Dwarapudi Ayyappa Swamy Temple Information

అయ్యప్ప దేవాలయం

ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్పగుడి తరహలో నిర్మించారు. ఈ దేవాలయము రాజమండ్రి-కాకినాడ రహదారికి చేరువగా ఉండుటవలన ప్రయాణికులకు శోబాయమానముగా కనువిందు చేస్తూ ఉంటుంది. రోడ్దుకు అటువైపున ధవలేశ్వరం-కాకినాడ గోదావరికాలువ ఉంది. వచ్చిన భక్తులు ఈ కాలువలో కాళ్ళు, చేతులు కడుగుకొనుటకు మరియు స్నానాలు చేయుటకు అనుకూలంగా కాలువ వడ్దున మెట్లు నిర్మించారు. గుడి ప్రాంగణం వెలుపల వరుసగా పూజసామాగ్రి, దేవతచిత్రపటాలు ఆటబొమ్మలు ఆమ్మే దుకాణాలు హోటళ్ళు ఉన్నాయి. బయట భక్తుల పాదరక్షలను ఉచితంగా భద్రపరచే గదివున్నది. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం,సగంవిష్ణురూపం) విగ్రహం దర్శనం యిస్తుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కలదు. లోనికి వచ్చిన భక్తులు మొదట గణపతి ఆతరువాత హరహరి దర్సనంచేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడివున్నది .అయ్యప్పగుడి రెండు అంతస్తులగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్పస్వామి వున్న మందిరమున్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరానికి వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం ఉంది. అయ్యప్ప విగ్రహం వున్న మందిరం (గర్భగుడి) పైభాగాన గోపుర నిర్మాణమున్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి. ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారి విగ్రహంవున్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం అమలులోవున్నది.సబరిమలై వెళ్లెలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు.అయ్యప్ప ఆలయప్రాంగణంలో సాయిబాబా ఆలయము. శివాలయము,శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయము వున్నాయి.

సాయిబాబా ఆలయము

అయ్యప్పస్వామిగూడికి వెనుకవైపున దిగువన సాయిబాబా మందిరమున్నది.

శివాలయం

అయ్యప్ప స్వామి వారి మందిరం ప్రక్కనే విశాలమైన ప్రాంగణంలో శివ మరియు .ఈ దేవాలయాల ముఖద్వారంకుఇరువైపుల పూలహారాన్ని తొండంతో ఎత్తి పట్టుకున్న రెండు ఏనుగు బొమ్మలున్నాయి. ముఖద్వారానికి ఎదురుగా,శివాలయం ముందుభాగంలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. వెనుకనే యజ్ఞయాగాదులు నిర్వహించుటకు యాగశాలవున్నది. శివాలయంఒక ప్రక్క పెద్ద నంది విగ్రహం ఉంది.

వేంకటేశ్వర ఆలయము

వేంకటేశ్వర దేవాలయం ఉంది.వెంకటరమణుని గుడిని చాలా వినూత్నంగా గోపురాలకునలువైపులున్న గోడలకు రంగుఅద్దాలను బిగించి నిర్మించారు.వెంకటేశ్వర స్వామి గుడికి ముందువైపున ఒకప్రక్క (ముఖద్వారానికి కుడివైపున తనగుండెను చీల్చి సీతారాములను చూపిస్తున్న హనుమంతుని విగ్రహం ఉంది.

Ask Your Questions / Share Your Knowledge

sudheert

jaggampeta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *