Famous Temple Details In Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ దేవాలయాలు

1 దుర్గా మల్లేశ్వర స్వారి వార్ల దేవాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే రెండవ పెద్ద దేవాలయం విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయం .
విజయవాడ నగరం లో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది .అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు . దసరా తొమ్మిది రోజులూ వివిధ అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు .

2 శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయం

ద్వారకా తిరుమల ఒక పురాతన పవిత్ర స్థలం మరియు దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రసిద్ద పుణ్య క్షేత్రం .
చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు .కొండ కింద శ్రీ వెంకటేశ్వర స్వామి , కొండ పైన మల్లిఖార్జున స్వామి అల్లయం ఉంటాయి . శైవత్వము , విష్ణుమతం ఒక్కటే అని ఏకత్వం చెప్పి ప్రపంచానికి భరోసా కల్పించే క్షేత్రం .

3 శ్రీ వీర వేంకట సత్య నారాయణ స్వామి వారి దేవాలయం

అన్నవరం భారతదేశం లో ప్రసిద్ద పుణ్య క్షేత్రాలలో ఒకటి .శ్రీ సత్య దేవస్వామి సతీమణి శ్రీ అనంత లక్ష్మి ఒక వైపు , శివుడు మరయొక వైపు కొలువై ఉంటారు . ప్రధాన ఆలయం నాలుగు మూలల నలుగు చక్రాలతో ఒక రధరూపం లో నిర్మించారు .

4 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

తూర్పు కనుమలలో ఉన్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రము సింహాచలo.సింహాద్రి అప్పన్న గా భక్తుల చేత పిలువబడుతూ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్న పుణ్యధామం.కొండమీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 30 మెట్లు ఉంటాయి .

5 శ్రీ భ్రమరాంబ మల్లిఖర్జునస్వమి వారి దేవాలయం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం . శ్రీశైల మల్లన్న అని భక్తులతో పిలువబడే స్వామి వారు భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జునుడిగా దర్శనమిస్తారు. సృష్టికి నాభి స్థానమే శ్రీశైలం . కర్నూలు జిల్లాలోని దట్టమయిన నల్లమల అడవుల్లో , కృష్ణా నదీ తీరం లో, సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో కొలువై ఉంది ఈ క్షేత్రం .

6 శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయం

పంచభూత లింగాలలో ఒకటి వాయు లింగం . కాళహస్తీశ్వరుడు వాయులింగమై భక్తులను అనుగ్రహిస్తున్నారు . పార్వతీ దేవి ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ గా పూజలు అందుకుంటోంది .రాహుకేతు పూజ శ్రీ కాళహస్తి లో విశేషము

7 శ్రీ వరసిద్ది వినాయకస్వామి వారి దేవాలయం

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం అనే గ్రామం లో వరసిద్ది వినాయక స్వామి వారు స్వయంభువు గా వేలిసారనేది భక్తుల ప్రగాడ నమ్మకం .దేవాలయం లో స్వామి వారి పరిమాణము రోజు రోజుకు పెరుగుతుందనేది భక్తుల విశ్వాసము. విగ్రహము చుట్టూ నీఎరు ఎల్లవేళలా ఉండటం గమనించవచ్చు .

8 శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని ప్రసిద్ద ఆలయాల్లో తిరుపతమ్మ దేవాలయం ఒకటి .
ఇది కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు అనే గ్రామం లో , ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది . మున్నేరు నదీ తీరాన కొలువై ఉన్నది .ప్రతియేటా జరిగే తిరునాళ్ళలో లక్షల మంది భక్తులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ని దర్శించుకుంటారు .

9 శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయం

విశాఖపట్టణం నగరానికి సంబందించిన బలమయిన నేపధ్యం కలిగిన చారిత్రాత్మక ప్రదేశం శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మ దేవాలయం.రాజ క్షత్రీయ వంశస్తులు కులదేవతగా భావిస్తారు . అమ్మవారు కోట దగ్గరలోని బురుజు దగ్గర ప్రతిష్టించబడ్డారు కాబట్టి, ఈ ప్రదేశం బురుజుపేట గా పిలువబడుతోంది .

10 శ్రీ నెట్టికంటి ఆoజనేయ స్వామి దేవాలయం

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లోని , అనంతపురం జిల్లా గుంతకల్లు మండలము నందు గల ఒక పుణ్య క్షేత్రము .సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శిస్తూ ఉంటారు . శ్రావణ మాసములో స్వామి అనుగ్రహము కోర్రకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది .

11 శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయము

మహానంది ఆంధ్రప్ర్రదేశ్ లోని కర్నూలు జిల్లలో కల ప్రసిద్ధ శైవ క్షేత్రము. నంద్యాల కు 15 కిలోమీటర్ల దూరం లో ఉంది.
స్వామి వారు మహా నందీశ్వరుడిగా , అమ్మవారు కామేశ్వరీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు . చాళక్యులు 7వ శతాబ్దం లో ఈ ఆలయాన్ని నిర్మిoచారు .

12 శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం

పెదకాకాని లో గల మల్లేశ్వర స్వామి దేవాలయము వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన మహాదేవుడయిన శివుడి యొక్క గొప్ప ఆలయం .గుంటూరు జిల్లలో పెదకాకాని అనే గ్రామం లో ఈ ఆలయం కలదు . రాహు కేతు పూజ కి ఈ ఆలయం ప్రసిద్ది. ప్రతి రోజూ రాహుకాలం లో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు .

13 శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం

పెంచల కోన ఆంధ్రప్రదేశ్ రాష్టం లో , నేల్లూరు జిల్లా రాపూరు మండలం లో ఉంది .భారీ రాతిపై యోగముద్ర రూపములో నరసింహ స్వామి వారు దర్శనమిస్తారు .మహర్షులు తపస్సు చేసిన పరమ పవిత్రధామం. కందలేరు నదీ తీరాన కొలువై ఉంది ఈ క్షేత్రం .

14 శ్రీ నరసింహ ఎర్రన్న స్వామి దేవాలయం

ఉరుకుంద ఈరన్న (వీరన్న) గా భక్తులతో పిలువబడే లక్ష్మీ నరసింహ స్వామి వారు అత్యంత శక్తీ వంతమయిన దేవుడని భక్తుల విశ్వాసం.కౌలాలలం మండలం లోని ఉరుకుంద అనే గ్రామం లో స్వామి వారు భక్తుల అభీష్టాలు నెరవేరుస్తూ కొలువై ఉన్నారు . స్వామి అనుగ్రహం కోసం శ్రావణ మాసం విశేష పూజలు నిర్వహిస్తారు.

15 శ్రీమత్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం

భారతదేశం లోని , ఆంధ్రప్రదేశ్ రాష్టం లో, అనంతపురం జిల్లలో కదిరి అనే గ్రామం లో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు .హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి హిరణ్యకసిపుడిని చంపడానికి కదిరి చెట్టు యొక్క మూలాల నుంచి స్వయంభువుగా ఉద్భవించారని ఆలయ పురాణం.
గర్భ గృహం మరియు ముఖ మండపము త్రేతాయుగం నాటి కళలకు ఉదాహరణ.

16 శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి దేవాలయం

బోయకొండ గంగమ్మ ఆలయం పురాణ కధ కలిగిన శక్తివంతమయిన ఆలయం. శ్రీ గంగమ్మ భక్తులను కష్టాల నుంచి తక్షణమే కాపాడుతుందని భావిస్తారు.పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి సోదరి శ్రీ బోయకొండ గంగమ్మ కు అంకితం చేసారు . ఆపద అని తెలిసిన వెంటనే , వెన్నంటి తన భక్తులను కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం .

temples guide bones points

Ask Your Questions / Share Your Knowledge

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *