం. 17 వ శతాబ్దం కి చెందిన ఆలయం. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. భక్తుడిని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం ఈ భద్రాచలం. ఈ ఆలయం లో శ్రీ రామ నవమి , దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ వసతి సౌకర్యాలు ఉన్నాయి.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 3:00pm to 9:30pm.
2. శ్రీ రామ ఆలయం , పర్ణశాల :
శ్రీ రామ స్వామి స్వయంగా ఈ ప్రాంతంలో నివసించేవారు అని భక్తుల నమ్మకం. భద్రాచాల ఆలయం నుంచి ఈ ఆలయానికి 35kms దూరంలో కలదు. శ్రీ సీతా మాత తను వాడినటువంటి కుంకుమ , పసుపు రాళ్ళు ఆరవేసుకున్న చీర గుర్తులు , శ్రీ సీతా దేవి అపహరణ , జటాయువు గుర్తులు ఇక్కడ దర్శించవచ్చు. భద్రాచలం నుంచి ప్రైవేట్ వాహనాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటాయి.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 3:30pm to 8:00pm.
3. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , అంజపురెడ్డిపల్లి :
ఈ ఆలయం అంజపురెడ్డిపల్లి గ్రామంలో కలదు. టౌన్ నుంచి ఈ ఆలయానికి 25kms దూరంలో ఉన్నది. ఈ ఆలయం చాల పురాతన ఆలయం. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:00pm to 7:30pm.
4. శ్రీ సంగమేశ్వరా స్వామి ఆలయం , గార్ల :
ఈ ఆలయం గార్ల గ్రామం లో ఉన్నది. ఈ ఆలయం పురాతన ఆలయం. గార్ల గ్రామంలో ఈ ఆలయం చాల ప్రసిద్ది చెందినది. శివరాత్రి ఉత్సవాలు చాల బాగా నిర్వహిస్తారు.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 11:00pm తిరిగి 3:00pm to 7:30pm.
5. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , గార్లవొడ్డు :
ఈ ఆలయం గార్లవొడ్డు గ్రామం లో కలదు. ఖమ్మం పట్టణం నుంచి ఈ ఆలయానికి 45 kms దూరంలో కలదు. ఈ ఆలయం చిన్న మరియు పురాతన ఆలయం. ఈ ఆలయం లో శనివారం రద్దీ అధికంగా ఉంటుంది.
దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 12:00pm తిరిగి 3:00pm to 7:00pm.
6. శ్రీ వేణుగోపాల , ఆంజనేయ స్వామి ఆలయం , జూల్లుర్పడ్ :
ఖమ్మం జిల్లా జూల్లుర్పాడ్ మండల కేంద్రంలో గల కాకర్ల గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో శ్రీ వేణుగోపాల స్వామి మరియు ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం లో హనుమాన్ జయంతి మరియు శ్రీ రామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. శనివారం రద్దీ అధికంగా ఉంటుంది ఈ ఆలయంలో.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 4:00pm to 8:00pm.
7. గణపేశ్వరాలయం , కుసుమంచి :
ఈ ఆలయం కుసుమంచి గ్రామం ఖమ్మం లో కలదు. ఈ ఆలయం చాల పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. కాకతీయుల శిల్పా కళాకి నిదర్శనం. ఈ ఆలయాని మొత్తం బండరాళ్లతో ఒకదానిపై ఒకటి అమ్మర్చి నిర్మించారు. ఆలయానికి దక్షిణం వైపు వేణు గోపాల స్వామి ఆలయం ఉంటుంది. నేడు శిధిలావాస్తాకి చేరుకుంది.
దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:00pm to 7:30pm.
8. శ్రీ లలితా పరమేశ్వరి దేవి ఆలయం , తక్కెలపల్లి :
ఈ ఆలయం ఖమ్మం జిల్లా ఎరుపాలం మండలం కేంద్రం తక్కెలపల్లి గ్రామం లో కలదు. ఈ ఆలయానికి 30 సం|| చరిత్ర కలదు. దేవి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు.
దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:00pm to 8:00pm.
9. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం , శాస్తా నగర్ , వైరా :
ఈ ఆలయం వైరా గ్రామానికి 25 kms దూరంలో కలదు. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాని నిర్మించారు. ఈ ఆలయం ఆవరణలో అతి పెద్ద 45 అడుగులు కలిగిన హనుమాన్ విగ్రహం ఉన్నది. ప్రతి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామి దీక్షల సమయంలో ఈ ఆలయంలో రద్దీ అధికంగా ఉంటుంది.
దేవాలయాని దర్శించే సమయం : 6:30am to 11:00pm తిరిగి 4:00pm to 8:00pm.
10. శ్రీ నరసింహ స్వామి ఆలయం , ఖమ్మం :
ఈ ఆలయం చాల పురాతన ఆలయం. రెడ్డి రాజులు కాలం నాటి ఆలయం. ఈ ఆలయం లో స్వామి వారు స్వయంభూ స్వామి. ఆలయానికి స్తంభాద్రి అనే నామం కూడా ఉన్నది. ఈ స్వామి ప్రతి రోజు పానకంతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయం ఖమ్మం పట్టణంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి ఆలయం చాల ప్రసిద్ది చెందినది.
దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 12:00pm తిరిగి 4:00pm to 8:30pm.
11. సంగమేశ్వరా ఆలయం , తీర్ధల :
ఖమ్మం జిల్లా రులాల్ మండలం తీర్ధల గ్రామంలో సంగమేశ్వరా స్వామి ఆలయం కలదు. ఈ ఆలయం చాల పురాతన ఆలయం. ఈ ఆలయానికి వందల సం || చరిత్ర కలదు. ఆకేరు ,మున్నేరు , బూగ్గలేరు అనే నదులు సంగమంలో వెలసినది ఈ క్షేత్రము. శ్రీ శ్యాంలంబ , శ్రీ భ్రమరంభ సహితా శ్రీ సంగమేశ్వరా స్వామి ఈ ఆలయంలో ఉన్నారు. శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 3:00pm to 7:30pm.
12. శ్రీ శివాలయం , నేలాద్రి :
ఈ ఆలయం పురాతన ఆలయం. కొన్ని వందల సం|| నుంచి ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం లో రాతి నుంచి నీరు రావడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ నీరు గురించి చాల మంది పరిశోధనలు చేసిన కూడా నీరు ఎక్కడి నుంచి వస్తునాయో కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 11:00pm తిరిగి 3:30pm to 7:30pm.
Ask Your Questions / Share Your Knowledge