Famous temples list in Karimnagar district in Telangana state

కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ది చెందిన ఆలయాల జాబితా :

1.  శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం , వేములవాడ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య వారి కాలం నాటి దేవాలయం. ఈ ఆలయం లో శ్రీ శివ స్వామి వేములవాడ రాజయ్య స్వామిగా పూజలు అందుకుంటునారు. కరీంనగర్ నుంచి ఈ ఆలయం 35 kms దూరంలో కలదు. దేశం లోని అన్నీ ప్రాంతాల నుంచి ఈ ఆలయాని దర్శించడానికి భక్తులు వస్తారు. శివరాత్రి , దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 4:30am to 12:00pm తిరిగి 3:00pm to 9:00pm.

2.  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , కొండగట్టు :

ఈ ఆలయం కూడా చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయం హైదరబాద్ కి 160kms దూరం లోనూ మల్యాల మండలం ముత్యంపేట్ గ్రామానికి 35 kms దూరంలో కలదు. ఈ ఆలయం లో భక్తులు  40 రోజుల పాటు దీక్షలు చేసి స్వామి దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతి , శ్రీ రామ నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 4:30am to 12:30pm తిరిగి 3:00pm to 8:00pm.

3. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , ధర్మపురి :

ఈ ఆలయానికి ధర్మరాయ , ధర్మపురం , ధర్మవూరు అనే నామంలు కలవు. గోదావరి ఒడ్డున ఈ ఆలయం కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు 15వ శతాబ్దం కి చెందినది. జగిత్యాల నుంచి 48 kms దూరంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం 2 ఆలయాల సమూహంగా ఉన్నది. 1 పాత గుట్ట , 2 కొత్త ఆలయం.

దేవాలయాని దర్శించే సమయం : 5:30am to 12:00pm తిరిగి 3:00pm to 8:30pm.

4. శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం , కాళేశ్వరం :

ఈ ఆలయం మహాదేవపురం నుంచి 16kms దూరంలో కలదు. మరియు మంధని పట్టణానికి 36 kms దూరంలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం అయినప్పటికీ 1976-82 మధ్య లో ఈ ఆలయాని పునఃనిర్మించారు. ఈ ఆలయం లో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 5:30am to 12:00pm తిరిగి 3:30pm to 8:30pm.

5. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , కొత్తకొండ :

చుట్టూ కొండల మధ్య ఈ ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది. ముల్కనూర్ గ్రామానికి 8kms దూరంలో కలదు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. ప్రతి సం || జనవరి నెల లో 3 రోజుల పాటు జాతర జరుగుతుంది.

దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 3:00pm to 8:00pm.

6.  శ్రీ శివాలయం , కోటిలింగాల గ్రామం :

ఈ ఆలయం వెల్లుగతూర్ గ్రామం దగ్గర ఈ ఆలయం కలదు. ఈ ఆలయం లో కోటి లింగాల ప్రతిష్ట జరిగినది. చుట్టూ ఎటు చూసిన మొత్తం శివ లింగామూర్తులతో స్వామిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం శాతవాహన కాలం నాటి ఆలయం. అప్పటి కాలం ప్రజలు ఈ ప్రాంతం లో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు. శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:00pm to 7:30pm.

7.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , మంధని :

ఈ ఆలయం ముందిచ్చట శ్రీ వరద రాజ స్వామి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా ఉన్నది. శ్రీ వైష్ణవులు జరిపే పూజలు అందుకుంటూ స్వామి నిత్యం ఈ ప్రాంతాని కాపాడుతూ ఉంటారు. దసరా పండుగ రోజున స్వామి వారిని అశ్వవాహనం పై ఊరేరిగింపు చేసి శమి(జమ్మి) చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

దేవాలయాని దర్శించే సమయం : 5:30am to 12:00pm తిరిగి 3:30pm to 8:30pm.

8. శ్రీ పంచముఖలింగ ఆలయం , రైకల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. సుమారు 11వ శతాబ్దం కి చెందినది. ఈ ఆలయం రైకల్ గ్రామం , కరీంనగర్ లో కలదు. జగిత్యాల నుంచి 25kms దూరంలో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 6:00am to 12:00pm తిరిగి 4:00pm to 7:00pm.

9. శ్రీ ఆది వారహా స్వామి ఆలయం , కమాన్ పూర్ :

ఈ ఆలయం కమాన్ పూర్ గ్రామం కరీంనగర్ లో కలదు. ఈ ఆలయం చారిత్రక కట్టడం. వైకుంఠ ఏకాదశి రోజున రద్ధి అధికం. ఈ ఆలయం ఎక్కువ ప్రచారం కి దూరంలో ఉన్న ఆలయం.

దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 12:00pm తిరిగి 3:00pm to 7:30pm.

10. శ్రీ నవదుర్గ , అయ్యప్ప స్వామి , సాయిబాబా ఆలయలు , కొరట్ల :

ఈ ఆలయాలు నిజం కాలం నాటి ఆలయాలు. 1925 లో ఈ ఆలయం నిర్మాణం జరిగినది. శివ మార్కండేయ ఉప ఆలయలు ఉన్నాయి. నవదుర్గ ఆలయం లో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ గ్రామంలోనే అయ్యప్ప స్వామి , సాయిబాబా ఆలయాలు కూడా దర్శించవచ్చు.

దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 12:00pm తిరిగి 3:30pm to 7:30pm.

11. శ్రీ సహస్ర లింగం ఆలయం , పొలాస :

శ్రీ శివ సహస్ర నామాలను భక్తితో వేయి జంటలు కరకములతో 2015 లో వేద బ్రాహ్మనోత్తముల మధ్య ప్రతిష్టించబడినది. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా పొలాస గ్రామంలో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:30pm to 7:30pm.

12. శివాలయం , నాగు నూర్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. నాగు నూర్ గ్రామం నుంచి 8 kms దూరంలో కలదు. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. నేడు ఈ ఆలయం శిధిలావస్తాకి చేరుకుంది. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

దేవాలయాని దర్శించే సమయం : 7:00am to 11:00pm తిరిగి 3:00pm to 7:30pm.

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

1 Response

  1. K. suryanarayana says:

    Useful information to the public

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *